
సౌర కుటుంబం (ఇండియా జీయోగ్రఫీ) జీకే ప్రశ్నలు - జవాబులు Part -2
Solar System Gk Questions in Telugu Part - 2
☛ Question No.1
భూమి ఉపరితలం నుండి లోపలికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది ?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) ఏ మార్పు ఉండదు
డి) ఎ మరియు బి
జవాబు : ఎ) పెరుగుతుంది
☛ Question No.2
భూమి లోపలికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత ప్రతి 32 మీటర్లకు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది ?
ఎ) 5 డిగ్రీల సెల్సియస్
బి) 3 డిగ్రీల సెల్సియస్
సి) 1 డిగ్రీల సెల్సియస్
డి) 2 డిగ్రీల సెల్సియస్
జవాబు : సి) 1 డిగ్రీల సెల్సియస్
☛ Question No.3
భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ?
ఎ) 2000 డిగ్రీల సెల్సియస్
బి) 3000 డిగ్రీల సెల్సియస్
సి) 4000 డిగ్రీల సెల్సియస్
డి) 6000 డిగ్రీల సెల్సియస్
జవాబు : డి) 6000 డిగ్రీల సెల్సియస్
☛ Question No.4
భూమిని ఎన్ని పొరలుగా విభజించారు ?
ఎ) భూపటలం
బి) భూప్రావారం
సి) భూకేంద్రమండలం
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.5
భూమి బయటి పొరను ఏమని పిలుస్తారు ?
ఎ) భూపటలం
బి) భూప్రావారం
సి) భూకేంద్రమండలం
డి) ఏదీకాదు
జవాబు : ఎ) భూపటలం
☛ Question No.6
భూమి లోపల 100 కి.మీ నుండి 2900 కి.మీ వరకు ఉన్న పొరను ఏమని పిలుస్తారు ?
ఎ) భూపటలం
బి) భూప్రావారం
సి) భూకేంద్రమండలం
డి) ఏదీకాదు
జవాబు : బి) భూప్రావారం
Also Read :
☛ Question No.7
భూమి లోపల 2900 కి.మీ నుండి 6376 కి.మీ వరకు ఉన్న పొరను ఏమని పిలుస్తారు ?
ఎ) భూపటలం
బి) భూప్రావారం
సి) భూకేంద్రమండలం
డి) ఏదీకాదు
జవాబు : సి) భూకేంద్రమండలం
☛ Question No.8
భూప్రావారంలో ఏ మూలకాలు ఉంటాయి ?
ఎ) ఆక్సిజన్, సిలికాన్
బి) సిలికా, మెగ్నీషియం
సి) నికెల్, ఫెర్రస్
డి) అల్యూమినియం, ఐరన్
జవాబు : బి) సిలికా, మెగ్నీషియం
☛ Question No.9
భూకేంద్ర మండలంలో ఏ మూలకాలు ఉంటాయి ?
ఎ) ఆక్సిజన్, సిలికాన్
బి) సిలికా, మెగ్నీషియం
సి) నికెల్, ఫెర్రస్
డి) అల్యూమినియం, ఐరన్
జవాబు : సి) నికెల్, ఫెర్రస్
☛ Question No.10
భూకేంద్ర మండలంలో సాంద్రత ఎంత ఉంటుంది ?
ఎ) 12 గ్రా / ఘ సెం.మీ
బి) 14 గ్రా / ఘ సెం.మీ
సి) 16 గ్రా / ఘ సెం.మీ
డి) 18 గ్రా / ఘ సెం.మీ
జవాబు : ఎ) 12 గ్రా / ఘ సెం.మీ
☛ Question No.11
భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది ?
ఎ) సిలికాన్
బి) ఆక్సిజన్
సి) అల్యూమినియం
డి) ఐరన్
జవాబు : బి) ఆక్సిజన్
☛ Question No.12
భూమి ఉపరితలం నుండి లోపలికి వెళ్లే కొద్ది ఏం జరుగుతుంది ?
ఎ) పీడనంతో పాటు సాంద్రత పెరుగుతుంది
బి) పీడనంతో పాటు సాంద్రత తగ్గుతుంది
సి) పీడనం, సాంద్రతలో మార్పు ఉండదు
డి) పీడనం పెరిగి సాంద్రత తగ్గుతుంది
జవాబు : ఎ) పీడనంతో పాటు సాంద్రత పెరుగుతుంది
0 Comments