ఫార్మా .. కెరీర్‌కు ధీమా ...
Gk in Telugu || General Knowledge in Telugu
భారతదేశంలో
ఫార్మారంగం వేగంగా అభివృద్ది సాధిస్తుంది. ప్రపంచ ఔషదశాలగా భారత్
పేరేన్నికగావిస్తుంది. నూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ది, ఉత్పత్తికి
నెలవైన ఫార్మారంగంలో అవకాశాలకు కొదవలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు
ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీ కోర్సులు అభ్యసించొచ్చు. రోగులకు మందులు
అందించడం దగ్గర్నుంచి ఔషధాల పరిశోధన వరకూ .. అనేక ఉద్యోగావకాశాలు
అందుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఫార్మసీ
కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ప్రధానంగా మూడు రకాల ఫార్మసీ కోర్సులు ఉన్నాయి.
1) డి.ఫార్మసీ (డిప్లోమా ఇన్ ఫార్మసీ)
2) బీ ఫార్మసీ (బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ)
3) ఫార్మ్-డి ( డాక్టర్ ఆఫ్ ఫార్మసీ)
ఈ మూడు కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యావకాశాలు అదిరోహించవచ్చు.
1) డి.ఫార్మసీ (డిప్లోమా ఇన్ ఫార్మసీ) -
ఇంటర్‌లో ఎంపీసీ / బైపీసీలో సాధించిన మార్కుల ఆధారంగా డి.ఫార్మసీలో
ప్రవేశం పొందవచ్చు. రాష్ట్ర సాంకేతిక శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. ఈ
కోర్సు కాలవ్యవధి రెండు(2) సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి అయిన
తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర
ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదుచేసుకోవచ్చు.
➥ఉద్యోగ అవకాశాలు ః
డి-ఫార్మసీ అభ్యర్థులకు ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్
సెంటర్లు, విద్యా సంస్థలు, క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు
మందుల దుకాణాలు, ఫార్మాస్యూటికల్ కంపనీలు, సేల్స్, మార్కెటింగ్,
పరిశోధనా సంస్థలు, పరిశోధన ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
➥ఉన్నత విద్య ః
డి-ఫార్మసీ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈసెట్ పరీక్షలో అర్హత
సాధించి లెటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరుకోవచ్చు.
ఫార్మ్-డి కోర్సులను కూడా అభ్యసించవచ్చు.
2) బీ ఫార్మసీ (బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ) -
ఇంటర్‌లో ఎంపీసీ/బైపీసీ/డి.పార్మసీ లలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన
విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బీ ఫార్మసీ)లో చేరోచ్చు. కోర్సు
వ్యవధి నాలుగు(4) సంవత్సరాలు ఉంటుంది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో
ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఫార్మసీ పూర్తి
చేసిన వారు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.
➥ ఉద్యోగ అవకాశాలు ః
బీ ఫార్మసీ అభ్యర్థులకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగంలో ఫార్మసిస్టులుగా
చేరోచ్చు.డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌లు, మెడికల్ అండర్ రైటర్‌లుగా
పనిచేయోచ్చు. సొంతంగా మందుల దుకాణాన్ని కూడా ప్రారంభించవచ్చు.
ఫార్మస్యూటికల్,
బయోటెక్ కంపెనీల్లో రీసెర్చ్ సైంటిస్టు, రీసెర్చ్ అసోసియేట్, ప్రీ క్లినికల్ రిసెర్చ్‌లలో ..
స్టడీ డైరెక్టర్, క్యూసీ మేనేజర్, క్యూసీ ఆడిటర్, క్యూసీ అసోసియేట్ కొలువులు,
ఫార్మా
ఇండస్ట్రీలో ఫార్ములేషన్స్ ఆర్ అండ్ డీ, అనలిటికల్ ఆర్ అండ్ డీ,
క్వాలిటీ కంట్రోల్స్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో అవకాశాలు
పొందవచ్చు.
3) ఫార్మ్-డి ( డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) -
ఇంటర్‌లో ఎంపీసీ/బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఫార్మ్`డి కోర్సులో చేరవచ్చు.
