LIC గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌ షిప్‌ -2021

Scholarship in telugu
 LIC గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌ షిప్‌ -2021

భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన ‘‘ లైప్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌.ఐ.సి) గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థినీవిద్యార్థులకు 2021 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్‌షిప్‌ ఇవ్వడానికి నోటీఫికేషన్‌ ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తమ పైచదువులు కొనసాగించడానికి తోడ్పడడం ఈ స్కాలర్‌షిప్‌ ముఖ్య ఉద్దేశ్యం. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా బాలికల కోసం కూడా ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌ అందుబాటులో ఉన్నాయి.
    10వ, ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తులను పరిశీలన చేసి మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులకు తమ కోర్సుల ఆధారంగా స్కాలర్‌షిప్‌ అందించడం జరుగుతుంది. 

అర్హత

⇨ ఇంటర్మిడియట్‌ విద్యార్థులకు :

1)    ప్రస్తుతం అకడమిక్‌ ఇయర్‌లో ఇంటర్మిడియట్‌ / తత్సమానంలో కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.

2)    కుటుంబం సంవత్సర ఆదాయం 2 లక్షలకు మించరాదు.

3)    మెడిసిన్‌ / ఇంజనీరింగ్‌ / ఏదైనా గ్రాడ్యువేషన్‌ / ఇంటిగ్రేటేడ్‌ కోర్సులు / ఒకేషనల్ చదువుతున్న విద్యార్థులు అయి ఉండాలి.


10వ తగరతి విద్యార్థులకు :

1)    ప్రస్తుతం అకడమిక్‌ ఇయర్‌లో 10వ తరగతి / తత్సమానంలో కనీసం 60 శాతం మార్కులతో         పాసై ఉండాలి.

2)    కుటుంబం సంవత్సర ఆదాయం 2 లక్షలకు మించరాదు.

3)    ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజీల్లో / ఐటిఐల్లో ఒకేషనల్‌ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు అయి ఉండాలి.

 బాలికల కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌

    బాలికల్లో విద్యాను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వీటిని అందజేస్తున్నారు. 10వ తరగతి పాసై ఇంటర్‌ చదువుతున్న బాలికలు ఇట్టి స్కాలర్‌షిప్‌ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

1)    ప్రస్తుతం అకడమిక్‌ ఇయర్‌లో 10వ తరగతి / తత్సమానంలో కనీసం 60 శాతం మార్కులతో  పాసై ఉండాలి.

2)    కుటుంబం సంవత్సర  ఆదాయం 2 లక్షలకు మించరాదు.

3)    ప్రస్తుత సంవత్సరం ఇంటర్‌లో అడ్మిషన్‌ పొందియుండాలి.

స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున రెండు సంవత్సరాలు అందిస్తారు.


ఎంపిక విధానం :

  • 10వ తరగతి, ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.


ధరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ధరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ చేయడానికి చివరి తేది.        -    డిసెంబర్‌ 31, 2021 లోపు చేసుకోవాలి.
For More Details :
Click Here

Post a Comment

0 Comments