PM Rashtriya Bal Puraskar 2026 | ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్

gk in telugu
 PM Rashtriya Bal Puraskar - PMRBP
 

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP) 

ధైర్య సాహసాలు, అసాధారణ ప్రతిభ, క్రీడలు, కళలు, ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన చిన్నారులను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PM Rashtriya Bal Puraskar - PMRBP)తో సత్కరిస్తుంది. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డుల కోసం అర్హులైన బాలల నుంచి దరఖాస్తులు/నామినేషన్లు ఆహ్వానిస్తారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 – ముఖ్య వివరాలు

అంశం వివరాలు
పురస్కారం పేరు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PM Rashtriya Bal Puraskar - PMRBP)
నిర్వహించే శాఖ కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ
అర్హత వయస్సు 5 నుండి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు
పరిగణలోకి తీసుకునే కాలం గత రెండు సంవత్సరాల్లో సాధించిన విజయాలు
నామినేట్ చేసే వారు తల్లిదండ్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రముఖ వ్యక్తులు, సంస్థలు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా జాతీయ పురస్కారాల పోర్టల్‌లో
వ్యాసం చిన్నారి సాధించిన విజయాలు, ప్రభావం తదితర అంశాలపై సుమారు 1000 పదాల్లో వ్యాసం సమర్పించాలి.
అవార్డు ప్రకటన ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 (వీర్ బాల్ దివస్)
అవార్డు ప్రదానం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా

అవార్డు కేటగిరీలు

కేటగిరీ వివరాలు
ధైర్య సాహసాలు ప్రాణాలకు తెగించి ఇతరులను రక్షించడం లేదా అసాధారణ ధైర్యం ప్రదర్శించడం.
కళలు & సాహిత్యం సంగీతం, నృత్యం, పెయింటింగ్, రచనలు తదితర రంగాల్లో ప్రతిభ.
ఆవిష్కరణలు కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేసి విశేష ఫలితాలు సాధించడం.
క్రీడలు జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించడం.
పర్యావరణం & సమాజ సేవ ప్రకృతి సంరక్షణ, ప్రజల్లో అవగాహన, సమాజ శ్రేయస్సు కోసం విశేష సేవలు.

దరఖాస్తు విధానం

  1. జాతీయ పురస్కారాల పోర్టల్‌ను సందర్శించాలి.
  2. New Registration(click here) ఎంపికపై క్లిక్ చేయాలి.
  3. Individual లేదా Organization కేటగిరీని ఎంచుకోవాలి.
  4. పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసి అకౌంట్ సృష్టించాలి.
  5. చిన్నారి సాధించిన విజయాలు, ప్రభావం తదితర వివరాలను సుమారు 1000 పదాల్లో నమోదు చేయాలి.
  6. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి.

జతచేయాల్సిన పత్రాలు

క్రమ సంఖ్య పత్రం
1 జనన ధృవీకరణ పత్రం
2 ఆధార్ కార్డు
3 పాస్‌పోర్ట్ సైజు ఫోటో
4 స్టడీ సర్టిఫికేట్
5 పతకాలు, అవార్డుల వివరాలు
6 సర్టిఫికేట్‌లు
7 పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్‌లు

Post a Comment

0 Comments