
SBI PO 2023 - Notification Out for 2000 Probationary Officers || Jobs in Telugu || Latest Jobs in Telugu
- ఎస్‌బీఐ పీవో 2023
- 2000 ప్రొబేషనరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- మూడు దశలలో ఎంపిక
- ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్యూల ద్వారా ఎంపిక
- సెక్షన్ కటాఫ్ లేకుండా పరీక్ష
- 27 సెప్టెంబర్ 2023 వరకు ధరఖాస్తుల స్వీకరణ
SBI PO Jobs in Telugu : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులకు శుభవార్త. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2000 ప్రొబేషనరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రిలిమ్స్, మేయిన్స్, సైకోమెట్రిక్, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఉద్యోగం సాధించ వచ్చు. పీవోగా ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బిఐ శాఖల్లో 1 లక్ష జీతంతో పనిచేయాల్సి ఉంటుంది.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం దేశవ్యాప్తంగా 2000 ప్రొబేషనరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 27, 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 750 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్ పరీక్షను నవంబర్ 2023 న నిర్వహిస్తారు. అలాగే మెయిన్స్ పరీక్షను డిసెంబర్ 2023 / జనవరి 2024 న నిర్వహిస్తారు. మూడో దశ ఎంపిక జనవరి / ఫిబ్రవరి 2024 న జరుగుతుంది. ఫలితాలను ఫిబ్రవరి / మార్చి 2024 నెలలో ప్రకటిస్తారు.
ఎస్‌బిఐ పీవో పరీక్షలో సెక్షన్ కటాప్ మార్కులు లేవు. ఇది అభ్యర్థులకు సదవకాశంగా భావించవచ్చు.ప్రిలిమ్స్ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులతో మొత్తం 60 నిమిషాలలో నిర్వహిస్తారు. మేయిన్ పరీక్షను 155 ప్రశ్నలకు గాను 200 మార్కులతో 3 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మూడో దశ ఎంపికలో గ్రూప్ ఎక్కర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్యూకు 30 మారులతో మొత్తం 50 మార్కులు ఉంటాయి. ఎస్‌బీఐ పీవో పరీక్షలో ఇంగ్లీస్ లాంగ్వేజ్, క్వాంటిటేవిట్ అప్టిట్యూడ్, రిజనీంగ్, కంప్యూటర్ అప్టిట్యూడ్, డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ జనరల్/ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ వంటి సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
Also Read : Gk Question in Telugu
➺ SBI PO మొత్తం పోస్టుల సంఖ్య :
- దేశవ్యాప్తంగా మొత్తం 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
➺ SBI PO అర్హత :
- ఏదేనీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
➺ SBI PO వయోపరిమితి :
- 01 ఏప్రిల్ 2023 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మద్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు..
➺ SBI PO పరీక్ష ఫీజు :
- 750/- జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- ఫీజు లేదు - ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/బీడీ అభ్యర్థులకు
➺ SBI PO ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షా సెంటర్‌లు | ||
---|---|---|
State | Preliminary Exam | Mains Exam |
తెలంగాణ | హైద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ | హైద్రాబాద్ |
ఆంధ్రప్రదేశ్ | చీరాల, చిత్తూర్, గుంటూర్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఓంగోలు, పుత్తూర్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం | గుంటూర్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం |
➺ SBI PO ఎంపిక ప్రక్రియ :
ఎస్‌బిఐ పీవో ఎంపిక విధానం మూడు అంచెలలో ఉంటుంది. మొదటి దశలో మెయిన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. మూడో దశలో సైకోమెట్రిక్ గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్యూలు ఉంటాయి. రెండో దశలోని మెయిన్స్ పరీక్షలో మొత్తం 250 మార్కులను నార్మలైజేషన్ పద్దతిలో 75కు, మూడో దశలోని గ్రూప్ ఎక్సర్‌సైజ్ ఇంటర్యూల్లోని 50 మార్కులను 25కు కుదిస్తారు. ఆ రెండు దశల మొత్తం మార్కుల్లో (100) అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేయడం జరుగుతుంది.
