General Science : Electrical Resistance | Electrical Resistance, Conductivity & Resistivity

Electrical Resistance

విద్యుత్తు నిరోధం | Electrical Resistance and Resistivity Explained in Telugu 


అంశం వివరణ
విద్యుత్తు నిరోధం విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకునే పదార్థ లక్షణాన్ని విద్యుత్తు నిరోధం అంటారు.
సింబల్ R
ప్రమాణం ఓమ్ (Ohm)
సూత్రం R = V / I
కొలిచే పరికరాలు • ఓమ్ మీటర్
• మల్టీమీటర్
• మీటర్ బ్రిడ్జ్
• మెగామీటర్
ఉత్తమ వాహకాలు వెండి, రాగి, అల్యూమినియం
ఎక్కువ నిరోధం గల పదార్థాలు టంగ్‌స్టన్, నిక్రోమ్, మాంగనిన్
విశిష్ట నిరోధం (Resistivity)
నిర్వచనం ప్రమాణ పొడవు మరియు ప్రమాణ మందం గల వాహకంలో ఉండే నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు.
సింబల్ ρ (రో)
సూత్రాలు R = ρL / A

ρ = RA / L
SI ప్రమాణం ఓమ్-మీటర్ (Ωm)
ఆధారపడేది • పదార్థ స్వభావం
• ఉష్ణోగ్రత
ఆధారపడనివి • వాహక పొడవు
• మధ్యచ్ఛేద వైశాల్యం
ఉదాహరణ టంగ్‌స్టన్‌కు విశిష్ట నిరోధం ఎక్కువగా ఉండుట వల్ల బల్బ్ ఫిలమెంట్‌గా ఉపయోగిస్తారు.
వాహకత్వం (Conductivity)
నిర్వచనం విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని వాహకత్వం అంటారు.
సూత్రం σ = 1 / ρ
SI ప్రమాణం సిమెన్స్ / మీటర్
నిరోధాల శ్రేణి సంధానం
సూత్రం R = R₁ + R₂ + R₃ + ....
లక్షణం శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం పెరుగుతుంది.
ఫలితం • విద్యుత్తు ప్రవాహం తగ్గుతుంది
• పొటెన్షియల్ భేదం మారుతుంది
విద్యుత్తు నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలు
1. పదార్థ స్వభావం వేర్వేరు పదార్థాలకు వేర్వేరు నిరోధ విలువలు ఉంటాయి. వెండి అత్యుత్తమ వాహకం.
2. వాహకం పొడవు వాహకం పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది.

R ∝ L
3. వాహకం మందం వాహకం మందం పెరిగితే నిరోధం తగ్గుతుంది.

R ∝ 1/A
4. ఉష్ణోగ్రత • వాహకాలలో ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతుంది
• అర్థవాహకాలలో ఉష్ణోగ్రత పెరిగితే వాహకత్వం పెరుగుతుంది
• తక్కువ ఉష్ణోగ్రత వద్ద అతివాహకత్వం ఏర్పడుతుంది
అతివాహకత (Super Conductivity)
నిర్వచనం విద్యుత్తు నిరోధం పూర్తిగా లేకుండా విద్యుత్తు ప్రసారం జరిగే స్థితిని అతివాహకత అంటారు.
కనుగొన్న శాస్త్రవేత్త కామర్లింగ్ ఓన్స్
ముఖ్యమైన సూత్రాలు
R = V / I ఓమ్ సూత్రం
R ∝ L పొడవుకు అనులోమం
R ∝ 1/A మందానికి విలోమం
R = ρL/A నిరోధ సూత్రం
σ = 1/ρ వాహకత్వం

Also Read :




Also Read :


Post a Comment

0 Comments