స్టాక్‌ మార్కెట్‌ | About stock Market in India in Telugu | Indian Economy in Telugu | General Knowledge in Telugu

 స్టాక్‌ మార్కెట్‌ 

1990 సంవత్సరంలో దీపక్‌ మోహాని అనే వ్యక్తి సెన్సెక్స్‌ అని నామకరణం చేశాడు. కొత్త స్టాక్‌ ఎక్సేంజ్‌ల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాటైన కమిటీ ఫేర్వాని కమిటీ. నాస్డాక్‌ లో లిస్టింగ్‌ అయిన మొదటి భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్‌. ప్రపంచంలో మొట్టమొదట స్థాపించిన స్టాక్‌ ఎక్స్ఛెంజ్‌ ‘లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛెంజ్‌’. 

1) బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బిఎస్‌ఈ) :

1875 సంవత్సరంలో ఆసియా ఖండంలోనే మొదటిసారిగా దీనిని ఏర్పాటు చేశారు. అప్పటి బొంబాయిలో ‘ది నేటివ్‌ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ ’ అని ఒక సంస్థ ఏర్పడినది. అదే తర్వాత బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. ఇది దేశంలో 1957లో శాశ్వత ప్రాతిపాదిక మీద మొట్టమొదట గుర్తించబడిన స్టాక్‌ ఎక్స్ఛెంజ్‌. 1986లో బిఎస్‌ఈ సెన్సెక్స్‌ అనే పేరుతో ఒక సూచీని ప్రవేశపెట్టారు. 

2) నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) :

దీనిని నవంబర్‌ 1992లో ఏర్పాటు చేశారు. ఐడిబిఐ, యుటిఐ మరియు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ను బొంబాయిలో ఏర్పాటు చేసాయి. దీని కార్యకలాపాలు 1994 నుండి ప్రారంభమయ్యాయి. 01 ఏప్రిల్‌ 1996న నిఫ్టీ అనే సూచీని ప్రవేశపెట్టింది. 

3) మల్టీ కామోడిటీ ఎక్సేంజ్‌ (ఎంసీఎక్స్‌) :

ఎంసీఎక్స్‌ లపై పూర్తి స్థాయి నియంత్రణ కల్గి ఉండేది - ఫార్వర్డ్‌ మార్కెట్స్‌ కమీషన్‌. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబాయి లో ఉంది. ఎంసీఎక్స్‌లలో ప్యూచర్స్‌ లేదా ప్యూచర్స్‌ కాంట్రాక్ట్స్‌ క్రయ విక్రయాలు జరుగుతాయి. 

4) లోకల్‌ స్టాక్‌ ఎక్సేంజేస్‌ :

భారతదేశంలో హైదరాబాద్‌తో సహా 21 పట్టణాలలో ప్రాంతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌లు ఉన్నాయి. 


సెక్యూరిటీ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)

దీనిని 12 ఏప్రిల్‌ 1988 రోజున ఏర్పాటు చేశారు. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. దీనికి 30 జనవరి 1992 రోజున చట్టబద్దత లభించింది. సెబీ ప్రాథమిక మార్కెట్‌, స్టాక్‌ మార్కెట్‌లపై పూర్తిస్థాయి నియంత్రణ కల్గి ఉంటుంది. 


భారతదేశంలో స్టాక్‌ మార్కెట్‌ సూచికలు 

➺ సెన్సెక్స్‌ 

దీనినే ‘సెన్సిటివ్‌ ఇండిక్స్‌’ అని కూడా పిలుస్తారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌కి సంబంధించిన సూచిక. ఈ సూచికలోని ప్రాతినిధ్య సంస్థలు 30వరకు ఉన్నాయి. ఇది 1978-79 ఆధార సంవత్సరంగా పనిచేస్తుంది. 

➺ నేషనల్‌ ఇండెక్స్‌ 

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజికి సంబంధించిన మరొక సూచిక నేషనల్‌ ఇండెక్స్‌. దీనిలోని ప్రాతినిధ్య సంస్థలు 100 ఉన్నాయి. ఇది 1983-84 ఆధార సంవత్సరంగా పనిచేస్తుంది. 

➺ బిఎస్‌ఇ-200

ఈ సూచికలోని ప్రాతినిధ్య సంస్థలు 200 ఉన్నాయి. ఇది 1989-90 ఆధార సంవత్సరంగా పనిచేస్తుంది. 

➺ డోలెక్స్‌ 

బిఎస్‌ఇ-200 డాలర్‌ విలువను డోలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 1989-90. 

➺ బాంకెక్స్‌ 

ఇది జూన్‌ 2003 నుండి పనిచేస్తుంది. ఇందులో 12 బ్యాంకుల వాటాలు చేర్చబడ్డాయి. 

➺ నిఫ్టి ఫిప్టీ 

ఈ సూచికను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి తయారు చేస్తుంది. దీనిలో 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలు చేర్చబడ్డాయి. 


Post a Comment

0 Comments