నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిప్ట్)
ఫ్యాషన్ డిజైనింగ్ నేటి కాలంలో యువతకు అవకాశాలు అందిపుచ్చుకునే చక్కటి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. ఫ్యాషన్ రంగంలో నైపుణ్యం పెంపొందించుకుంటే వివిధ కంపెనీలలో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.. ఇలాంటి నైపుణ్యాలు అందించేందుకు సిద్దమైన వేదికనే ‘‘ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిప్ట్)’’
దేశవ్యాప్తంగా ఉన్న నిప్ట్ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం అడ్మిషన్ టెస్టు ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 2022 విద్యా సంవత్సరానికి గాను ‘‘ నిప్ట్ అడ్మిషన్ టెస్టు-2022’’ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మన యొక్క హేయిర్‌స్టైల్, డ్రెస్సింగ్, పుట్‌వేర్‌లతో ఇతరుల ను ఆకట్టుకోవాలంటే వెరైటీగా ఉండాలి. ఇతరుల చూపులను మళ్లీంచకుండా చూసే ఫ్యాషన్ ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి తేవాలంటే మామూలు విషయం కాదు. అందుకు ఫ్యాషన్ నిపుణులు అవసరం. ఫ్యాషన్ రంగంలో నైపుణ్యం పెంపొందించుకొని ఉన్నత శిఖరాలు అదిరోహించడానికి చక్కని వేదిక ‘‘ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిప్ట్)’’
➦ ప్రత్యేకత :
భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ ‘‘ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిప్ట్)’’. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు దేశవ్యాప్తంగా 17 క్యాంపస్‌లు ఉన్నాయి. ఫ్యాషన్ రంగానికి సంబందించి డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజి, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో కోర్సులను అందిస్తున్నారు. నిప్ట్ క్యాంపస్‌లు అందించే ఈ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. వీటిల్లో ప్రవేశం పొందాలంటే నిఫ్ట్ అడ్మిషన్ ప్రక్రియలో విజయం సాధించాలంటే నిప్ట్ అడ్మిషన్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి.
➦ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ :
బ్యాచిలర్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్ససరీస్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, నిట్ వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ వంటి విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఇట్టి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజిలో ప్రవేశం పొందాలంటే ఇంటర్మిడియట్ పాసై ఉండాలి.
➫ అర్హత :
1) ఇంటర్మిడియట్‌లో ఎంపీసీలో పాసై ఉండాలి.
2) 24 సంవత్సరాల లోపు వయస్సు వారై ఉండాలి.(రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
➦ పోస్టు గ్రాడ్యూవేషన్ స్థాయిలో
1) మాస్టర్ ఆఫ్ డిజైన్
2) మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్
3) మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
విభాగాలు అందుబాటులో ఉన్నాయి.
- మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ లలో ప్రవేశం పొందాలంటే బ్యాచిలర్ డిగ్రీ లేదా నిప్ట్/నిడ్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పాసై ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ప్రవేశం పొందాలంటే బీ.ఎఫ్.టెక్ లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుండి బీటెక్ / బీఈ పాసై ఉండాలి.
➦ వయస్సు :
ఇట్టి పీజి కోర్సులకు ఎలాంటి విద్యార్హత లేదు.
➦ ఎంపిక విధానం :
ఇట్టి ‘‘ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిప్ట్)’’ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను 3 అంచలలో జరిగే విధానంలో ఎంపిక చేస్తారు.
1) మొదటి దశ
ఈ దశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్టు, జనరల్ ఎబిలిటీ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు.
2) రెండవ దశ
ఈ దశలో సిట్యూయేషన్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు.
3) మూడవ దశ
ఈ దశలో ఇంటర్యూ / గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేసిన తర్వాత సీటు కన్మర్మ్ అవుతుంది.
➦ పరీక్షా విధానం :
‘‘ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిప్ట్)’’ పరీక్ష అనేది 3 గంటలలో 150 ప్రశ్నలకు గాను నిర్వహిస్తారు.
➦ సబ్జెక్టు విధానం :
‘‘ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిప్ట్)’’ పరీక్షలో క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ ల నుండి ప్రశ్నలు అడుగుతారు. వీటితో పాటు కేసు స్టడీ కూడా ఉంటుంది.
➦ ధరఖాస్తు విధానం :
ధరఖాస్తును ఆన్‌లైన్ విధానంలో సమర్పించాలి.
➦ ముఖ్యమైన తేదిలు :
యూజి / పీజీ కోర్సులకు ధరఖాస్తులకు చివరి తేది
జనవరి 2022 మొదటి వారం
➦ బ్యాచిలర్ కోర్సులకు వ్రాత పరీక్ష :
ఫిబ్రవరి 2022 మొదటి వారం
➪ ఆన్‌లైన్ ధరఖాస్తులకు
ఇక్కడ క్లిక్ చేయండి
0 Comments