ఎస్‌.బి.ఐ జనరల్‌ సురక్ష సపోర్ట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

  ఎస్‌.బి.ఐ జనరల్‌ సురక్ష సపోర్ట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

ఎస్‌.బి.ఐ జనరల్‌ సురక్ష సపోర్ట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ అనేది ఎస్‌బిఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిడెట్‌ చొరవతో కోవిడ్‌ -19 బాదిత విద్యార్థులు తమ విద్యను పూర్తి చేయడానికి ఆర్థికంగా చేయూత అందించి సహాయం చేస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ కింద 9వ తరగతి నుండి 12వ తరగతి మరియు గ్రాడ్యుయేషన్‌ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తారు. కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో సంపాదించే వారు కోల్పొయిన / సంపాదించే వారు ఉపాధి కోల్పొయిన వారి విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి సంవత్సరానికి 38,500 రూపాయలు ఎస్‌.బి.ఐ జనరల్‌ సురక్ష సపోర్ట్‌ స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తుంది.
అర్హత :
1)    భారత విద్యార్థులు అయి ఉండాలి.
2)    క్రింద తెలిపిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న విద్యార్థులు అర్హులు.    
 ఎ) జనవరి 2020 నుండి కోవిడ్‌ -19 మహామ్మారి కారణంగా తల్లిదండ్రులు / సంపాదించే వ్యక్తి                          కోల్పొయినవారు.
 బి) జనవరి 2020 నుండి కోవిడ్‌ -19 మహామ్మారి కారణంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఉపాధి / జాబ్‌    కోల్పొయిన వారు
3)    9 నుండి 12 వ తరగతి మరియు అండర్‌గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న విద్యార్థులు
4)    కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించరాదు..

స్కాలర్‌షిప్‌ మొత్తం :
1)    9 నుండి 12 వ తరగతి చదివే విద్యార్థులకు సంవత్సరానికి 29,500 రూపాయలు అందిస్తుంది.
2)    గ్రాడ్యూయేషన్‌ చదివే విద్యార్థులకు సంవత్సరానికి 38,500 రూపాయలు అందిస్తుంది.
కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
1)    పాస్‌పోర్టు సైజు ఫోటో
2)    ఆధార్‌కార్డు
3)    ఆదాయం సర్టిఫికేట్‌
4)    గత సంవత్సరం మార్కుల మెమో
5)    ప్రస్తుతం సంవత్సరం అడ్మిషన్‌ ప్రూఫ్‌
6)    విపత్కర పరిస్థితి యొక్క సర్టిఫికేట్‌ (మరణించిన వ్యక్తి డెత్‌ సర్టిఫికేట్‌ / ఉపాధి కోల్పొయిన సర్టిఫికేట్‌)
7)    బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌

ఎలా ధరఖాస్తు చేసుకోవాలి :

1) తమ రిజిస్ట్రేషన్‌ ఐడితో బడ్డీ4స్టడీ లోకి లాగిన్‌ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్‌ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్‌ బటన్‌ నొక్కి ఈమేయిల్‌/మోబైల్‌/ఫేస్‌బుక్‌/జిమేయిట్‌ అకౌంట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.)

2) లాగిన్‌ అయిన తర్వాత మీరు  ఎస్‌.బి.ఐ జనరల్‌ సురక్ష సపోర్ట్‌ స్కాలర్‌షిప్‌ అప్టికేషన్‌కు రిడైరెక్ట్‌ అవుతారు.

3) తర్వాత స్టార్ట్‌ అప్లికేషన్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. (స్టార్ట్‌ అప్లికేషన్‌ నొక్కే ముందు స్కాలర్‌షిక్‌కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి) 

4) ఆన్‌లైన్‌ స్కాలర్‌షిప్‌ అప్లికేషన్‌ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి

5) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్‌లోడ్‌ చేయాలి

6) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్‌పై క్లిక్‌ చేయాలి 

7) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్‌మిట్‌ బటన్‌ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది.

 ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు

Click Here



Post a Comment

0 Comments