Telangana Polycet 2025 Online Apply, Exam Date, Notification | తెలంగాణ పాలిసెట్‌ 2025 | Telangana Admissions


Telangana Polycet 2025

Telangana Polycet  Notification Out  

తెలంగాణ పాలిసెట్‌

 తెలంగాణ స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌బీటీఈటీ) పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్‌ పాలిసెట్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ / ఎయిడెడ్‌ / ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలను కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు 19 ఏప్రిల్ 2025 లోగా ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.

➺ అర్హత :

  • మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి 
  • ప్రస్తుతం పరీక్షలు రాసేవారు ధరఖాస్తు చేసుకోవచ్చు 
  • అగ్రికల్చర్‌ /హార్టికల్చర్‌/వెటర్నరీ డిప్లొమాలో చేరాలంటే పాఠశాల స్థాయిలో కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. 

➺ ఉన్నత విద్యావకాశాలు :

  • ఈసెట్‌ ద్వారా యూనివర్సిటీ / ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు
  • ఎంసెట్‌ ద్వారా యూనివర్సిటీ / ప్రైవట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నేరుగా అడ్మిషన్‌లు కల్పిస్తారు 

➺ ధరఖాస్తు ఫీజు 

  • రూ॥500/- (జనరల్‌) 
  • రూ॥250/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు) 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది : 19 ఏప్రిల్‌ 2025 (Without Fine)
  • టీఎస్‌ పాలిసెట్‌ ఎగ్జామ్‌ : 13 మే 2025

Post a Comment

0 Comments