govt jobs
డిగ్రీతో SBIలో స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలు | SBI Specialist Officer Recruitment 2026

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో స్పెషలిస్టు ఆఫీసర్ (Specialist Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో భాగంగా మేనేజర్ (సెక్యూరిటీ), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతో పాటు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ లేదా పారామిలిటరీ బలగాల్లో ఆఫీసర్‌గా అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI Recruitment 

వివరాలు సమాచారం
సంస్థ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
నోటిఫికేషన్ Specialist Officer Recruitment
పోస్టులు మేనేజర్, డిప్యూటీ మేనేజర్
విద్యార్హత డిగ్రీ
వయస్సు 25 నుంచి 40 సంవత్సరాలు
వయస్సు లెక్కింపు తేదీ 31 అక్టోబర్ 2026
దరఖాస్తు విధానం ఆన్‌లైన్

పోస్టుల వివరాలు

క్రమ సంఖ్య పోస్టు పేరు
1 మేనేజర్ (సెక్యూరిటీ) - Manager (Security)
2 డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) - Deputy Manager (Security)

విద్యార్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా కింది విభాగాల్లో ఏదైనా ఒకదానిలో ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.

  • ఇండియన్ ఆర్మీ (Indian Army)
  • ఇండియన్ నేవీ (Indian Navy)
  • ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force)
  • పారామిలిటరీ బలగాలు (Paramilitary Forces)

Last Date : 25-11-2026