బ్యాంకుల్లో క్లర్క్ కొలువుల జాతర
" 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ "
" ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా రెండు దశలలో ఎంపిక ప్రక్రియ "
" ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష "
" 07-10-2021 నుండి ధరఖాస్తులు స్వీకరణ"
బ్యాంకింగ్
రంగం .. ఒక్కసారి కొలువుదీరితే .. వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు ! చక్కటి
వేతనాలు, కెరీర్ పరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే భావన !! అందుకే ..
ఏటా లక్షల మంది బ్యాంకు కొలువుల నియామక పరీక్షలకు సన్నద్దమవుతుంటారు !
నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా ? అని ఎదురుచూస్తూ ప్రిపరేషన్
సాగిస్తుంటారు. ఇలాంటి వారందరికి ఐబీపిఎస్ తీపికబురు అందించింది.
దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7వేలకు పైగా క్లర్క్
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల వివరాలు, ప్రిపరేషన్,
అర్హత, ముఖ్యమైన తేదిలు కింద ఇవ్వడం జరిగింది.
ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) .. ప్రభుత్వ రంగ
బ్యాంకుల్లో క్లర్క్ మొదలు స్పెషలిస్టు ఆఫీసర్ల వరకూ .. వివిధ పోస్టులకు
ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్ ఏర్పాటైనప్పటి నుండి ప్రతి ఏటా
క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. వందల, వేల సంఖ్యలో
నియామకాలు చేపడుతుంది. తాజాగా ఐబీపీఎస్ సంస్థ.. కామన్ రిక్రూట్‌మెంట్
ప్రాసెస్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ క్లర్క్స్ -11 (సీఆర్‌పి
క్లర్క్స్-11) పేరిట 7855 పోస్టులకు నోటీఫికేషన్ జారీ చేసింది.
➵ మొత్తం 11 బ్యాంకులు
ఐబీపీఎస్ సీఆర్‌పి క్లర్స్క్-11 ద్వారా మొత్తం 11 ప్రభుత్వ రంగ
బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 7855 క్లర్క్ పోస్టుల యొక్క భర్తీకి పరీక్ష
నిర్వహించనుంది.
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) కెనరా బ్యాంక్
3) ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్
4) యూకో బ్యాంక్
5) బ్యాంక్ ఆఫ్ ఇండియా
6) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
7) పంజబ్ నేషనల్ బ్యాంక్
8) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
9) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
10) ఇండియన్ బ్యాంక్
11) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
➵ తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య :
తెలుగు రాష్ట్రాలకు సంబందించి
ఆంధ్రప్రదేశ్ |
387 |
తెలంగాణ |
333 పోస్టులు ఉన్నాయి |
ఆసక్తి
గల అభ్యర్థులు ఇతర రీజియన్లకు కూడా పోటీ పడోచ్చు. ఎంచుకున్న రీజియన్‌కు
సంబందించి .. అక్కడి అధికారిక భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక
అభ్యర్థి కేవలం ఒకే ఒక రాష్ట్రానికి సంబందించిన పోస్టులకే ధరఖాస్తు
చేసుకోవచ్చు.
➵ అర్హత :
➬ అర్హత - ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కల్గి ఉండాలి.
➬ వయోపరిమితి :
జూలై 1, 2021 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మద్యలో ఉండాలి.
(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.)
➬ ఎంపిక ప్రక్రియ
ఐబీపీఎస్ క్లర్స్క్ ఎంపిక విధానం రెండంచెలలో ఉంటుంది.
మొదటి దశలో మెయిన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి.
ప్రిలిమినరీలో
ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ విజయం సాధించి
తుదిజాబితాలోకి వస్తే ప్రొవిజినల్ అలాట్‌మెంట్ ఇస్తారు. తుది ఎంపికలో
మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
➵ 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష :
ఐబీపీఎస్
సీఆర్‌పి క్లర్క్స్ -11 (2022-23) వ్రాత పరీక్షలను ఇంగ్లీష్, హిందీతో
పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు కూడా ఉంది.
వాస్తవానికి జులై నెలలోనే ఈ ఐబీపిఎస్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్
విడుదలైంది. అయితే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణలపై నిపుణుల కమిటీ
ఏర్పాటు చేశామని .. ఆ కమిటీ నివేదిక 15 రోజుల్లో వస్తుందని .. అప్పటివరకు
ధరఖాస్తు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఐబీపీఎస్‌కు సూచించింది. దీంతో ఐబీపీఎస్ ధరఖాస్తు ప్రక్రియను
నిలిపివేసింది. దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్టోబర్ 7వ తేది నుండి
తిరిగి ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
➵ ప్రిలిమినరీ పరీక్షా విధానం :
ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
విభాగం |
ప్రశ్నలు |
మార్కులు |
సమయం |
ఇంగ్లీష్ లాంగ్వేజ్ |
30 |
30 |
20 నిమిషాలు |
న్యూమరికల్ ఎబిలిటీ |
35 |
35 |
20 నిమిషాలు |
రిజనీంగ్ ఎబిలిటీ |
35 |
20 నిమిషాలు |
|
మొత్తం |
100 |
100 |
60 నిమిషాలు |
➵ మెయిన్ పరీక్షా విధానం :
ప్రిలిమినరీ
పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు. ఈ
జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు
విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
విభాగం |
ప్రశ్నలు |
మార్కులు |
సమయం |
జనరల్ / ఫైనాన్షియల అవేర్‌నెస్ |
50 |
50 |
35 నిమిషాలు |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ |
40 |
40 |
35 నిమిషాలు |
రిజనింగ్ అండ్ కంప్యూటర్ |
50 |
60 |
45 నిమిషాలు |
క్వాంటిటేటీవ్ అప్టిట్యూడ్ |
50 |
50 |
45 నిమిషాలు |
మొత్తం |
190 |
200 |
160 నిమిషాలు |
➵ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
➠ ఆన్‌లైన్ ధరఖాస్తులు స్వీకరణ : 07-10-2021
➠ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు : 27-10-2021
➠ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష : డిసెంబర్ 2021
➠ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష : జనవరి / ఫిబ్రవరి 2022
➠ పూర్తి వివరాల కొరకు :
➠ ఆన్‌లైన్ ధరఖాస్తు కొరకు
0 Comments