
Regional Parties in India in Telugu | భారతదేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలు | Gk in Telugu
రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏయే అర్హతలుండాలి
గత చివరి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభలో ఉండే మొత్తం సీట్లలో కనీసం 3% సీట్లను లేదా 3 సీట్లను సాధించాలి
లేదా
గత చివరి లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి కేటాయించిన మొత్తం లోక్‌సభ సీట్లలో ప్రతి 25 సీట్లకు కనీసం ఒక అభ్యర్తి చొప్పున విజయం సాధించాలి
లేదా
రాష్ట్ర శాసనసభకు జరిగిన గత చివరి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుండి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రాష్ట్రంలో పోలైన చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లను సాధించాలి. దీంతో పాటుగా కనీసం ఇద్దరు అభ్యర్థులు శాసనసభకు ఎన్నిక కావాలి
లేదా
లోక్‌సభకు జరిగిన గత చివరి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుండి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రాష్ట్రలో పోలైన చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లను సాధించాలి. దీంతో పాటు కనీసం ఒక అభ్యర్థి లోక్‌సభకు ఎన్నిక కావాలి.
➺ జనతాదళ్ (సెక్యులర్) (జేడీ(ఎస్)) :
తలపై గడ్డిమోపు మోస్తున్న మహిళ ఎన్నికల గుర్తు కల్గిన ఈ పార్టీని 1999లో హెచ్.డి దేవెగౌడ స్థాపించారు.
➺ ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) :
1972లో శిబుసోరెన్ స్థాపించిన ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘విల్లు బాణం’. ఈ పార్టీ బీహార్, ఝార్ఖండ్‌లలో ప్రాచుర్యంలో ఉంది.
➺ ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) :
1986లో ఈ పార్టీని సుదేశ్ మహతో స్థాపించారు. దీని యొక్క ఎన్నికల గుర్తు ‘అరటిపండు’.
➺ ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) :
ఈ పార్టీని 1996లో దేవీలాల్ స్థాపించారు. దీని యొక్క ఎన్నికల గుర్తు ‘కళ్లజోడు’. ఇది హర్యానాలో ప్రాచుర్యంలో ఉంది.
➺ మహారాష్ట్ర సహనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) :
మహారాష్ట్రలో ప్రాచుర్యంలో ఉన్న ఈ పార్టీని రాజ్‌ఠాక్రే 2006లో స్థాపించారు. ఈ పార్టీ యొక్క గుర్తు ‘రైలు ఇంజిన్’.
➺ జమ్ము-కాశ్మిర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ) :
ఎన్నికల గుర్తు ‘నాగలి’ కల్గిన ఈ పార్టీని 1932లో షేక్ అబ్దుల్లా స్థాపించారు.
➺ జమ్ము`కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) :
1982లో భీంసింగ్ స్థాపించిన ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘సైకిల్’
➺ జమ్ము-కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ) :
‘సిరాబుడ్డి-కలం’ ఎన్నికల గుర్తు కల్గిన ఈ పార్టీని మహమ్మద్ సయిద్ 1998లో స్థాపించారు.
➺ బిజూ జనతాదళ్ (బీజేడీ) :
ఈ పార్టీని 1997లో నవీన్ పట్నాయక్ స్థాపించారు. ఈ పార్టీ ఒడిశా రాష్ట్రంలో అధిక ప్రాబల్యంలో ఉంది. ఈ పార్టీకి యొక్క ఎన్నికల గుర్తు ‘శంఖం’.
➺ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) :
గోవా రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఈ పార్టీని 1963లో దయానంద్ బందోద్కర్ స్థాపించారు. ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘సింహాం’.
➺ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) :
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రాబల్యంలో ఉన్న ఈ పార్టీని 1996లో అజిత్ సింగ్ ప్రారంభించారు. ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘చేతిపంపు’.
➺ సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) :
ఈ పార్టీని 1992లో ములాయం సింగ్ యాదవ్ స్థాపించారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’
➺ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) :
టిఆర్‌ఎస్ పార్టీని 27 ఏప్రిల్ 2001న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్థాపించారు. టిఆర్‌ఎస్ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘కారు’. ఇది ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీగా పేరు మార్చుకుంది.
➺ శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) :
ఈ పార్టీని 1920లో సర్దార్ షర్ముఖ్ సింగ్ చుబ్బల్ స్థాపించారు. ఎన్నికల గుర్తు ‘తూకం వేసే త్రాసు’.
➺ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) :
1993లో పవన్ కుమార్ చామ్లింగ్ స్థాపించారు. ఇది సిక్కింలో ప్రాబల్యంలో ఉంది. దీని యొక్క ఎన్నికల గుర్తు ‘గొడుగు’.
➺ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) :
ఈ పార్టీని 29 మార్చి 1982న నందమూరి తారక రామారావు స్థాపించారు. ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘సైకిల్’.
➺ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) :
ఈ పార్టీని 2011లో వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి స్థాపించారు. ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రాబల్యం ఉంది. ఈ పార్టీ యొక్క గుర్తు ‘సీలింగ్ ఫ్యాను’.
➺ లోక్‌జన్ శక్తి పార్టీ (ఎల్‌జేపీ) :
ఈ పార్టీని 2000వ సంవత్సరంలో రామ్‌విలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఇది బీహార్‌లో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘బంగ్లా’
➺ మిజోనేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) :
ఈ పార్టీని పులాల్‌డెంగా 1959లో స్థాపించారు. ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘నక్షత్రం’.
➺ మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ (ఎంపీసీ) :
ఈ పార్టీని 1975లో బ్రిగ్ తెన్‌పున్గా స్థాపించారు. మిజోరాం రాష్ట్రంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘ఎలక్ట్రిక్ బల్బు’
➺ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) :
ఈ పార్టీని 1977లో బకిన్‌పెర్టిన్ స్థాపించారు. ఈ పార్టీ అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రాబల్యంలో ఉంది. ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ‘మొక్కజొన్న కంకి’
➺ జనసేన పార్టీ (జేఎస్పీ) :
2014లో ఈ పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించారు. దీని యొక్క ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’
➺ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) :
ఈ పార్టీని 2005లో హంగ్రామా మొహిలరి స్థాపించారు. అస్సాంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘డోలు’
➺ యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) :
ఈ పార్టీని ఇ.కె మావ్‌లాంగ్ 1997లో స్థాపించారు. ‘డోలు’ ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు.
➺ సిక్కిం క్రాంతి కారి మోర్చా (ఎస్ కేఎం) :
ఈ పార్టీని 2013లో ప్రేమ్‌సింగ్ తమంగ్ స్థాపించారు. ‘టేబుల్ ల్యాంప్’ ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు
0 Comments