కృష్ణనది || Krishna River in telugu || telangana geography in telugu

krishna river in telugu

 

కృష్ణ నది (Krishna River)

Krishna River information in telugu

ఈ కృష్ణనది పశ్చిమ కనుమల్లో  సహ్యద్రి పర్వతశ్రేణుల్లో మహరాష్ట్ర పతారా జిల్లా, జోర్‌ గ్రామం మహబలేశ్వరం వద్ద సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో  జన్మిస్తుంది. ఈ నది మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అనే 4 రాష్ట్రాల గుండా 1400  కిలోమీటర్లు ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణజిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది దేశంలో మూడవ అతిపెద్ద నదిగా పెరుగాంచింది. దక్షిణ భారతదేశంలో గోదావరి నది మొదటిది కాగా ఇది రెండవ స్థానంలో ఉంది. కృష్ణా నది 2,58,948(రెండు లక్షల యాబై ఎనిమిది వేల తొమ్మిది వందల నలబై ఎనిమిది) చ.కి.మీ నది పరివాహక ప్రాంతం కలదు. ఇది తెలంగాణ  రాష్ట్రంలో 416 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట్‌ జిల్లాలోని మక్తల్‌ మండలం, తంగడి గ్రామం వద్ద ప్రవేశించి నల్గోండ జిల్లాలోని వదినపల్లి గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలుస్తుంది. శ్రీశైలం నుండి పులిచింతల వరకు 290 కిలోమీటర్ల వరకు ఆంధ్రా,  తెలంగాణ రాష్ట్రాల మద్య సహజ సరిహద్దుగా  ప్రవహిస్తుంది. ఇది తెలంగాణలో నారాయణఖేడ్‌, జోగులాంబగద్వాల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నల్గోండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది.  
కృష్ణా నదికి కుడివైపు 1) ఘట ప్రభ 2) మలప్రభ 3) తుంగభద్ర, 4) కోయన 5) పంచగంగ 6) దూద్‌గంగాలు 7) హంద్రినివా అనే ఉపనదులు కలవు. 
కృష్ణానదికి ఎడమవైపు 1) భీమా 2) మూసి 3) మున్నేరు 4) దిండి 5) పాలేరు 6) హలియా 7) ఆలేరు 8) వైరా 9) వర్ణ 10) కాగ్నా 11) వైరా పెద్దవాగు అనే ఉపనదులు కలవు. 
➪ కృష్ణా నది ఉపనదులు :

1) భీమా నది 

కృష్ణా నది ఉపనదులలో ఇది పొడవైన  నది. ఇది 861 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీనికి కాగ్నా అనే ఉపనది కలదు. కాగ్నానది వికారాబాద్‌ అనంతగిరి లో జన్మించింది. ఇది మహరాష్ట్రంలోని పూణే జిల్లాలో సహ్యాద్రి పర్వతాల్లో భీమా శంకర్‌ గుట్టల్లో జన్మిస్తుంది. 

2) తుంగభద్రానది 

ఈ నది మొత్తం 531 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కృష్ణనది ఉపనదులలో అతిపెద్ద ఉపనది. ఇది 74,000 పరివాహక ప్రాంతం కల్గి ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగులూరు జిల్లాలో పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాలలో గంగమూల అనే ప్రాంతం వద్ద  తుంగ మరియు భద్ర అనే రెండు పాయలుగా జన్మిస్తుంది. ఈ నది తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ వద్ద గొన్దిమల్ల అనే గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనిని హంద్రినివా అనే ఉపనది కలదు. 

3) మూసీ నది 

ఈ నది రంగారెడ్డిలోని వికారాబాద్‌ ప్రాంతంలో అనంతగిరి గుట్టల్లో జన్మిస్తుంది. ఇది 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని ముచుకుందా నది అని కూడా అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దీనికి తెలుగు సాహిత్యంలో మూచ కుందన నదిగా పిలుస్తారు. ఈ నదిపై 1579 సంవత్సరంలో ఇబ్రహీం కులీ కుతుబ్‌షాహి హైద్రాబాద్‌ నగరంలో పురానాపూల్‌ బ్రిడ్జితో పాటు అనేక బ్రిడ్జిలు నిర్మించాడు. ఈ మూసీ నదిపై 1920 సంవత్సరంలో ఉస్మాన్‌ సాగర్‌, 1927లో దీని ఉపనది అయిన ఈసా నదిపై హిమాయత్‌ సాగర్‌ ను నిర్మించారు. దీనికి ఆలేరు అనే మరో ఉపనది కలదు.
    

