
దాదాబాయి నౌరోజీ Dadabhai Naoroji Biography in Telugu | Indian History in Telugu
దాదాబాయి నౌరోజీ భారతీయ రాజకీయాల్లో తలపండిన నేత. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు. భారత స్వాతంత్ర పోరాటంలో ఆర్థిక వేత్తగా, పాత్రికేయుడిగా, రచయితగా విశేషమైన కృషి చేశాడు. అందుకే ఇతనిని ‘‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’’ గా కీర్తిస్తారు. ఈయన 04 సెప్టెంబర్ 1825న బ్రిటిష్ ఇండియాలోని బొంబాయిలో జన్మించారు. ఇతను భారతదేశంలోని జోరాస్ట్రియన్ కమ్యూనిటీ అయిన పార్సీ కుటుంబానికి చెందినవాడు. బాల్యంలో విద్యాభ్యాసం గుజరాత్‌లో పూర్తి చేయగా తర్వాత బొంబాయిలోని ఎల్పిన్‌స్టోన్ కళాశాలలో చదివాడు. దాదాబాయి నౌరోజీ సెంట్రల్ ఫిన్స్‌బరి నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరపున బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికకైన తొలి భారతీయునిగా గుర్తింపు పొందాడు. ఇతను లండన్ తూర్పు ఇండియా సంఘం, లండన్ ఇండియన్ సోసైటీ, పార్శీ రిఫార్మ్స్ అసోసియేషన్, ధ్యాన ప్రకాశ మండలి, బాంబే అసోసియేషన్ వంటి సంస్థలను స్థాపించాడు. రస్త్‌గోప్తర్, వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికలు నడిపాడు. హ్యూమ్‌కి రాజకీయ గురువు కాగా, మహమ్మద్ అలీ జిన్నాకి గురువుగా వ్యవహరించాడు. ఇతను 30 జూన్ 1917న మరణించినాడు.
వ్యక్తి పేరు | దాదాబాయి నౌరోజీ |
విశిష్టత | భారత స్వాతంత్ర సమరయోధుడు |
జననం | 04 సెప్టెంబర్ 1825 |
పత్రికలు | రస్త్‌గోప్తర్, వాయిస్ ఆఫ్ ఇండియా |
రచనలు | పావర్టీ ఆఫ్ ఇండియా, పావర్టీ అండ్ అన్ బ్రిటీష్ రూల్ ఆఫ్ ఇండియా |
సంస్థలు | లండన్ తూర్పు ఇండియా సంఘం, లండన్ ఇండియన్ సొసైటీ, పార్శీ రిఫార్మ్స్ అసోసియేషన్, ధాన్య ప్రకాశ మండలి, బాంబే అసోసియేషన్ |
మరణం | 30 జూన్ 1917 |
0 Comments