కోవిడ్‌ - 19 వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా.. ?

 కోవిడ్‌ - 19 వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా.. ?

కోవిడ్‌ - 19 వ్యాక్సిన్‌ రెండు డోసులు పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం  ఉంటుంది. (ఒక డోసు వేసుకున్నా కూడా సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అందులో ఒక డోసు వేసుకున్నట్లు చూపిస్తుంది.) 

➦ స్టెప్‌ - 1 :-

మొదటగా గూగుల్‌లో https://www.cowin.gov.in ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వెంటనే మీకు కింది విధంగా వెబ్‌సైట్‌ ఓపేన్‌ అవుతుంది. 

➦ స్టెఫ్‌ -2 :-

అందులో రైట్‌ కార్నర్‌లో రిజిస్ట్రర్‌ / లాగిన్‌ అనే బటన్‌ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేయగానే కింది విండో కనబడుతుంది. 

➦ స్టెప్‌ - 3 :-

అప్పుడు మీకు రిజిస్ట్రర్‌ ఆర్‌ సైన్‌ఇన్‌ ఫర్‌ వ్యాక్సినేషన్‌ అని కనబడుతుంది. దాని కింద మీరు గతంలో వ్యాక్సిన్‌ వేసుకున్నప్పుడు రిజిస్ట్రర్‌ అయిన మోబైన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత గెట్‌ ఓటిపి పై క్లిక్‌ చేయాలి. అప్పుడు రిజిస్ట్రర్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు 6 అంకెల ఓటిపి వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి. 

➦ స్టెప్‌ - 4 :-

వెంటనే మీకు మరొక విండో ఓపేన్‌ అవుతుంది. అందులో మీరు గతంలో రిజిస్ట్రేషన్‌ చేసిన మీ యొక్క / మీ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కనబడుతాయి. దాని ప్రక్కన గల ‘‘ షో సర్టిఫికేట్‌ ’’ పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీకు డౌన్‌లోడ్‌ బటన్‌ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేయగానే మీకు సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ అవ్వడం జరుగుతుంది. 

ఇట్టి సైట్‌లో మీరు సర్టిఫికేట్‌పై ఉన్న ఎలాంటి సందేహాలనైన నివృతి చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్‌లో తప్పు ఒప్పులను సవరించుకోవచ్చు

Post a Comment

0 Comments