Indian History in Telugu | ఆధునిక భారతదేశ చరిత్ర - మహిళల పాత్ర | General Knowledge in Telugu

Indian History in Telugu | ఆధునిక భారతదేశ చరిత్ర  - మహిళల పాత్ర
ఆధునిక భారతదేశ చరిత్ర - మహిళల పాత్ర 
Indian History in Telugu | Modern Indian History Gk in Telugu | Gk in Telugu 

Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

➺ ఝాన్సీ లక్ష్మిబాయి :

ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క అసలు పేరు మణికర్ణిక. 1857 సిపాయిల తిరుబాటు ఉద్యమంలో పాల్గొని బ్రిటిషు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన వీర వనిత.  లక్ష్మీబాయి, బ్రిటిషువారికి జరిగిన యుద్ధంలో గ్వాలియర్‌ వద్ద యుద్దం చేస్తూ యుద్ధభూమిలోనే వీరమరణం పొందింది. బ్రిటిషువారికి వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి సాగించిన పోరాటం ఇప్పటి మహిళలకు కూడా స్పూర్తి దాయకంగా నిలుస్తుంది. 

➺ సావిత్రిబాయి పూలే :

సావిత్రిబాయి పూలే 1831 సంవత్సరంలో మహారాష్ట్రంలోని సతారా జిల్లా, నయాగావ్‌ గ్రామంలో జన్మించింది. సావిత్రిబాయి పూలే భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు మహిళలు మరియు అట్టడుగు కులాల కోసం పనిచేసిన సంఘ సంస్కర్త. మహారాష్ట్రలోని మహిళల హక్కులను సాధించడంలో భర్త జ్యోతిబా పూలేతో పాటు సావిత్రిబాయి పూలే ముఖ్యమైన పాత్ర పోషించింది. 1848 సంవత్సరంలో పూణేలో ‘‘అంటరాని’’ కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించాడు. సావిత్రిబాయికి శిక్షణ ఇచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయినిగా చేశాడు. తక్కువ స్థాయి కులాల బాలికలకు చదువు చెప్పడం వల్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ సావిత్రిబాయి దానిని కొనసాగించింది. జ్యోతిరావు పూలే మరణించిన తర్వాత ‘‘సత్య శోధక్‌ సమాజ్‌’’ బాద్యతలను సావిత్రిబాయి చేపట్టింది. ఆమె సమావేశాలకు అధ్యక్షత వహించి కార్యకర్తలకు మార్గదర్శకం చేసింది. ప్లేగు మహమ్మారి బారిన పడిన ప్రజల కోసం సావిత్రిబాయి అహర్నిశలు పనిచేసింది. పేద పిల్లలకోసం శిబిరాలు నిర్వహించింది. ఈ మహమ్మారి కాలంలో ఆమె ప్రతి రోజు రెండు వేల మంది పిల్లలకు అన్నం వండి పెట్టింది. సావిత్రిబాయి పూలే 1897లో మరణించింది. 

➺ అనిబిసెంట్‌ :

సెప్టెంబర్‌ 1916లో మద్రాస్‌ ప్రాంతంలో అనిబిసెంట్‌ హోంరూల్‌ లీగ్‌ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థకు అనిబిసెంట్‌ అధ్యక్షురాలిగా, రామస్వామి అయ్యర్‌ జనరల్‌ సెక్రటరీగా, బిపి వాడి కోశాధికారి నియమితులయ్యారు. 1918లో వాడియా మద్రాసు లేబర్‌ యూనియన్‌ను స్థాపించాడు. ఇది దేశంలో మొదటి ట్రేడ్‌ యూనియన్‌. ఈ ఉద్యమం బొంబాయి, కర్ణాటక, సెంట్రల్‌ ప్రావిన్సులలో విస్తరించింది. ఆంధ్రాలో జరిగిన హోంరూల్‌ ఉద్యమానికి గాడిచర్ల హరసర్వోత్తమరావు నాయకత్వం వహించాడు. 

1916 అక్టోబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 500లకు పైగా హోంరూల్‌ శాఖలు ఏర్పడ్డాయి. అనిబిసెంట్‌ కామన్‌ వీల్‌, న్యూ ఇండియా అనే పత్రికలను నడిపి, అనేక వ్యాసాలను అందులో ప్రచురించి భారతీయులను ఉత్తేజ పరిచారు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేసి ఈ రెండు పత్రికలను నిషేదించారు. 

అనిబిసెంట్‌ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా 1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, భూలాబాయ్‌ దేశాయి, చిత్తరంజన్‌ దాస్‌, మదన్‌మోహన్‌ మాలవ్య, లాలా లజపతిరాయ్‌ వంటి నాయకులు హోంరూల్‌ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

➺ మాతంగిని హజ్రా :

ఈమె 1932 లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తూములూక్‌ కోర్టు భవనంపై జాతీయ చెండా ఎగరవేయడానికి ప్రయత్నం చేయడంతో బ్రిటిషర్లు ఈమె అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దీనికి బయపడని మాతంగిని హజ్రా 1942 లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని పోలీసు కాల్పుల్లో మరణించింది. 


