Non-Cooperation Movement Gk Questions in Telugu | Indian History Questions in Telugu | History Questions in Telugu

Non-Cooperation Movement Gk Questions in Telugu

సహాయ నిరాకరణ ఉద్యమం జీకే ప్రశ్నలు - జవాబులు

 Non-Cooperation Movement Gk Questions in Telugu with Answers | Indian History Gk Questions in Telugu | History Gk questions in Telugu 

☛ Question No.1
మహాత్మ గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటీ ?
ఎ) బ్రిటీష్‌ పాలన నుండి పూర్తి స్వాతంత్రం
బి) బ్రిటీష్‌ సామ్రాజ్యంలో పరిమిత స్వపరిపాలన
సి) ఆర్థిక సంస్కరణలు
డి) సామాజిక సమానత్వం ‌

జవాబు : ఎ) బ్రిటీష్‌ పాలన నుండి పూర్తి స్వాతంత్రం

☛ Question No.2
ఈ క్రిందివాటిలో సహాయ నిరాకరణ ఉద్యమంలో సమయంలో నిర్వహించని పద్దతి ఏది ?
ఎ) బ్రిటిష్‌ వస్తువులను బహిష్కరించడం
బి) శాసనమండలి నుండి భారతీయ సభ్యుల రాజీనామా
సి) పన్నులు చెల్లించడానికి నిరాకరించడం
డి) హింసాత్మక నిరసనలు

జవాబు : డి) హింసాత్మక నిరసనలు

☛ Question No.3
మహాత్మగాంధీ మరియు జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రముఖ నాయకులు ఎవరు ?
ఎ) భగత్‌సింగ్‌, రాజ్‌గురు
బి) సుభాష్‌ చంద్రబోస్‌, సర్దార్‌ వల్లబాయ్‌పటేల్‌
సి) మౌలానా ఆజాద్‌, అనిబిసెంట్‌
డి) రాజాగోపాలచారి, మోతీలాల్‌ నెహ్రూ

జవాబు : డి) రాజాగోపాలచారి, మోతీలాల్‌ నెహ్రూ

☛ Question No.4
ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తు సహాయ నిరాకరణ ఉద్యమంలో ఏ మతం పూర్తి సహాయం అందించింది ?
ఎ) హిందువులు
బి) ముస్లీం
సి) సిక్కులు
డి) క్రైస్తవుల

జవాబు : బి) ముస్లీం

☛ Question No.5
సహాయ నిరాకరణ ఉద్యమ ముగింపుకు కారణమైన చౌరి-చౌరా ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు ?
ఎ) మహారాష్ట్ర
బి) బీహార్‌
సి) ఉత్తరప్రదేశ్‌
డి) మధ్యప్రదేశ్‌

జవాబు : సి) ఉత్తరప్రదేశ్‌


Also Read :


☛ Question No.6
ఈ క్రిందవాటిలో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఈ ఉద్యమాన్ని నిర్మాణ మరియు బహిష్కరణ అనే రెండు రూపాల్లో విభజించి అవలంభించడం జరిగింది.
2) లాలాలజపతిరాయ్‌ ఆధ్యక్షతన 1920 సెప్టెంబర్‌లో జరిగిన కలకత్తా సమావేశంలో సహాయ నిరాయకరణ ఉద్యమం తీర్మాణం ధృవీకరించబడినది.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు

జవాబు : సి) 1 మరియు 2

☛ Question No.8
ఈ క్రిందివాటిలో సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు తెలుపని వారు ఎవరు ?
ఎ) చిత్తరంజన్‌ దాస్‌, సైపుద్దీన్‌ కిచ్లూ
బి) మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌ లాల్‌ నెహ్రూ
సి) రాజగోపాలచారి, రాజేంద్రప్రసాద్‌
డి) పురుషోత్తమ్‌దాస్‌, ఠాకూర్‌దాస్‌

జవాబు : డి) పురుషోత్తమ్‌దాస్‌, ఠాకూర్‌దాస్‌

☛ Question No.9
చౌరీ-చౌరా సంఘటనలో ఎంతమంది పోలీసులు సజీవ దహనం  అయ్యారు ?
ఎ) 34
బి) 22
సి) 26
డి) 18

జవాబు : బి) 22

☛ Question No.10
మహాత్మ గాంధీజీ ఏ రోజున సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు ?
ఎ) 12 ఫిబ్రవరి 1922
బి) 14 ఫిబ్రవరి 1922
సి) 16 ఫిబ్రవరి 1922
డి) 18 ఫిబ్రవరి 1922

జవాబు : ఎ) 12 ఫిబ్రవరి 1922

☛ Question No.11
ఈ క్రిందివాటిలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజి ఏకపక్షంగా నిలిపివేయడాన్ని వ్యతిరేకించిన వారిలో లేని వారు ఎవరు ?
ఎ) మోతీలాల్‌ నెహ్రూ
బి) సుభాష్‌ చంద్రబోస్‌
సి) జవహర్‌లాల్‌ నెహ్రూ
డి) రాజగోపాలచారి ‌

జవాబు : డి) రాజగోపాలచారి

☛ Question No.12
మహాత్మగాంధీని ఏ రోజున అరెస్టు చేశారు ?
ఎ) 12 మార్చి 1922
బి) 22 మార్చి 1922
సి) 10 మార్చి 1922
డి) 16 మార్చి 1922

జవాబు : సి) 10 మార్చి 1922 ‌

☛ Question No.13
సహాయ నిరాకరణ ఉద్యమానికి దేనిని చిహ్నంగా ఉపయోగించారు ?
ఎ) రాట్నం
బి) ఏనుగు
సి) సూర్యుడు
డి) చక్రం

జవాబు : ఎ) రాట్నం ‌

☛ Question No.14
రెండు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం గాంధీజీ ఏ రోజున విడుదలయ్యాడు ?
ఎ) 26 ఫిబ్రవరి 1924
బి) 15 ఫిబ్రవరి 1924
సి) 05 ఫిబ్రవరి 1924
డి) 03 ఫిబ్రవరి 1924

జవాబు : సి) 05 ఫిబ్రవరి 1924‌

☛ Question No.14
సహాయ నిరాకరణ ఉద్యమంలో బహిష్కరణ కార్యక్రమాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన పదవులను త్యజించడం
2) బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలు, న్యాయస్థానాలను రద్దు చేయడం
3) విదేశీ వస్తువుల్ని, వస్త్రాలను వదిలివేయడం
4) ఇంగ్లాండ్‌ యువరాజు భారత్‌ పర్యటనను బహిష్కరించడం
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 3 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 1 మరియు 2 మాత్రమే

జవాబు : సి) 1, 2, 3, 4‌


Also Read :



Post a Comment

0 Comments