మానవ జీర్ణ గ్రంథులు – లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు
జీర్ణ గ్రంథులు (Digestive Glands in Human Digestive System)
| గ్రంథి |
స్థానం |
రకాలు / కణాలు |
స్రవించే పదార్థాలు |
ప్రధాన విధులు |
| లాలాజల గ్రంథులు |
ఆహారనాళానికి అనుబంధంగా ఉంటాయి.
|
- 1. పెరోటిడ్ గ్రంథులు
- 2. అధోజంబికా (Submandibular)
- 3. అధోజిహ్వికా (Sublingual)
- సీరస్ కణాలు
- శ్లేష్మ కణాలు
|
- నీరు
- విద్యుద్విశ్లేష్యకాలు
- శ్లేష్మం
- టయలిన్ / లాలాజల ఎమైలేజ్
- లైసోజైమ్
|
- పిండిపదార్థాల జీర్ణక్రియ ప్రారంభం
- ఆహారాన్ని తడిగా చేయడం
- లైసోజైమ్ ద్వారా బ్యాక్టీరియాను నాశనం చేయడం
|
| జఠర గ్రంథులు |
జీర్ణాశయం గోడలలో ఉపకళా పొర దిగువన
|
గ్రంథుల రకాలు
- హార్దిక గ్రంథులు
- జఠర నిర్గమ గ్రంథులు
- ఫండిక్ / ఆక్సింటిక్ గ్రంథులు
కణాలు
- శ్లేష్మ గ్రీవ కణాలు
- ముఖ్య (Chief) కణాలు
- ఆక్సింటిక్ (Parietal) కణాలు
|
- శ్లేష్మం
- పెప్సినోజన్
- ప్రోరెనిన్
- జఠర లైపేజ్
- హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl)
- కాసిల్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్
- గాస్ట్రిక్ హార్మోన్
|
- ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రారంభం
- జఠరంలో ఆమ్ల వాతావరణం కల్పించడం
- విటమిన్ B12 శోషణకు సహాయం
- ఆహారంలోని సూక్ష్మజీవులను నాశనం చేయడం
|
| ఆంత్ర గ్రంథులు |
చిన్న ప్రేగు గోడలలో
|
- బ్రన్నర్ గ్రంథులు
- లీబర్ కూన్ గుహికలు
- పనీత్ కణాలు
|
సక్కస్ ఎంటెరికస్ (ఆంత్రరసం)
- డైపెప్టిడేజ్
- ట్రైపెప్టిడేజ్
- అమైనోపెప్టిడేజ్
- సుక్రేజ్ (ఇన్‌వర్టేజ్)
- మాల్టేజ్
- లాక్టేజ్
- ఆంత్ర లైపేజ్
- ఎంటిరోకైనేజ్
- లైసోజైమ్
|
- పిండిపదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల పూర్తి జీర్ణక్రియ
- ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌లను చైతన్యవంతం చేయడం
- బ్యాక్టీరియాను నాశనం చేయడం
|
జీర్ణ గ్రంథుల ముఖ్యాంశాలు
| అంశం |
వివరణ |
| ఆహారనాళంలోని జీర్ణ గ్రంథులు |
జఠర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, లీబర్ కూన్ గుహికలు |
| అనుబంధ జీర్ణ గ్రంథులు |
లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం (Pancreas) |
| లాలాజల pH |
6.8 |
| జఠరరసం pH |
0.9 – 1.8 |
| ఆంత్రరసం pH |
7.5 – 8.0 |
| విటమిన్ B12 శోషణకు అవసరమైన పదార్థం |
కాసిల్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ |
| బ్యాక్టీరియాను నాశనం చేసే ఎంజైమ్ |
లైసోజైమ్ |
| స్టార్చ్ జీర్ణక్రియ ప్రారంభించే ఎంజైమ్ |
టయలిన్ (లాలాజల ఎమైలేజ్) |
0 Comments