-GK-QUESTIONS-IN-TELUGU.jpg)
ఇండియన్ హిస్టరీ (ప్రముఖ కవులు-రచనలు) జీకే ప్రశ్నలు - జవాబులు
Indian History in Telugu : Books and their Writer Gk Questions in Telugu with Answers | History in Telugu
☛ Question No.1
ఈ క్రిందివాటిలో కౌటిల్యుడు రచించిన శాస్త్రం ఏది ?
ఎ) అర్థశాస్త్రం
బి) పౌరశాస్త్రం
సి) మానవ శాస్త్రం
డి) సాంఘిక శాస్త్రం
జవాబు : ఎ) అర్థశాస్త్రం
☛ Question No.2
ఈ క్రిందివాటిలో అశ్వఘోషుడు రచన ఏది ?
ఎ) ఇండికా
బి) సౌందర్యనందన
సి) ఎ మరియు బి
డి) మహావిభాష్య సూత్ర
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.3
ఈ క్రిందివాటిలో కవులను వారి రచనలతో జతచేయండి ?
1) వసుమిత్రుడు
2) హరిసేనుడు
3) అమర సింహుడు
4) గుణాడ్యుడు
ఎ) అమరకోశం
బి) మహావిభాష్య సూత్ర
సి) బృహత్కథ (పైశాచి)
డి) అలహాబాద్ ప్రశస్తి
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
☛ Question No.4
ఈ క్రిందివాటిలో కాళిదాసు రచనల్లో లేనిదానిని గుర్తించండి ?
ఎ) మేఘదూతం
బి) కుమారసంభవం
సి) రసరత్నాకరం
డి) రఘువంశం
జవాబు : సి) రసరత్నాకరం
☛ Question No.5
ఈ క్రిందివాటిలో ‘హలుడు’ రచన ఏది ?
ఎ) రతిశాస్త్రం
బి) యోగాచార శాస్త్రం
సి) మహావిభాష్య సూత్ర
డి) గాథాసప్తశతి
జవాబు : డి) గాథాసప్తశతి
☛ Question No.6
ఈ క్రిందివాటిలో కవులను వారి రచనలతో జతచేయండి ?
1) మాఘుడు
2) శర్వవర్మ
3) విశాఖదత్తుడు
4) వరాహ మిహిరుడు
ఎ) శిశుపాల వధ
బి) ముద్రరాక్షసం, దేవీచంద్ర గుప్తం
సి) కాతంత్ర వ్యాకరణం
డి) బృహత్ సంహిత
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
☛ Question No.7
యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో పనిచేసిన ఆచార్య నాగార్జునుడు రచనల్లో లేని దానిని గుర్తించండి ?
ఎ) సుహృల్లేఖ, మూల మాధ్యమిక శాస్త్రం
బి) ప్రజ్ఞా పారమిత శాస్త్రం, ద్వాదశ నియక శాస్త్రం
సి) శూన్యసప్తతి, యోగాచార శాస్త్రం
డి) ముద్రరాక్షసం, దేవీచంద్ర గుప్తం
జవాబు : డి) ముద్రరాక్షసం, దేవీచంద్ర గుప్తం
Also Read :
☛ Question No.8
ఈ క్రిందివాటిలో ఆర్యభట్ట రచనలు ఏవి ?
ఎ) సూర్యసిద్దాంతం
బి) ఆర్యభట్టీయం
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.9
ఈ క్రిందివాటిలో కవులను వారి రచనలతో జతచేయండి ?
1) శూద్రకుడు
2) విష్ణుశర్మ
3) బాణుడు
4) వాకృతి
ఎ) గౌడవాహో, మద్రమహు విజయం
బి) పంచతంత్రం
సి) హర్ష చరిత్ర, కాదంబరి
డి) మృచ్ఛకటికం
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
☛ Question No.10
ఈ క్రిందివాటిలో భవభూతి రచనల్లో లేనిదానిని గుర్తించండి ?
ఎ) పార్వతీ పరిణయం
బి) మాలతీ మాదవం
సి) ఉత్తర రామచరితం
డి) మహావీర చరిత
జవాబు : ఎ) పార్వతీ పరిణయం
☛ Question No.11
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం రచించాడు
2) కిరాతార్జునీయం అనే రచన చేసింది భారవి
3) జినసేనుడు ఆదిపురాణ, పార్శాభ్యుదయం అనే గ్రంథాలు రచించాడు
4) రాజశేఖరుడు కర్పూరమంజరి, కావ్య మీమాంస, భువనకోశం అనే గ్రంథాలు లిఖించాడు.
ఎ) 1, 2 మరియు 4
బి) 2, 3 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 1, 3 మరియు 4
జవాబు : సి) 1, 2, 3, 4
☛ Question No.12
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) విజ్ఞానేశ్వరుడు మితాక్షర అనే గ్రంథాన్ని లిఖించాడు.
2) బిల్హనుడు విక్రమాంకదేవ చరిత్ర అనే రచన చేశాడు.
3) మహాభారతం, ఆంధ్రశబ్ద చింతామణి అనే రచనలు నన్నయచే లిఖించబడ్డాయి
4) తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాశాడు.
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 2, 3, 4
సి) 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4
జవాబు : బి) 1, 2, 3, 4
☛ Question No.13
ఈ క్రిందివాటిలో కవులను వారి రచనలతో జతచేయండి ?
1) శ్రీహర్ష
2) శ్రీనాథుడు
3) కాసుల పురుషోత్తమ కవి
4) ఎర్రన
ఎ) హరవిలాసం, శృంగార నైషదం
బి) రామాయణం, హరివంశం
సి) హర్షనైషద చరిత
డి) ఆంధ్రనాయక శతకం
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
☛ Question No.14
ఈ క్రిందివాటిలో తెనాలి రామకృష్ణుని గ్రంథాల్లో లేని దానిని గుర్తించండి ?
ఎ) పాండురంగ మహత్యం
బి) ఘటికాచల మహత్యం
సి) ఎ మరియు బి
డి) హరి వంశం
జవాబు : డి) హరి వంశం
☛ Question No.15
ఈ క్రిందివాటిలో పాల్కురికి సోమన రచనలు ఏవి ?
ఎ) బసవ పురాణం
బి) పండితారాధ్య చరిత్ర
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు
జవాబు : సి) ఎ మరియు బి
0 Comments