నల్గొండ జిల్లా డీఎంహెచ్‌వోలో 24 ఉద్యోగాలు..
నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు 2026: నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనున్నారు.
నల్గొండ DMHO ఉద్యోగాల వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) |
| మొత్తం ఖాళీలు | 24 |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| దరఖాస్తు ఫీజు | రూ.200 |
| ఎంపిక విధానం | మెరిట్ జాబితా |
| Last Date | 03 October 2026 |
ఖాళీల వివరాలు
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| ల్యాబ్ టెక్నీషియన్ | 01 |
| స్టాఫ్ నర్సు | 13 |
| ఏఎన్‌ఎం (ANM) | 03 |
| అనస్థీషియాలజిస్టు | 03 |
| ఓబీజీ స్పెషలిస్టు | 02 |
| సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ హెచ్‌ఐవీ | 01 |
| ఓటీ టెక్నీషియన్ | 01 |
విద్యార్హత
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో అవసరమైన విద్యార్హతను అభ్యర్థులు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం
ప్రతి పోస్టు కేటగిరీకి ప్రత్యేకంగా మెరిట్ జాబితాలను రూపొందిస్తారు. అర్హత పరీక్ష ఆధారంగా గరిష్ఠంగా 90 మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థి వయస్సును అనుసరించి అదనంగా 10 మార్కులు కలుపుతారు. ఈ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

0 Comments