Telangana History in Telugu | Telangana Modern Poets in Telugu | ఆధునిక తెలంగాణ కవులు

Telangana History in Telugu | Telangana Modern Poets in Telugu | ఆధునిక తెలంగాణ కవులు

ఆధునిక తెలంగాణ కవులు
Telangana History in Telugu | History in Telugu  

తెలంగాణ రాష్ట్రంలోని ఆధునిక కవులు తమ యొక్క రచనల ద్వారా ప్రజల్ని చైతన్య పరచడమే కాకుండా వారిని జాగృతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. నిజాం పాలనలో తీవ్ర బాదలు అనుభవిస్తున్న కాలంలో తమ రచనల ద్వారా స్వాతంత్రోద్యమం వైపు మళ్లేలా చేశారు. అందులో కొందరి గురించి తెలుసుకుందాం .. !

➠ కాళోజీ నారాయణరావు :

కాళోజీ నారాయణ రావు 09 సెప్టెంబర్‌ 1914 రోజున వరంగల్‌ జిల్లాలోని మడికొండలో జన్మించారు. ఇతను ఆర్య సమాజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు. 08 అగస్టు 1946 రోజున మొగిలయ్య జాతీయ జెండాను ఎగురవేసినందుకు రజాకార్లు నరికివేశారు. ఈ సందర్భంగా నిజాం నవాబును ప్రశ్నించినందుకు కాళోజిని 3 నెలలపాటు బహిష్కరించారు. తనను జైల్లో వేయడంతో జైలు జీవితంలో గ్రంథాలను రచించారు. అనేక గ్రంథాలను అనువధించారు. తెలంగాణ మాండలికాలకు తన రచనల్లో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈయన పుట్టినరోజును 09 సెప్టెంబర్‌ రోజున తెలంగాణ మాండలిక దినోత్సవంగా జరుపుకుంటారు. కాళోజి నారాయణరావు తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో అనేర రచనలు చేశారు. కాళోజికి గౌరవ డాక్టరేట్‌తో పాటు పద్మవిభూషణ్‌ లభించింది. ఈయన చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ పేరు పెట్టింది. 

కాళోజీ రచనలు 

  • అణాకతలు 
  • కాళోజీ కథలు 
  • పార్ధీవన్యాయం 
  • నా గొడవ
  • తుది విజయం 
  • మనది నిజం 
  • జీవన గీతం 
  • తెలంగాణ ఉద్యమ కవితలు 
  • బాపు బాపు బాపు 

➠ వట్టికోట ఆళ్వారు స్వామి : 

ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లాలో చెరువు మాధవరంలో 01 నవంబర్‌ 1915 రోజున జన్మించారు. తెలంగాణ తొలి నవలా రచయిత, ఉద్యమాకారునిగా పేరుగాంచాడు. గ్రంథాలయోద్యమం ద్వారా స్పూర్తి పొంది నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. అంతేకాకుండా క్విట్‌ ఇండియాలో ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. దేశోద్దారక సూచీ గ్రంథాలయాన్ని స్థాపించి పాతపత్రికలు, సంచికలు పరిశోధకులకు అందజేశారు. 


Also Read :


రచనలు 

  • ప్రజల మనిషి 
  • గంగు (తెలంగాణ తొలి నవల) 
  • జైలు లోపల (కథల సంపుటి) 
  • రామప్పతల్లి (వ్యాస సంపుటి) 
  • తెలుగుతల్లి (మాసపత్రిక) 

➠ దాశరథి కృష్ణమాచార్యులు :

దాశరథి కృష్ణమాచార్యులు 22 జూలై 1927న వరంగల్‌ జిల్లా గూడూరు (మానుకోట) లో జన్మించారు. దాశరథి ’నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా చెప్పారు. పద్యాన్ని ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించారు. దాశరథి రచించిన ‘తిమిరంతో సమరం’ అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు. 

రచనలు 

  • రుద్రవీణ 
  • అగ్నిధార 
  • ధ్వజమెత్తిన ప్రజ 
  • మహాంద్రోదయం 
  • మార్పు నా తీర్పు 
  • ఆలోచనాలోచనలు 
  • తిమిరంతో సమరం 

➠ సుద్దాల హనుమంతు :

సుద్దాల హనుమంతు నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించిన ఉద్యమకారుడు. సుద్దాల హనుమంతు తన పాటల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి దొరలకు వ్యతిరేకంగా వెట్టిచాకిరి నుండి విముక్తి కల్గేలా చేశారు. ఈయన పాటలు ‘వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. 

➠ దాశరథి రంగాచార్య :

ఈయన 24 అగస్టు 1928న పాత వరంగల్‌ జిల్లా, చిన్నగూడూరులో జన్మించారు. 17 సంవత్సరాల వయస్సులో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. రావి నారాయణరెడ్డి స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో చేరారు. వెట్టిచాకిరీ, దోపిడీ గుణాన్ని చూసి స్పందించి నవలా రచన చేశారు. ఈయన తొలిసారిగా నాలుగు వేద సంహితలను తెలుగులోకి అనువదించారు. తెలంగాణ ఆత్మతత్వం వివరించారు. 

రచనలు 

  • చిల్లర దేవుళ్లు 
  • మోదుగు పూలు 
  • జనపదం 


Also Read :

Post a Comment

0 Comments