
అసలు ఈ బిల్లులో ఏముంది ?
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) - 2019
CAA : Citizenship Amendment Act | Gk in Telugu
సీఏఏ చట్టం ప్రధాన లక్ష్యం విదేశాల నుండి భారతదేశానికి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం. అయితే ఇందులో కొన్ని నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం. 31 డిసెంబర్ 2014 కన్న ముందు భారతదేశానికి శరణార్థులు వచ్చిన వారు ఈ చట్టం పరిధిలోకి వస్తారని సూచించింది. ఇందులో ముస్లీమేతరులైన హిందూవులు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌధ్దులు, పార్శిలకు పౌరసత్వం కల్పించనున్నారు. (ఇందులో ముస్లీంలకు చోటు కల్పించలేదు). ఈ చట్టం ప్రకారం ఇతర దేశాల నుండి మన దేశ పౌరసత్వం కోరేవారు గడిచిన 1 సంవత్సరం భారత్‌లో నివసించి ఉండాలి. గత 14 సంవత్సరాలలో కనీసం 5 సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి. (గత చట్టంలో భారత్‌లో 11 సంవత్సరాల పాటు ఉన్న శరణార్తులకు మాత్రమే ఈ చట్టం వర్తించేది). అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకు ఈ చట్టం నుండి మినహాయింపు ఉంటుంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘానిస్తాన్ దేశాల నుండి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ సీఏఏ చట్టం నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 31 డిసెంబర్ 2014 కంటే ముందు ఈ మూడు దేశాల నుండి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఏ భారతీయుడి పౌరసత్వాన్ని ఈ చట్టం కింద తొలగించరు. పైన పేర్కొన్న మూడు దేశాల్లో మతపరమైన అణచివేతకు గురవుతూ.. భారత్‌కు తప్ప వేరే ఏ దేశానికి వెళ్లే దిక్కులేని ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యం.
0 Comments