దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.1 లక్ష స్కాలర్‌షిప్

Scholarship

Kotak Suraksha Scholarship : ₹1 Lakh Scholarship for Disabled Degree Students 

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొటాక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన కొటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.

“కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్” పేరుతో అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత కలిగిన డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు వారి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.1,00,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.

స్కాలర్‌షిప్

  • స్కాలర్‌షిప్ పేరు: కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్
  • అర్హులు: దివ్యాంగులైన డిగ్రీ విద్యార్థులు
  • స్కాలర్‌షిప్: సంవత్సరానికి రూ.1,00,000 వరకు
  • వ్యవధి: కోర్సు పూర్తయ్యే వరకు
  • దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
  • ప్రాంతం: దేశవ్యాప్తంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • చివరి తేదీ: 10 అక్టోబర్ 2026

అర్హతలు

  • విద్యార్థి దివ్యాంగుడై ఉండాలి.
  • ప్రస్తుతం డిగ్రీ కోర్సులో చదువుతూ ఉండాలి.
  • ఇంటర్మీడియట్‌లో 50 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు.

కావాల్సిన పత్రాలు

  1. వైకల్య ధృవీకరణ పత్రం
  2. బ్యాంక్ పాస్‌బుక్
  3. ఆదాయ ధృవీకరణ పత్రం
  4. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రసీదు
  5. 10వ తరగతి మార్కుల మెమో
  6. ఇంటర్మీడియట్ మార్కుల మెమో
  7. కాలేజీ ఐడీ కార్డు
  8. ఆధార్ కార్డు
ముఖ్యమైన తేదీ:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 అక్టోబర్ 2026.


వివరం సమాచారం
స్కాలర్‌షిప్ పేరు కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్
అర్హులు దివ్యాంగ డిగ్రీ విద్యార్థులు
స్కాలర్‌షిప్ మొత్తం రూ.1,00,000 సంవత్సరానికి
కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు
ఇంటర్ అర్హత 50 శాతానికి పైగా మార్కులు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
చివరి తేదీ 10 అక్టోబర్ 2026

Post a Comment

0 Comments