Also Read :


➺ మేడం బికాజీ కామా :

దాదాబాయి నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల నుండి ప్రేరణ పొంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాది బారిన పడి, చికిత్స కోసం లండన్‌ వెళ్లారు. అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శకంగా నిలిచారు. ‘ఫ్రీ ఇండియా సోసైటీ’ ని స్థాపించారు. విదేశాల్లో వందేమాతరం పత్రికను నిర్వహించారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశారు. మేడం కామాను ‘‘భారత విప్లవకారుల మాత’’గా అభివర్ణిస్తారు. 

➺ కమలాదేవి చటోపాధ్యాయ :

మహాత్మగాంధీతో కలిసి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొంది. ‘సేవాబేస్‌’ పథకం ద్వారా మహిళా వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఆమె కార్యక్రమాలకు విసుగుచెందిన బ్రిటిషు ప్రభుత్వం సేవాబేస్‌ పథకాన్ని రద్దు చేసింది. ఆమెను అరెస్టు చేసి ఏళ్ల తరబడి జైల్లో ఉంచారు. సంగీతనాటక్‌ అకాడమీ, భరతనాట్య సంగమం మరియు ఇండియన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌ ఫౌండేషన్‌ స్థాపించారు. మద్రాసు ప్రెసిడెన్సీ శాసనసభకు పోటీ చేసిన మొదటి మహిళ. భారతీయ న్యాయస్థానం ద్వారా విడాకులు తీసుకున్న మొదటి మహిళగా గుర్తింపు సాధించారు. 

➺ సరోజినీ నాయుడు :

సరోజినీ నాయుడు గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. 1915 లో ముంబాయి, 1916 లో లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలకు హజరయ్యారు. 1925 డిసెంబర్‌ కాన్పూర్‌లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు సాధించారు. అంతేకాకుండా స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నర్‌(ఉత్తరప్రదేశ్‌) గా పనిచేశారు. మహాత్మ గాంధీ పిలుపుమేరకు శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈమె జయంతిని ప్రతియేటా ‘జాతీయ మహిళా దినోత్సవం’ గా జరుపుకుంటారు. భారతకోకిల (నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా) గా ప్రసిద్ది చెందారు. సరోజినీ నాయుడుకి ఉర్దూ, తెలుగు, బెంగాలీ మరియు పర్షియన్‌ భాషలపై మంచి పట్టుంది. 

➺ ఉషామెహతా :

బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాడినా గాంధీజీతో పాటు ఇతర ముఖ్యనాయకులు బ్రిటిషువారు అరెస్టు చేసిన సమయంలో ఉషామెహతా బొంబాయిలో రహస్య రెడియో స్థాపించి ఉద్యమకారులకు చైతన్యం చేయడంతో ముఖ్యపాత్ర పోషించారు. ప్రముఖ నాయకులు లేని సయమంలో బ్రిటిషువారికి వ్యతిరేకంగా ఉద్యమ వ్యాప్తి చేయడంలో క్రియాశీలక పాత్రపోషించారు ఉషామెహతా. ఈమె ‘మహాత్మాగాంధీ అండ్‌ హ్యూమనిజం’ అనే గ్రంథాన్ని లిఖించారు. 1998లో భారత ప్రభుత్వం ఈమెకు పద్మవిభూషణ్‌ తో సత్కరించింది. 

➺ అరుణా అసఫ్‌ అలీ :

ఈమె ఉప్పు సత్యాగ్రహం సమయంలో బహిరంగ ఊరేగింపుల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించి గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ స్థాపించి బ్రిటిషువారికి వ్యతిరేకంగా పనిచేసింది. అజ్ఞాతంలో ఉంటూనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాసపత్రిక ఇంక్విలాబ్‌కు సంపాదకురాలిగా వ్యవహరించారు. 1997లో ఈమె మరణించిన తర్వాత ‘‘భారతరత్న’’ పురస్కారం లభించింది. 

➺ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ :

గాంధీజీ పిలుపుమేరకు జాతీయోద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ . 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు జీవితం గడిపారు. సంఘసంస్కరణ ఉద్యమంలోనూ ప్రముఖపాత్ర పోషించారు. 1929 మహిళా సాధికారిత కొరకు మద్రాసులో ‘‘ఆంధ్ర మహిళా సభ’’ ను స్థాపించారు. 

➺ కస్తూర్భా గాంధీ :

మహాత్మాగాంధీ యొక్క సతీమణి. దక్షిణాఫ్రికాలో ఆంగ్లేయుల జాత్యహాంకార విధానాలపై మహాత్ముడు సాగించిన అవిశ్రాంత అహింసా పోరాటంలో ఆయన వెంట ఉండి నడిచిన ధీర వనిత కస్తూర్బాగాంధీ. స్వాతంత్ర ఉద్యమాల్లో అనేకసార్లు జైలుకెళ్లారు. 



Also Read :

Post a Comment

0 Comments