| అంశం |
వివరణ |
| హైడ్రోజన్ స్థానం |
ఆవర్తన పట్టికలో మొదటి మూలకం హైడ్రోజన్. ఇది అత్యంత తేలికైన మూలకం. |
| పరమాణు సంఖ్య & భారం |
సాధారణ హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1, పరమాణు భారం 1. |
| ప్రోటియం |
న్యూట్రాన్లు లేని ఒకే ఒక కేంద్రకం హైడ్రోజన్. దీనినే ప్రోటియం అంటారు. |
| ఐసోటోపులు |
హైడ్రోజన్‌కు డ్యూటీరియం, ట్రిటియం అనే సమస్థానీయాలు ఉన్నాయి. |
| డ్యూటీరియం |
డ్యూటీరియంనే భార హైడ్రోజన్ అంటారు. |
| ట్రిటియం |
ట్రిటియం ఒక రేడియోధార్మిక కేంద్రకం. |
| ఇంధనంగా హైడ్రోజన్ |
హైడ్రోజన్ అత్యుత్తమ ఇంధనం. దీన్ని మండించినప్పుడు నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. |
| కాలుష్యం |
హైడ్రోజన్ వాడకం వల్ల వాతావరణ కాలుష్యం ఉండదు. |
| నక్షత్రాల్లో పాత్ర |
నక్షత్రాల్లోని శక్తికి మూలాధారం హైడ్రోజన్. |
| కేంద్రక సంలీన చర్య |
హైడ్రోజన్ ఐసోటోపులు కేంద్రక సంలీన చర్య ద్వారా అధిక శక్తిని విడుదల చేస్తాయి. |
| వాటర్ గ్యాస్ |
కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ లేదా నీలి గ్యాస్ అంటారు. |
| ఇంధన ఘటాలు |
హైడ్రోజన్‌ను ఇంధన ఘటాల్లో ఉపయోగిస్తారు. ఇవి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. |
| హైడ్రోజనీకరణం |
నూనెలను కొవ్వులుగా మార్చే హైడ్రోజనీకరణ ప్రక్రియలో హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. |
| ఉత్ప్రేరకం |
హైడ్రోజనీకరణ ప్రక్రియలో నికెల్ లోహం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. |
| డాల్డా తయారీ |
డాల్డాను హైడ్రోజనీకరణ విధానంలో తయారు చేస్తారు. |
| ఫిషర్-ట్రాప్స్ పద్ధతి |
కృత్రిమ పెట్రోల్ తయారీలో హైడ్రోజన్ ఉపయోగిస్తారు. |
| ఉత్ప్రేరకాలు |
ఈ ప్రక్రియలో ఐరన్ ఆక్సైడ్, కోబాల్ట్ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. |
| లోహ సంగ్రహణ |
లోహ ఆక్సైడ్‌ల నుండి లోహాలను నిష్కర్షించడానికి హైడ్రోజన్ ఉపయోగిస్తారు. |
0 Comments