Jawahar Navodaya 9th Class Admissions | నవోదయ 9వ తరగతి అడ్మిషన్స్‌

navodaya admission
 Jawahar Navodaya Vidyalaya Admissions || Navodaya 9th Class Lateral Entry Admissions

నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న 665 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కొరకు లేటరల్‌ ఎంట్రీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. సెలక్షన్‌ టెస్టు ద్వారా ప్రవేశాల కల్పిస్తారు. జవహర్‌ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 665 స్కూల్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 15, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 19 ఉన్నాయి. నవోదయ విద్యాయాల్లో కో-ఎడ్యూకేషన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు. కానీ బాలబాలికలకు విడివిడిగా హస్టల్‌ సదుపాయం ఉంటుంది. ఇందులో అడ్మిషన్‌ పొందిన వారికి ఉచితంగా వసతి, రుచిరకమైన భోజనం, యూనిఫారమ్‌, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. ఇందులో మెథమేటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టులను ఇంగ్లీష్‌మీడియంలో, సోషల్‌ సైన్స్‌ను హిందీ/ఇంగ్లీష్‌ మీడియంలో భోదిస్తారు. ఇందులోని విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌ ఉంటుంది. ప్రతి సంవత్సరం సీబీఎస్‌సీ నిర్వహించే వార్షిక పరీక్షలను రాయాల్సి ఉంటుంది. 

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లోని లెటరల్‌ ఎంట్రి కొరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అన్‌లైన్‌ ధరఖాస్తు చేసుకోవాలి. 

📌 Navodaya 9th Class Admission

వివరాలు సమాచారం
సంస్థ జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి (JNV)
అడ్మిషన్‌ 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ
విద్యా సంవత్సరం 2026-27
స్కూల్స్ దేశవ్యాప్తంగా 665 జవహర్‌ నవోదయ విద్యాలయాలు
తెలంగాణలో 15 నవోదయ విద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్‌లో 19 నవోదయ విద్యాలయాలు
అర్హత ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు
వయస్సు 01 మే 2012 నుంచి 31 జూలై 2014 మధ్య జన్మించి ఉండాలి
ఎంపిక విధానం లేటరల్‌ ఎంట్రీ సెలక్షన్‌ టెస్ట్‌
దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
దరఖాస్తుకు చివరి తేదీ 30-09-2026
పరీక్ష తేదీ 10-04-2027

🎓 అర్హతలు (Eligibility)

  • విద్యార్థి ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండాలి.
  • 01 మే 2012 నుంచి 31 జూలై 2014 మధ్య జన్మించిన విద్యార్థులు

📝 Navodaya 9th Class Entrance Exam Pattern

మొత్తం మార్కులు 100
మొత్తం ప్రశ్నలు 100
పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు
సబ్జెక్టులు ఇంగ్లిష్‌, హిందీ, సైన్స్‌, మ్యాథ్స్‌
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ / హిందీ
ఎంపిక విధానం సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా

📅 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 30 సెప్టెంబర్‌ 2026
నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష 10 ఏప్రిల్‌ 2027
Online Apply Click Here


Post a Comment

0 Comments