
RAITHU BANDHU SCHEME IN TELUGU
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది రైతులు పంట పెట్టుబడి సాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఋణదాతలు, దళారుల వద్ద ఋణాలు తీసుకొని తిరిగి చెల్లించలేని దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. పంట పండిరచడానికి పెట్టుబడి లేక, పంట దిగుబడికి అవసరమయ్యే వస్తువుల కొనుగోలు డబ్బులు లేక, పంట ఉత్పాదకతను పెంచుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం లిఖిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆలోచనల్లోంచి పుట్టిన పథకం ‘‘రైతుబంధు పథకం’’.
తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు పంట పెట్టుబడి సాయం, పంట పెట్టుబడి మద్దతు పథకం రైతుబందు పథకం. ఎకరానికి 5000 రూపాయల చొప్పున రెండువిడతల్లో 10000 రూపాయల పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సహాయం అందించడం కోసం 10 మే 2018 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా రైతుబందు పథకం ప్రవేశపెట్టడం జరిగింది. సంవత్సరానికి 12 వేల కోట్ల వ్యయంతో 58 లక్షల రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి మరియు రైతులకు ఆదాయం వృద్ది చేసుకోడానికి మరియు రైతులు ఋణదాతలు, దళారులు వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టలేక ఋణభారంతో కుంగిపోతున్న రైతులకు చేయూత అందించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టిన బృహత్తర పథకం ‘‘రైతుబంధు పథకం’’. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశ్యంతో వ్యవసాయ పెట్టుబడి పథకం ‘‘రైతుబంధు’’ అనే కొత్త పథకం ప్రవేశపెట్టడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా ప్రతి రైతుకు వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, రవాణా చార్జీలు వంటి ఖర్చుల సాయం కొరకు ప్రతి సంవత్సరం రెండు విడతలుగా 5000 రూపాయల చొప్పున మొత్తం 10000 రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమచేయడం జరుగుతుంది. ఇట్టి ఫథకం ద్వారా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ప్రతి సంవత్సరం రైతుబంధు పథకం కోసం 12 వేల కోట్ల రూపాయలు బడ్డెట్‌లో కేటాయించడం జరుగుతుంది. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్భంగా నిలుస్తుంది.
రైతులను అప్పుల భారం నుంచి విముక్తం చేస్తూ, మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలకు పెట్టుబడి మద్దతు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా రూ. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు వంటి ఇన్‌పుట్‌ల కొనుగోలు కోసం ప్రతి సీజన్‌లో రైతుకు ఎకరాకు 5,000/- పంట సీజన్ కోసం అందిస్తుంది. ‘‘రైతుబంధు పథకం’’.ద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆర్థిక సహాయం పొందుతూ పంట ఉత్పాదకతను పెంచుకుంటూ ఆదాయాన్ని పొంపొందించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం రెండు విడతలుగా 5000 రూపాయల చొప్పుర నేరుగా రైతుల బ్యాంక్‌ఖాతాలలోనికి జమచేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 12 వేల కోట్ల రూపాయలు అందించడం జరుగుతుంది. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తు రైతుల కళ్లలో ఆనందాలను విరజిమ్మేలా చేస్తుంది ‘‘రైతుబంధు పథకం’’.
ఎవరు అర్హులు
- తెలంగాణ రాష్ట్ర రైతు అయి ఉండాలి
- వ్యవసాయ పట్టాదారు పాస్‌బుక్ కల్గి ఉండాలి
- ఎకరాల పరిమితి లేదు
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
ప్రారంభించిన వారు | శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు |
ఖర్చు | 12000 కోట్లు (ప్రతి యేటా) |
లబ్దిపొందే వారు | 58 లక్షల మంది |
దేని కొరకు | పంట పెట్టుబడి సహయం |
ఎన్ని విడతలు | రెండు విడతలు |
ఒక్కో విడతకు | 5000 రూపాయలు |
మొత్తం సంవత్సరానికి | 10000 రూపాయలు |
ఎవరు అర్హులు | తెలంగాణ రాష్ట్ర రైతులు |
0 Comments