➺ SBI PO రిజర్వేషన్‌ల వారీగా ఎస్‌బీఐ పీవో పోస్టుల ఖాళీలు
- ఎస్సీ (300)
- ఎస్టీ (150)
- ఓబీసీ (540)
- ఈడబ్ల్యూఎస్ (200)
- జనరల్ (810)
➺ SBI PO జీతభత్యాలు :
పీవోగా ఎంపికైన అభ్యర్థులకు రూ॥41,960 మూల వేతనంతో ప్రారంభమై.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ,, సీసీఏ, పిఎఫ్, లీవ్ రెంటర్ ఫెసిలిటీ, మెడికల్ .. మొదలైన వాటితో దాదాపు 1 లక్ష రూపాయల వరకూ గ్రాస్ శాలరీగా నెల వేతనం పొందే అవకాశం ఉంది. కోతలు పోనూ రూ॥70 వేలకు పైగా నెట్ శాలరీ వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు | |
---|---|
నోటిఫికేషన్ విడుదల | 6 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 07 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 27 సెప్టెంబర్ 2023 |
ప్రిలిమ్స్ హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ | Oct 2023 రెండవ వారం నుండి |
ప్రిలిమ్స్ పరీక్ష తేది | నవంబర్ 2023 |
ప్రిలిమ్ పరీక్షా ఫలితాలు | నవంబర్ /డిసెంబర్ 2023 |
మెయిన్స్ ఎగ్జామ్ హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ | నవంబర్ / డిసెంబర్ 2023 |
మేయిన్స్ పరీక్ష తేది | డిసెంబర్ 2023/జనవరి 2024 |
మేయిన్ పరీక్షా ఫలితాలు | డిసెంబర్ 2023 / జనవరి 2024 |
ఫేజ్-3 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ | జనవరి / ఫిబ్రవరి 2024 |
ఫేజ్-3 సైకోమెటిక్ టెస్టు | జనవరి / ఫిబ్రవరి 2024 |
ఇంటర్యూ నిర్వహించు తేది | జనవరి / ఫిబ్రవరి 2024 |
అలాట్‌మెంట్ | ఫిబ్రవరి / మార్చి 2024 |
➺ SBI PO ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవడం ఎలా ?
అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు సమర్పించాలి. పరీక్ష ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అభ్యర్థులు ఫోన్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రర్ చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ అందించబడతాయి. అభ్యర్థులు SBI అధికాక వెబ్‌సైట్‌లోకి వెళ్లికుండా ఇక్కడ మేము ధరఖాస్తు లింకు అందించాము. SBI PO 2023 కోసం ధరఖాస్తు చేసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ చేసే సమయంలో పాస్‌పోర్టు సైజు ఫోటో, సంతకం, ఎడమ బొటనవ్రేలి ముద్ర, చేతివ్రాత డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
Also Read : Gk in telugu
ఐబీపీఎస్ పీవో నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఇందులో కనీస మార్కులు సాధించిన వారు మేయిన్స్ అర్హత సాధిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షా విధానం (ఫేజ్ -1) | |||
---|---|---|---|
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 30 | 30 | 20 నిమిషాలు |
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌ీ | 35 | 35 | 20 నిమిషాలు |
రిజనీంగ్ ఎబిలిటీ | 35 | 35 | 20 నిమిషాలు |
మొత్తం | 100 | 100 | 60 నిమిషాలు |
ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
మెయిన్ పరీక్షా విధానం (ఫేజ్ -2) | |||
---|---|---|---|
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రిజనింగ్ అండ్ కంప్యూటర్ | 40 | 50 | 50 నిమిషాలు |
డెటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటెషన్ | 30 | 50 | 45 నిమిషాలు |
జనరల్ / బ్యాంకింగ్ /ఎకానమీ అవేర్‌నెస్ | 50 | 60 | 45 నిమిషాలు |
ఇంగ్లీష్ | 35 | 40 | 40 నిమిషాలు |
మొత్తం | 155 | 200 | 3 గంటలు |
ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే | 02 | 50 | 30 నిమిషాలు |
ఫేజ్ -3 | |
---|---|
గ్రూప్ Discution | 20 మార్కులు |
ఇంటర్యూ | 30 మార్కులు |
మొత్తం | 50 మార్కులు |
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | SBI |
పోస్టు పేరు | SBI PO |
దేశం | ఇండియా |
మొత్తం ఉద్యోగాలు | 2000 |
ఎక్కడ | దేశవ్యాప్తంగా |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | ఆన్‌లైన్ |
ఎంపిక ప్రక్రియ | మూడు దశల్లో |
విద్యార్హత | ఏదేని డిగ్రీ |
వయోపరిమితి | 21 నుండి 30 సంవత్సరాలు |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభం | 07 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ముగింపు | 27 సెప్టెంబర్ 2023 |
ప్రిలిమ్స్ పరీక్ష | నవంబర్ 2023 |
మేయిన్స్ పరీక్ష తేది | డిసెంబర్ 2023 / జనవరి 2024 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
జవాబు : SBI PO వివరణాత్మక నోటిఫికేషన్ 06 సెప్టెంబర్ 2023 రోజున విడుదల చేయబడిరది..
జవాబు : SBI PO కు వయస్సు పరిమితి 01 ఏప్రిల్ 2023 నాటికి 21 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.
జవాబు :SBI PO నోటిఫికేషన్‌తో 2000 ఖాళీలు విడుదలయ్యాయి.
జవాబు : SBI PO పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ/ఎస్టీ/వికలాంగుల అభ్యర్థులకు ఫీజు లేదు.
జవాబు : SBI PO ప్రిలిమ్స్ నవంబర్ 2023, మెయిన్స్ డిసెంబర్ 2023/జనవరి 2024
0 Comments