Swaraj Party : Indian History in Telugu | స్వరాజ్య పార్టీ | Gk in Telugu | General Knowledge in telugu

Swaraj Party : Indian History in Telugu | స్వరాజ్య పార్టీ  | Gk in Telugu

స్వరాజ్య పార్టీ 
Swaraj Party : Indian History in Telugu | History in Telugu  | Gk in Telugu

సహాయనిరాకరణ ఉద్యమం బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిష్క్రియాత్మక ప్రతిఘటన కానీ ఉద్యమం మరొక మలుపు తిరగగానే గాంధీజి అర్థాంతరంగా నిలిపివేయడం కొందరు నేతలకు అసంతృప్తి కల్గించింది. వారు ఎన్నికల్లో పాల్లొని శాసనసభల్లో ప్రవేశించి బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ప్రతిపాదించారు. శాసనసభలకు దూరంగా ఉంటే  ప్రజల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని దేశబంధు చిత్తరంజన్‌ దాస్‌ వాదించారు. 

కాంగ్రెస్‌లోని మార్పు కోరే పక్షంతో చిత్తరంజన్‌దాస్‌ అధ్యక్షుడుగా, మోతిలాల్‌ నెహ్రూ కార్యదర్శిగా, కేల్కర్‌, విఠల్‌బాయి పటేల్‌, లాలాలజపతిరాయ్‌, జయకర్‌ వంటి ప్రముఖులు సభ్యులుగా 1922 డిసెంబర్‌లో గయలో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సమావేశంలో చిత్తరంజన్‌దాస్‌ కాంగ్రెస్‌ ఖిలాపత్‌ స్వరాజ్‌ పార్టీని స్థాపించాడు.  1923 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్యపార్టీకి 101 స్థానాలకు 42 నియోజకవర్గ స్థానాలను దక్కించుకుంది. కేంద్రశాసన సభలో ప్రవేశించి బ్రిటిష్‌వారి ప్రతిపాదలను వ్యతిరేకించాలనుకున్నారు. 1925లో విఠల్‌బాయి పటేల్‌ స్వరాజ్‌ పార్టీ తరపున కేంద్ర శాసనసభలో అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. 

Also Read :


➺ 1923 ఎన్నికలు :

1919 రాజ్యాంగ చట్టం ద్వారా 1923 నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1923 సార్వత్రిక ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ 101 శాసనసభ స్థానాలకు గాను 42 స్థానాలకు కైవసం చేసుకుంది.  మోతీలాల్‌ నెహ్రూ కేంద్ర శాసనసభలో మొదటి భారతీయ ప్రతిపక్ష నాయకునిగా మరియు 1925 మార్చి విఠల్‌బాయి పటేల్‌ కేంద్ర శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

1923-24 మధ్యకాలంలో మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో చిత్తరంజన్‌ దాస్‌ కలకత్తా మేయర్‌గా, జవహర్‌లాల్‌ నెహ్రూ అలహాబాద్‌ ప్రావిన్స్‌ అధ్యక్షునిగా, బాబు రాజేంద్రప్రసాద్‌ పాట్నా మున్సిపాలిటీ అధ్యక్షునిగా, వల్లబాయ్‌పటేల్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ అధిపతి అయ్యారు.

తర్వాత 1926లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ మూడు భాగాలుగా విడిపోయి పోటీ చేసింది. 

  • పాత స్వరాజ్య పార్టీ 
  • ప్రతిస్పందనకారులు - జయకర్‌, కేల్కర్‌, మూంజి ఏర్పాటు చేశారు 
  • ఇండిపెండెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ - మదన్‌మోహన్‌ మాలవ్య 

ఈ ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ 40 స్థానాలను గెలుచుకుంది. 1925లో చిత్తరంజన్‌ దాస్‌ మరణంతో స్వరాజ్య పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది.  



Also Read :



Post a Comment

0 Comments