
CSIR announces Shanti Swarup Bhatnagar Prizes-2022 to 12 scientists Gk in Telugu || General Knowledge in Telugu
శాంతిస్వరూప్ భట్నాగర్ - 2023 అవార్డు విజేతలు
శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అనేవి భారతదేశంలో జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణిత శాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాల విశేష సేవలందించిన వారికి అందించే పురస్కారం. ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును భారతదేశంలో కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసేర్చ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అందజేస్తారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకుడైన శాంతి స్వరూప్ భట్నాగర్ పేరుపై స్థాపించడం జరిగింది. శాంతి స్వరూప్ భట్నాగర్ మొట్టమొదటి అవార్డును 1958 సంవత్సరంలో అందజేసారు.
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు అర్హత సాధించాలంటే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణిత శాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాలలో పరిశోధన చేస్తు విశిష్ట సేవలందించాలి. ఈ పురస్కారాన్ని అందజేయడానికి 5 సంవత్సరాలపాటు చేసిన కృషిని పరిగణలోకి తీసుకుంటారు. ఈ అవార్డును 45 సంవత్సరాలోపు శాస్త్రవేత్తలకు అందజేస్తారు.
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందజేసే సమయంలో ఒక ప్రశంసా పత్రం, 5 లక్షల రూపాయలు నగదుతో పాటు పురస్కారం పొందిన గ్రహీతకు 65 సంవత్సరాల వరకు ప్రతి నెల 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది.
➳ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును అందజేసే రంగాలు :
- జీవ శాస్త్రం
- భూమి, వాతావరణ, ఖగోళ శాస్త్రం
- భౌతిక శాస్త్రం
- వైద్య శాస్త్రం
- రసాయన శాస్త్రం
- సాంకేతిక శాస్త్రం
- గణిత శాస్త్రం
శాంతి స్వరూప్ భట్నాగర్ 2022 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించడం జరిగింది. ఇందులో 12 మంది యువ శాస్త్రవేత్తలు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి ఎంపికయ్యారు.
➳ 2022 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పొందిన వారు :
1) రోగ నిరోధకత శాస్త్రవేత్త దీప్యమాన్ గంగూలీ ( సీఎస్‌ఐఆర్`ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికటల్ బయాలజీ, కోల్‌కతా)
2) మైక్రోబయాలజీస్ట్ అశ్వనీ కుమార్ (సీఎస్‌ఐఆర్`ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైకక్రోబయాల్ టెక్నాలజీ-చంఢీఘడ్)
3) బయాలజీస్టు మద్దిక సుబ్బారెడ్డి (సెంటర్ ఫర్ డిఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డైగ్నోస్టిక్స్-హైదరబాద్)
4) అక్కట్టు టి.బిజు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ -బెంగళూరు)
5) దేబబ్రత మైతేయ్ (ఐఐటీ-బాంబే),
6) విమల్ మిశ్ర (ఐఐటీ-గాంధీనగర్)
7) దీప్తి రంజన్ సాహూ(ఐఐటీ-Delhi)
8) రంజనీశ్ కుమార్ (ఐఐటీ-మద్రాస్)
9) అపూర్వ ఖరే (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ -బెంగళూరు)
10) నీరజ్ కాయల్ (మైక్రోసాప్ట్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా-బెంగళూరు)
11) అనింద్యా దాస్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు)
12) బసదేబ్ దాస్ గుప్తా (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్-ముంబాయి)
0 Comments