పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సులు
హైద్రాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన దూరవిద్య కేంద్రం - వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ధరఖాస్తులు ఆహ్వనిస్తుంది. కాంటాక్ట్ క్లాసెస్ ద్వారా భోదన ఉంటుంది. కోర్సులను నిర్ధేశించిన వ్యవధికి రెట్టింపు సమయంలోగా పూర్తి చేయాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➠ డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్ :-
కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్`ఫండమెంటల్స్, రైటర్`స్క్రీన్ ప్లే ఫిల్మ్ స్క్రీప్ట్ రైటింగ్ ` ప్రాక్టికల్స్ అనే మూడు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 300 ఉంటాయి. 10వ తరగతి ఉత్తీర్ణులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➠ సర్టిఫికేట్ కోర్సు ఇన్ మోడరన్ తెలుగు :-
కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. భాషాభ్యసనంపై రెండు పేపర్లు. మౌఖిక పరీక్షకు సంబందించి ఒక పేపర్ ఉంటాయి. మొత్తం మార్కులు 200 ఉంటాయి. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుని తెలుగు భాషేతరుల సౌలభ్యం కోసం ఉద్దేశించారు. ప్రాథమిక స్థాయి నుండి పీజీ వరకు ఆంగ్ల మాద్యమంలో చదువుకున్న వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
➠ పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం :-
ఈ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో టెలివిజన్ చరిత్ర, టెలివిజన్ రిపోర్టింగ్, టెలివిజన్ స్క్రీప్ట్ రచన, టెలివిజన్ ప్రొడక్షన్ పేపర్లు ఉంటాయి. 8 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ న్యూస్ ఫీచర్‌కు సంబందించిన ప్రాజేక్టు వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. మొత్తం మార్కులు 500 ఉంటాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➠ పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు :-
కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో వాస్తు శాస్త్రం ఆధునిక నిర్మాణ శిల్పం (అర్కిటెక్చర్), ఆధునిక వాస్తు కళ(వాస్తు బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్) జ్యోతిషశాస్త్రం ` ప్రాథమిక అంశాలు, దేవాలయ వాస్తు`శిల్పరీతులు అనే 4 పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 400 ఉంటాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
➠ డిప్లొమా ఇన్ జ్యోతిషం :-
కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో ఖగోళ విజ్ఞానం`ప్రాచ్చ`పాశ్యాత్య పద్దతులు, ముహూర్తుం`గోచారం`శాంతి ప్రక్రియలు, వాస్తు`ప్రశ్న`వైద్య జ్యోతిషం అనే మూడు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 300 ఉంటాయి. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్/తత్సమానం కోర్సు ఉత్తీర్ణులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➠ సర్టిఫికేట్ కోర్సు ఇన్ జ్యోతిషం :-
కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో జ్యోతిషశాస్త్రం`ప్రాథమిక అంశాలు`స్వరూప స్వభావాలు, జ్యోతిషశాస్త్రం `ఫలనిర్ణయ విధానాలు అనే రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 200 ఉంటాయి. పదో తరగతి పాసైనవారు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➠ సంగీత విశారద :-
కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఏటా లక్షణం(సిద్దాంతం), లక్ష్యం (ప్రాయోగికం) అనే రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 మార్కులు. సంగీతంపై ఆసక్తి ఉన్న వారందరూ అర్హులు. కోర్సులో చేరేనాటికి 12 సంవత్సరాలు ఉండాలి.
➠ డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ :-
కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు, ఇందులో 5 పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 చొప్పున 500 మార్కులు ఉంటాయి. మొదటి ఏడాది సిద్దాంతం (థియరి), ప్రాయోగికం(ప్రాక్టికల్) పేపర్‌లు ఉంటాయి. రెండో ఏడాదిపై రెండు పేపర్లతో పాటు ప్రాయోగికం (వాద్య పరికరాలు) పేపర్ అదనంగా ఉంటుంది. తెలుగు రాయడం, చదవడం తెలిసినవారు ధరఖాస్తు చేసుకోవచ్చు. లలిత సంగీతంపై ఆసక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
➠ ధరఖాస్తు ఫీజు :-
300 రూపాయలు
➠ ఆన్‌లైన్ / పోస్టు ద్వారా ధరఖాస్తుకు చివరి తేది : 31-01-2022
0 Comments