Ramakrishna Paramahamsa Biography in Telugu | రామకృష్ణ పరమహంస | Indian History in Telugu | Gk in Telugu

Ramakrishna Paramahamsa Biography in Telugu |   రామకృష్ణ పరమహంస

రామకృష్ణ పరమహంస

Ramakrishna Paramahamsa Biography in Telugu | Indian History in Telugu | Gk in Telugu 

 విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా విశ్వజాలానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి రామకృష్ణ పరమహంస. ఇతను పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని ‘‘కామర్భకూర్‌’’ అనే గ్రామంలో 18 ఫిబ్రవరి 1836న జన్మించాడు. ఇతని అసలు పేరు గదాధర్‌ చటోపాధ్యాయ / గంగాధర్‌ చటర్జీ. ఇతను విద్యావంతుడు కాదు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి చూపేవాడు. కొంతకాలానికి ఇతడు యోగిగా మారి రామకృష్ణ పరమహంసగా పేరుగాంచాడు. దక్షిణేశ్వరంలో గొప్ప యోగిగా ఖ్యాతి గడిరచాడు. రామకృష్ణుడు, కృష్ణుడు, అల్లా, క్రీస్తు అనేవి ఒకే దేవునికి  వివిధ రూపాలని భోదించాడు. ఇతడు కుల వ్యవస్థను, మత దురహాంకారాన్ని వ్యతిరేకించాడు. మానవులంతా ఒక్కటేనని, సత్‌ప్రవర్తన కల్గి ఉండాలని నొక్కి చెప్పాడు. రామకృష్ణుని భావాలను అతని ప్రియ శిష్యుడైన స్వామి వివేకానందుడు విశ్వవ్యాప్తం చేశాడు. ఇతను తోతాపురి అనే గురువు వద్ద శిష్యరికం చేసారు. ఇతనికి పరమహంస, దక్షిణేశ్వర సన్యాసి అనే బిరులున్నాయి. ఈయన కాళీమాత భక్తుడు. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో పూజారిగా పనిచేశాడు. 


Also Read :


Post a Comment

0 Comments