భారతదేశంలోని రైల్వే జోన్స్ (Railway Zones)
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భారతీయ రైల్వేలు 17 జోన్‌లుగా విభజించబడ్డాయి, వీటిలో ప్రతి ఒక్కటి జనరల్ మేనేజర్ నేతృత్వంలో ఉంటుంది మరియు నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో రైల్వే కార్యకలాపాల నిర్వహణ మరియు నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వేజోన్. అతిచిన్న రైల్వేజోన్ ఈశాన్య సరిహద్దు రైల్వేజోన్. మొట్టమొదటగా ఏర్పాటు చేసిన రైల్వేజోన్ దక్షిణ రైల్వే జోన్.
| భారతదేశంలోని రైల్వే జోన్స్ | ||
|---|---|---|
| 1 | ఉత్తర రైల్వే | న్యూఢిల్లీ |
| 2 | ఈశాన్య రైల్వే | గోరఖ్పూర్ (ఉత్తరప్రదేశ్) |
| 3 | ఈశాన్య సరిహద్దు రైల్వే | మాలిగాం - గువహాతి (అసోం) |
| 4 | తూర్పు రైల్వే | కోల్‌కతా (పశ్చిమబెంగాల్) |
| 5 | ఆగ్నేయ (సౌత్ ఈస్టర్న్) రైల్వే | కోల్‌కతా (పశ్చిమబెంగాల్) |
| 6 | దక్షిణ మధ్య రైల్వే | సికింద్రాబాద్ (తెలంగాణ) |
| 7 | మద్య రైల్వే | ముంబాయి (మహారాష్ట్ర) |
| 8 | పశ్చిమ రైల్వే | ముంబాయి (మహారాష్ట్ర |
| 9 | నైఋతి (సౌత్ వెస్ట్రన్) రైల్వే | హుబ్లి (కర్ణాటక) |
| 10 | వాయువ్యం (నార్త్ వెస్ట్రన్) రైల్వే | జైపూర్ (రాజస్తాన్) |
| 11 | పశ్చిమ మధ్య రైల్వే | జబల్పూర్ (మద్యప్రదేశ్) |
| 12 | దక్షిణ రైల్వే | చెన్నై (తమిళనాడు) |
| 13 | ఆగ్నేయ మద్య (సౌత్ ఈస్ట్) రైల్వే | బిలాస్ పూర్ (ఛత్తీస్‌ఘడ్) |
| 14 | తూర్పు కోస్తా (ఈస్ట్ కోస్ట్ ) రైల్వే | భువనేశ్వర్ (ఓడిసా) |
| 15 | తూర్పు మధ్య రైల్వే | హాజీపూర్ (బీహార్) |
| 16 | ఉత్తర మధ్య రైల్వే | అలహాబాద్ (ఉత్తరప్రదేశ్) |
| 17 | కోల్‌కతా మెట్రోపాలిటన్ రైల్వే | కోల్‌కతా |
| కేంద్ర ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం కేంద్రం దక్షిణ కోస్తా రైల్వేను తేది.27-02-2019 రోజున ప్రకటించింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి కొత్తజోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. |
0 Comments