కోర్సు కాలవ్యవధి - ఆరు (6) సంవత్సరాలు
కోర్సులో
థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అయిదేళ్లు తరగతి గది
బోధన, ప్రాక్టికల్స్‌తో పాటు.. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్
చేయాల్సి ఉంటుంది. ఫార్డ్-డి కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాష్ట్ర
ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.
➥ ఉద్యోగ అవకాశాలు
ఫార్మ్-డి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు
క్లినికల్ ఫార్మిసిస్టు, కమ్యూనిటి ఫార్మసిస్టు, హాస్పిటల్
ఫార్మసిస్టుగా అవకాశాలు లభిస్తాయి. క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషనల్‌లో
ఏడిఆర్ మానిటరింగ్, డ్రగ్ ఇంటరాక్షన్ మానిటరింగ్, టాక్సికాలజీ,
థెరప్యూటిక్స్, బీఏబీఈ స్టడీస్, పేషెంట్ మానిటరింగ్, క్లినికల్
ప్రోటోకాల్ డెవలప్‌మెంట్, పేషెంట్ కేస్ స్టడీ, పేషెంట్ కౌన్సిలింగ్,
క్లినికల్ ట్రయల్స్, డేటా మేనేజ్‌మెంట్ వంటి అవకాశాలు లభిస్తాయి.
విదేశాలలోనూ వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన
విద్యార్థులు పీహెచ్‌డీ చేయోచ్చు.
మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మసీ)
బీఫార్మసీ
పూర్తి చేసిన అభ్యర్థులు రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఎంఫార్మసీ కోర్సులో
చేరొచ్చు. ఎంఫార్మసీలో ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాకెమిస్ట్రీ,
ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఇండస్ట్రీయల్ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టిస్,
క్వాలిటీ అస్యూరెన్స్ తదితర స్పెషలైజేషన్లు ఎంచకోవచ్చు.
నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీ) నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ
అప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్) పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా
దేశంలోని పలు యూనివర్సిటీలు ఎంఫార్మసీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అభ్యర్థులు జీప్యాట్ స్కోరుతో తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీ /
ఇన్‌స్టిట్యూట్‌కు స్వయంగా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నైపర్
జేఈఈ రాసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యూకేషన్
అండ్ రీసెర్చ్(నైపర్) విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం
పొందవచ్చు.
అంతర్జాతీయ
అర్హత పరీక్షల ద్వారా విదేశాల్లో ఎంఎస్(ఫార్మాస్యూటికల్ సైన్సెస్) తో
పాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో చేరే అవకాశం ఉంది.
బీ ఫార్మసీ
తర్వాత మూడేళ్ల ఫార్మ్-డి(పోస్ట్ బ్యాచులరేట్) లో చేరవచ్చు. ఫార్మ్-డి
(పోస్ట్ బ్యాచులరేట్) ను లేటరల్ ఎంట్రీగా పరిగణిస్తారు. బీఫార్మసీ
తర్వాత ఫార్స్-డిలో నేరుగా నాలుగో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు.
రాష్ట్రస్థాయిలో పీజీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఎంఫార్మసీ కోర్సులో
చేరవచ్చు.
ఫార్మసీ -మేనేజ్‌మెంట్ కోర్సులు
ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్ నిపుణులు అవసరం నెలకొంది. దాంతో నైపర్
వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు ఎంబీఏ (ఫార్మ్) వంటి
ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాయి. అలాగే ఎంటెక్
(ఫార్మసీ), ఎం.ఎస్(ఫార్మ్) లాంటి వినూత్న కోర్సులు సైతం అందుబాటులో
ఉన్నాయి. బీఫార్మసీ, ఎమ్సెస్సీ లైఫ్ సైన్సెస్ సంబందిత కోర్సులు పూర్తి
చేసిన విద్యార్థులు వీటిలో చేరవచ్చు.
పీహెచ్‌డీ
నైపర్‌లతో పాటు, పలు సెంట్రల్ యూనివర్సిటీలు, బిట్స్ తదితర
ఇన్‌స్టిట్యూట్‌లు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
కల్పిస్తున్నాయి.
0 Comments