
రౌలట్ చట్టం
Rowlatt Act | Indian History in Telugu | Gk in Telugu | General Knowledge in Telugu
బ్రిటిష్ ప్రభుత్వం 1917 సంవత్సరంలో బ్రిటిష్ జడ్జి అయిన సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రౌలట్ కమిటీ లేదా సెడిషన్ కమిటీ అని పేరు. ఈ రౌలట్ కమిటీలో సర్ బాసిల్ స్కాట్, సర్ వెర్ని లోవెట్, కుమారస్వామి శాస్త్రీ, ప్రభాష్ చంద్ర మిట్టర్ సభ్యులుగా ఉన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం ఈ రౌలట్ చట్టాన్ని 1919లో అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం వారెంట్ లేకుండా ఎవరినైనా, ఎంతకాలమైన నిర్భంధించడానికి (హెబియస్ కార్పస్‌కు వ్యతిరేకం), ఎవరి ఇళ్లయిన సోదాచేయడానికి, ఆస్తులను జప్తుచేయడానికి, నిందితులను ప్రత్యేక న్యాయస్థానాలలో విచారించడానికి అధికారం ఉంటుంది.
ఈ రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 14 ఫిబ్రవరి 1919న మహాత్మ గాంధీజీ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఈ చట్టాన్ని రూపుమాపడానికి మహాత్మ గాంధీజీ ఆర్య సమాజ సభ్యుడైన స్వామి శ్రద్దానంద భాగస్వామ్యంతో సత్యాగ్రహ సభ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించాడు. 1919 ఏప్రిల్ 6వ తేదీన గాంధీజీ నాయకత్వంలో బొంబాయిలో రౌలట్ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమైంది. 13 ఏప్రిల్ 1919న జరిగిన జలియన్‌వాలాబాగ్ హత్యాకాండ కారణంగా ఉద్యమం హింసకు దారతీస్తుందని 18 ఏప్రిల్ 1919న ఈ సత్యాగ్రహ దీక్షను నిలుపుదల చేశారు.
0 Comments