NSPG Scholarship 2026 – ₹15,000 Monthly Scholarship
పోస్టు గ్రాడ్యుయేషన్ (PG) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. National Scholarship for Post Graduate Studies (NSPG) 2026 పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు నెలకు రూ.15,000 చొప్పున 10 నెలల పాటు ఆర్థిక సహాయం అందుతుంది.
National Scholarship for Post Graduate Studies
| స్కాలర్‌షిప్ పేరు | National Scholarship for Post Graduate Studies (NSPG) |
| అందించే సంస్థ | UGC |
| అర్హులు | పీజీ మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు |
| స్కాలర్‌షిప్ | నెలకు రూ.15,000 |
| వ్యవధి | 10 నెలలు |
| ఏడాదికి గరిష్టంగా | రూ.1,50,000 |
| వయోపరిమితి | 30 సంవత్సరాల లోపు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| చివరి తేదీ | 31 అక్టోబర్ 2026 |
అర్హతలు
- విద్యార్థి ప్రస్తుతం పీజీ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
- పీజీ కోర్సులో ఫుల్‌టైమ్ లేదా రెగ్యులర్ విధానంలో ప్రవేశం పొంది ఉండాలి.
- విద్యార్థికి ఇదే మొదటి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు అయి ఉండాలి.
- పీజీలో చేరే సమయానికి విద్యార్థి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.
- విద్యార్థి గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతూ ఉండాలి.
- స్కాలర్‌షిప్ ఎంపికలో అకడమిక్ మెరిట్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
ఎంత స్కాలర్‌షిప్ లభిస్తుంది?
ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.15,000 చొప్పున 10 నెలల పాటు స్కాలర్‌షిప్ అందుతుంది. ఈ విధంగా ఒక విద్యా సంవత్సరంలో మొత్తం రూ.1,50,000 వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు.
మొదటి సంవత్సరం నిర్దేశించిన ప్రమాణాల మేరకు విద్యార్థి మార్కులు సాధిస్తే, తదుపరి సంవత్సరంలో కూడా స్కాలర్‌షిప్ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం సంబంధిత విద్యా సంవత్సరం తర్వాత స్కాలర్‌షిప్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా 10,000 స్కాలర్‌షిప్‌లు
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 10,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. ఇందులో 30 శాతం స్కాలర్‌షిప్‌లను బాలికలకు కేటాయించారు. బాలికల కేటగిరీలో సింగిల్ గర్ల్ చైల్డ్కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అవసరమైన పత్రాలు
- 10వ తరగతి మార్కుల మెమో
- పీజీ కాలేజీ అడ్మిషన్ లెటర్
- గుర్తింపు కార్డు
- బ్యాంక్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
చివరి తేదీ 31 అక్టోబర్ 2026.

Social Plugin