
తెలంగాణ చరిత్ర (ముల్కీ ఉద్యమం) జీకే ప్రశ్నలు మరియు సమాధానాలు
Telangana MCQ Gk Questions in Telugu with Answers | Telangana History Questions in Telugu
☛ Question No.1
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) నాల్ముల్కీలు ఉద్యోగాల్లో చేరడం వంటి చర్యలను బూర్గుల ప్రభుత్వం చేపట్టకపోవడం వల్ల 1952 గైర్ ముల్కీ ఉద్యమం వచ్చింది.
2) ఈ ఉద్యమం మొదటిసారిగా వరంగల్‌లో ప్రారంభమైంది
3) ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది ఉపాధ్యాయులు
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : బి) 1 మరియు 2 మాత్రమే
☛ Question No.2
1952 జూన్ నెలలో హైదరాబాద్ శాసనసభ సమావేశాల సందర్భంగా నాన్‌ముల్కీ ఉద్యోగులపై ప్రశ్నించిన ఈ క్రింది రాజకీయ నాయకులు ఎవరు ?
1) వెంకట రమణరావు
2) రాజారాం
3) ప్రతాపరెడ్డి
4) కొండా లక్ష్మణ్
5) గురువారెడ్డి
6) హనుమంతరావు
ఎ) పైవన్నీ
బి) 1, 2, 3, 5, 6
సి) 1, 2, 4, 5, 6
డి) 1, 2, 5, 6
జవాబు : బి) 1, 2, 3, 5, 6
☛ Question No.3
1952 గైర్ ముల్కీ ఉద్యమం జరుగుతున్నప్పుడు వరంగల్‌లో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ఎవరు పనిచేశారు ?
ఎ) రషీద్ అల్ హసన్
బి) పార్థసారధి
సి) హయగ్రీవాచారి
డి) షేండద్కర్
జవాబు : బి) పార్థసారధి
☛ Question No.4
ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) 1952 జూన్, జూలై నెలలో పార్ధసారథి ఒకేసారి 180 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు.
బి) హనుమకొండ పట్టణంలోని సెంట్రల్ మిడిల్ స్కూల్స్‌కు చెందిన 18 మంది ఉపాధ్యాయులను ఒకేసారి బదిలీ చేసి వారికి ఇంక్రిమెంట్ నిలివేయడం జరిగింది.
సి) పార్థసారధి అక్రమాలపై రషిద్ అల్ హసన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు
డి) పార్థసారధి వేదింపులు భరించలేక రషీద్ అల్ హసన్ గుండెపోటుతో మరణించాడు
జవాబు : సి) పార్థసారధి అక్రమాలపై రషిద్ అల్ హసన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు
☛ Question No.5
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1952 జూలై 28న వరంగల్‌లో విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు
2) ఈ కార్యచరణ కమిటీకి బుచ్చయ్యను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు
జవాబు : బి) 1 మాత్రమే
Also Read :
☛ Question No.6
విద్యార్థి కార్యాచరణ కమిటీ సభ్యులు తమ యొక్క తీర్మాణాన్ని ముఖ్యమంత్రికి ఏ రోజున సమర్పించారు ?
ఎ) 06 అగస్టు 1952
బి) 07 అగస్టు 1952
సి) 05 అగస్టు 1952
డి) 04 అగస్టు 1952
జవాబు : ఎ) 06 అగస్టు 1952
☛ Question No.7
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1952 అగస్టు 22న బూర్గుల రామకృష్ణారావుకు వరంగల్ పట్టణానికి సంబంధించిన విద్యార్థులు ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మాణం గురించి నిలదీశారు
2) 1952 అగస్టు 22న విద్యార్థులు కార్యాచరణ కమిటీ సమావేశమై అగస్టు 27వ తేదిలోపు సబ్ కమిటీ ఏర్పాటు ప్రకటన రాకుంటే నిరవధిక సమ్మే చేస్తామని ముఖ్యమంత్రికి లేఖ రాశారు
3) 27 అగస్టు 1952న విద్యార్థులు వరంగల్‌లో బంద్‌ను హింసాత్మకంగా చేపట్టారు
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 1 మరియు 3
డి) 2 మరియు 4
జవాబు : బి) 1 మరియు 2
☛ Question No.8
1952 ముల్కీ ఉద్యమం జరుగుతున్నప్పుడు వరంగల్ కలెక్టర్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) రాజేంద్రరావు దేశ్‌పాండే
బి) గోవిందరావు దేశ్‌పాండే
సి) దేశ్‌పాండే
డి) గురుగోవింద్
జవాబు : బి) గోవిందరావు దేశ్‌పాండే
☛ Question No.9
1952 హైదరాబాద్‌లో ముల్కీ సమస్యపై జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించింది ఎవరు ?
ఎ) కొండా లక్ష్మణ్ బాపూజీ
బి) గోవిందరావు దేశ్‌పాండే
సి) తిమ్మరాజు
డి) రామాచారి
జవాబు : సి) తిమ్మరాజు
☛ Question No.10
ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
1) 27 అగస్టు 1952న హైదరాబాద్‌లో చదర్ఘాట్ నుండి బద్రుక కాలేజి వరకు ఊరేగింపు నిర్వహించారు
బి) 31 అగస్టు 1952న హైదరాబాద్‌లో సైఫాబాద్ కాలేజి వద్ద నుండి అబిడ్స్ వరకు విద్యార్థులు పెద్ద ర్యాలీ నిర్వహించారు
సి) ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు చేసిన నినాదాలు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నాన్ ముల్కీ గో బ్యాక్ స్టూడెంట్ యూనియన్ జిందాబాద్
డి) పోలీసుల దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు
జవాబు : డి) పోలీసుల దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు
☛ Question No.11
ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1952 సిటీ కాలేజ్ సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసు కమీషర్ శివకుమార్ లాల్
2) సిటీ కాలేజ్ విద్యార్థుల ఆందోళన శాంతిపజేయడానికి ప్రయత్నించింది కొండా లక్ష్మణ్ బాపూజీ
3) 03 సెప్టెంబర్ 1952న పతర్ ఘాట్ ప్రాంతంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మరణించారు
ఎ) 1, 2 మరియు 3
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1 మరియు 2
జవాబు : బి) 2 మరియు 3
☛ Question No.12
ఏ ప్రదేశంలో జరిగిన కాల్పులలో నలుగురు విద్యార్థులు మరణించారు ?
ఎ) సిటీ కాలేజ్
బి) అప్జల్ఘంజ్
సి) సుల్తాన్ బజార్
డి) ఫతేమైదాన్
జవాబు : బి) అప్జల్ఘంజ్
☛ Question No.13
1952 ముల్కీ ఉద్యమం ప్రధానంగా దేని కొరకు జరిగింది ?
ఎ) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు
బి) తెలుగు భాష అభివృద్ది కోసం
సి) ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం
డి) రజాకారుల దుశ్చర్యలకు వ్యతిరేకంగా
జవాబు : సి) ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం
0 Comments