
గుప్తుల కాలం నాటి నాణెములు
Indian History in Telugu
గుప్తుల కాలంలో నాణెములకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలు వస్తువుల వినిమయానికి నాణెములను వాడేవారు. గుప్త రాజులు తమ పాలనను ప్రతిబింబించేలా నాణెములను ముద్రించారు. గుప్తుల కాలంలో బంగారం మరియు వెండితో నాణెములను ముద్రించారు. వీరు నాణెములపై దేవతామూర్తులైన లక్ష్మి, విష్ణువు, స్కంధుడులతో కూడిన ప్రతిమలను ముద్రించారు.
- మొదటి చంద్రగుప్తుడు నాణెములపై ఒక వైపు తన యొక్క రూపాన్ని, రెండవ వైపు తన భార్య కుమారుదేవి రూపాన్ని ముద్రించాడు.
- సముద్రగుప్తుని కాలంలో వాయించే వీణ, పులితో యుద్ధం చేసే విన్యాసం, అశ్వమేధయాగ చిహ్రం, పులి వంటి బొమ్మలతో బంగారు, వెండి నాణెములను ముద్రించాడు.
- రెండవ చంద్రగుప్తుని కాలంలో సింహంతో యుద్ధం చేయడం, లక్ష్మి గరుడ బొమ్మ, పరమ భాగవత రూపాలతో నాణెములను ముద్రించాడు.
- కుమారగుప్తుని కాలంలో నెమలికి మేత వేయడం, కార్తికేయ దైవం, అశ్వమేధయాగం చిహ్నం వంటి బొమ్మలతో బంగారు వెండి నాణెములను ముద్రించాడు.
0 Comments