
PM Surya Ghar Muft Bijlee Yojana Scheme | పీఎం సూర్యఘర్ - ముఫ్త్ బిజిలీ పథకం | Gk in Telugu
- కేంద్ర ప్రభుత్వం నూతన పథకం
- సోలార్ ద్వారా ఉచితంగా విద్యుత్ ఉత్పత్తి
- ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్
కేంద్ర ప్రభుత్వ మరో కొత్త పథకం ప్రారంభించింది. ఉచిత విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా ఆదాయం కూడా సమకూర్చుకునే ‘‘పీఎం సూర్యఘర్ - ముఫ్త్ బిజిలీ’’ పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. పీఎం సూర్యఘర్ విద్యుత్ పథకానికి 2023-24 నుండి 2026-27 వరకు 75 వేల 21 కోట్లు కేటాయించింది. ఈ పథకానికి ప్రతి ఒక్కరూ ధరఖాస్తు చేసుకోవచ్చు.
పీఎం సూర్యఘర్ విద్యుత్ పథకం ద్వారా ప్రతి ఇంటిపై రూఫ్ సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్‌ను గృహవసరాలకు వాడుకోవచ్చు.
➺ ఏమిటీ పీఎం సూర్యఘర్ పథకం ?
ఈ పథకం రెండు విధాలుగా విభజించి కేంద్రం అమలు చేయనుంది
1) 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60% సబ్సిడీ అంతకు పైబడిన యూనిట్లకు 40% సబ్సిడీ అందిస్తుంది.
2) 3 కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తికి 1 లక్ష 45 వేలు ఖర్చుయితే అందులో 78 వేల రూపాయలు కేంద్రం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. మిగిలిన మొత్తం బ్యాంకు రుణం రూపంలో అందిస్తుంది.
Also Read :
➺ ఆదాయం ఎలా సమకూర్చుకోవచ్చు ..?
పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న సోలార్ ఫలకాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో మొదటి 300 యూనిట్లు గృహ అవసరాలకు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకునే వీలుంటుంది. 1 కిలోవాట్‌కు 30 వేల రూపాయలు, 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నవారికి 60 వేల రూపాయలు, 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నవారికి గరిష్టంగా 78వేల రూపాయలు సబ్సిడీ వర్తిస్తుంది.
నెలకు 50 యూనిట్ల విద్యుత్ ఉపయోగించేవారికి 1 కిలోవాట్ నుండి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 150 నుండి 300 యూనిట్లు విద్యుత్‌ను వినియోగించేవారు 2 కిలోవాట్ల నుండి 3 కిలోవాట్ల సామర్థ్యం కల్గిన సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
➺ సబ్సిడీ ఎంత ఉంటుంది ?
పీఎం సూర్యఘర్ కొరకు ధరఖాస్తు చేసుకున్న వారికి ఒక కిలోవాట్ సిస్టమ్‌కు 30 వేల రూపాయలు, 2 కిలోవాట్ల సిస్టమ్‌కు 60 వేల రూపాయలు, 3 కిలోవాట్ల సిస్టమ్‌కు 78 వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. మిగిలిన మొత్తం బ్యాంక్ రుణం రూపంలో పొందవచ్చు.
For Online Apply
జవాబు : ప్రతి ఇంటి పైకప్పు సోలార్‌ద్వారా విద్యుత్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం
జవాబు : PM Surya Ghar Muft Bijlee Yojana పథకానికి ఎవరైన ధరఖాస్తు చేసుకోవచ్చు
జవాబు : PM Surya Ghar Muft Bijlee Yojana పథకానికి 40% శాతం నుండి 60 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది.
జవాబు : PM Surya Ghar Muft Bijlee Yojana పథకం ద్వారా 1 కిలోవాట్ నుండి 3 కిలోవాట్ల వరకు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు
జవాబు : గరిష్టంగా 78వేల వరకు సబ్సిడీ రూపంలో లభిస్తుంది.
0 Comments