డిగ్రీతో గెజిటెడ్ హోదా కేంద్ర కొలువు
CSIR - Section & Assistant Section Officer Jobs in Telugu
దేశంలోనే అత్యున్నతమైన పరిశోదన సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) 444 అడ్మినిస్ట్రేటీవ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం కంబైన్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఏఎస్‌ఈ) నిర్వహించనుంది. దీనికి డిగ్రీ పూర్తి చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-బి గెజిటెడ్ హోదాలో కేంద్ర కొలువు సాధించవచ్చు. సీఎస్‌ఐఆర్ సైన్స్ పరిశోధనల్లో మేటి సంస్థ. ఈ సంస్థ పరిపాలన విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష సీఏఎస్‌ఈ.
సీఎస్‌ఐఆర్-సీఏఎస్‌ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 444 సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
➺ పోస్టుల వివరాలు :
- సెక్షన్ ఆఫీసర్ - 76 (జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్)
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 368 (జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్)
➺ అర్హత :
- ఏదేనీ బ్యాచిలర్ డిగ్రీ
➺ పరీక్షా విధానం :
- 500 మార్కులకు గాను మూడు పేపర్లుగా విభజించి పరీక్ష నిర్వహిస్తారు.
- 12-12-2024 నాటికి 33 సంవత్సరాలు నిండి ఉండాలి.
(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సం।లు, ఓబీసీలకు 3 సం॥లు, వికలాంగులకు 10 సం॥లు సడలింపు ఉంటుంది )
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది.12 జనవరి 2024
- పేపర్ 1, 2 పరీక్ష తేది.ఫిబ్రవరి 2024
- తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రం- హైదరాబాద్
0 Comments