
TS DSC (TRT) Notification 2023 Out for 5089 Vacancies || Jobs in Telugu || Latest Jobs in Telugu
- తెలంగాణ డిఎస్సీ (టిఆర్టీ) 2023 నోటిఫికేషన్ విడుదల
- 5089 పోస్టుల భర్తీ
- కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్ ద్వారా పరీక్ష నిర్వహణ
- 21 అక్టోబర్ 2023 వరకు ధరఖాస్తుల స్వీకరణ
- నవంబర్‌లో పరీక్ష
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ / డీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయులు కావాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతగానో వేచిచూస్తున్న ఎదురుచూస్తున్న టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్టీ) 2023 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్టీ) నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ టీచర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీలతో పాటు 1,523 స్పెషల్ ఎడ్యూకేషన్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఉపాధ్యాయ పరీక్షను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్టు) ద్వారా నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు 20 సెప్టెంబర్ 2023 నుండి ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 44 సంత్సరాలున్న అభ్యర్థులు 21 అక్టోబర్ 2023 లోగా రూ॥1000/- ఫీజుల చెల్లించి ఆన్‌లౌన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.
నవంబర్‌లో నిర్వహించే టీఆర్టీ పరీక్ష 150 మార్కులు ఉంటుంది. ఉత్తీర్ణతకు ఓసీలు 90, బీసీలు 75, ఎస్సీ/ఎస్టీలు/దివ్యాంగులు 60 మార్కులు సాధించాలి. 20 % టెట్‌లో సాధించిన మార్కులకు వేయిటేజి ఉంటుంది. టీఆర్టీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్టుకు ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. అందులో ఒకరిని ఎంపిక చేస్తారు. 20 నుండి 30 నవంబర్ 2023 తేదిలలో కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్ (సీబీటి) ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.
Also Read : Gk Questions in Telugu
మొత్తం 5089 పోస్టులలో సెకండరీ గ్రేడ్ టీచర్లు-2575, స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు -1739, భాషా పండితులు - 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు - 164 ఉన్నాయి. వీటన్నింటిని టిఎస్ డిఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
TS DSC Notification 2023 Out
➺ పరీక్ష పేరు :
- టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్టీ) 2023
➺ TS TRT స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం కనీస అర్హతలు:
- ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈడితో పాటు గ్రాడ్యువేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
➺ TS TRT సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం కనీస అర్హతలు:
- 2 సంవత్సరాల డి.ఈడీ కోర్సుతో పాటు ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత
- లేదా
- ఎన్‌సీటీఈ చే గుర్తింపు పొందిన దానికి సమానమైన సర్టిఫికేట్ ఉండాలి.
➺ TS TRT భాషా పండితుల పోస్టుల కోసం కనీస అర్హతలు:
- ఏదేని గుర్తింపు పొంది యూనివర్సిటి నుండి బీ.ఈడీతో డిగ్రీ (తెలుగు/హిందీ/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం/సంస్కృతం) పూర్తి చేసి ఉండాలి.
➺ TS TRT ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్ పోస్టుల కోసం కనీస అర్హతలు:
ఇంటర్మిడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఎన్‌సిటిఈచే గుర్తించబడిన ఫిజికల్ ఎడ్యూకేషన్ (యు.జి.డి.పి.ఈడి) లో గ్రాడ్యుయేట్ డిప్లోమా కల్గి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ మరియు ఎన్‌సిటీఈ గుర్తించబడిన బి.పి.ఈడి లేదా ఎం.పి.ఈడి పూర్తి చేసి ఉండాలి.
Also Read : Gk in Telugu
➺ TS DSC వయోపరిమితి :
- కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి
(రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది)
➺ TS DSC ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి
➺ TS DSC ధరఖాస్తు ఫీజు :
- రూ॥1000/-
(ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసినచో ప్రతి ఉద్యోగానికి వేర్వేరుగా ఫీజు చెల్లించాలి)
➺ TS DSC పరీక్షా పద్దతి :
మొత్తం నియామక పరీక్షను 80 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కోటి అర మార్కు చొప్పున 160 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. టెట్ వెయిటేజి కింద 20 మార్కులను కేటాయించారు.
➺ TS DSC అర్హత మార్కులు :
టీఆర్టీ పరీక్ష 150 మార్కులు ఉంటుంది. టీఆర్టీ అర్హత పొందాలంటే ఓసీలు 90, బీసీలు 75, ఎస్సీ/ఎస్టీలు/దివ్యాంగులు 60 మార్కులు సాధించాలి. 20 % టెట్‌లో సాధించిన మార్కులకు వేయిటేజి ఉంటుంది. టీఆర్టీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్టుకు ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. అందులో ఒకరిని ఎంపిక చేస్తారు.
➺ TS DSC ఎగ్జామినేషన్ సెంటర్ :
- మహబూబ్‌నగర్
- రంగారెడ్డి
- హైదరాబాద్
- మెదక్
- నిజామాబాద్
- అదిలాబాద్
- కరీంనగర్
- వరంగల్
- ఖమ్మం
- నల్గొండ
- సంగారెడ్డి
ఎన్ని పోస్టులు ఉన్నాయి ? | |
---|---|
సెకండరీ గ్రేడ్ టీచర్లు | 2575 |
స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు | 1739 |
భాషా పండితులు | 611 |
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ | 164 |
మొత్తం | 5089 |
ముఖ్యమైన తేదీలు | |
---|---|
నోటిఫికేషన్ విడుదల | సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 20 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 21 అక్టోబర్ 2023 |
పరీక్ష తేది | 20 నుండి 30 నవంబర్ 2023 |
కెటగిరి | జాబ్స్ |
పేరు | టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్టీ) |
పేరు | డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ తెలంగాణ ప్రభుత్వం |
పోస్టులు | ఎస్‌జీటి, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్ |
దేశం | ఇండియా |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లాలు | 33 |
ఉద్యోగ స్థానం | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా |
విద్యార్హత | సంబందిత కోర్సులో ఉత్తీర్ణత |
వయోపరిమితి | 18 నుండి 44 సంవత్సరాలు |
ఫీజు | 1000/- |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | సీబీటీ |
ధరఖాస్తు ప్రారంభం | 20 సెప్టెంబర్ 20233 |
ధరఖాస్తు ముగింపు | 21 అక్టోబర్ 2023 |
పరీక్ష | 20 నుండి 30 నవంబర్ 2023 |
ఎంపిక ప్రక్రియ | టిఎస్ డిఎస్సీ (80%), టిఎస్ టెట్ (20%) |
నోటిఫికేషన్ కొరకు | Click Here |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
0 Comments