4) దిండి నది / మీనాంబరం నది 

ఈ నది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షాబాద్‌ గుట్టల్లో మొహాలిగిద్ద అనే గ్రామం వద్ద జన్మిస్తుంది. ఇది నాగార్జున సాగర్‌ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఇది తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నదిపై 1943 సంవత్సరంలో దిండి ప్రాజేక్టు నిర్మించారు. ఈ ప్రాజేక్టు కల్వకుర్తి , దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు నీటిసరఫరా అందిస్తుంది. 

4) హాలియా నది 

ఈ నది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని నారాయణపూర్‌ సమీపంలో గల తూర్పు కనుమల్లో జన్మించి కొంగల్‌ అనే ఉపనదితో కలిసి అనంతరం కృష్ణ నదిలో కలుస్తుంది. 

5) పాలేరు / పల్లేరు నది 

ఈ నది తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలోని చిన్నపురం ప్రాంతం వద్ద  జన్మిస్తుంది. ఇది ఖమ్మం, నల్గొండ జిల్లాల మీదుగా 145 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రాలోని కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నది నాగార్జునసాగర్‌ ప్రాజేక్టులో ఎడమ కాలువ అయిన లాల్‌ బహదూర్‌ కాలువకు బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా పనిచేస్తుంది. 

6) మున్నేరు నది 

ఇది మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సంపేట వద్ద గల కృష్ణాపురం గ్రామం వద్ద జన్మించి 122 కిలోమీటర్లు 192 కి.మీ ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని జలపల్లి గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి కట్లేరు,  వైరా అనే ఉపనదులు  కలదు.  దీనిపై నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు కలదు. దీనిని నల్గొండ జిల్లాలోని పెద్దపుర మండలంలోని నందికొండ వద్దనిర్మించారు. ఇది ప్రపంచంలో పొడవైన మరియు ఎత్తైన రాతి ఆనకట్ట. ఇందులో రివర్సబుల్‌ టర్బైన్‌లు ఉపయోగించినారు. 

కృష్ణానదిపై నిర్మించిన ప్రాజేక్టుల వివరాలు 

➫ నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు :

ఈ ప్రాజేక్టును కృష్ణానదిపై నల్గొండ జిల్లా, పెద్దాపూర్‌ మండలం, నందికొండ గ్రామంలో నిర్మించారు. 1955 డిసెంబర్‌ 10 న అప్పటి ప్రధాని నెహ్రూగారు దీనికి శంకుస్థాపన చేసినారు. 1967 అగస్టు 4వ తేదిన అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించినారు. ఈ ప్రాజేక్టును ఖోస్లా కమిటీ నివేదిక ప్రకారం నిర్మించారు. ప్రపంచంలో అతిపెద్ద, అతిఎత్తయిన రాతికట్టడంతో కూడిన ప్రాజేక్టు. 1450 మీటర్లు పొడవు, 125 మీటర్ల ఎత్తు కల్గి ఉంది. మనదేశంలో ఈ ప్రాజేక్టుకు మొదట చీఫ్‌ ఇంజనీర్‌గా జాఫర్‌ ఆలీ వ్యవహరించారు. తర్వాత కెఎల్‌ రావు చీఫ్‌ ఇంజనీర్‌గా ఉండి దీని నిర్మాణం పూర్తి చేసినారు. ఇది ఒక బహుళార్థక సాధక ప్రాజేక్టు. (త్రాగు, సాగు నీరు అందించడంతో పాటు విద్యుత్పత్తి చేసే ప్రాజేక్టులను బహుళార్థక సాధక ప్రాజేక్టు అంటారు) ఈ డ్యాం యొక్క నిల్వ సామర్థ్యం 408 టిఎంసి, ఎఫ్‌ఆర్‌ఎల్‌ 590 అడుగులు ఉంటుంది. దీనికి రెండు కాలువలు ఉన్నాయి.  1) జవహర్‌ కాలువ ఇది 203 కిలోమీటర్ల పొడవుతో ఆంధ్రప్రదేశ్‌కు వెళుతుంది. ఇది దాదాపు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 2) లాల్‌బహదూర్‌ కాలువ. ఇది 295 కిలోమీటర్లు ఉంటుంది. ఇది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజేక్టు 816 వాట్ల విద్యుత్పత్తి చేస్తుంది.
 
➫ రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం :
ఇది కృష్ణానదిపై నారాయణపేట జిల్లా, మక్తల్‌మండలం, పంచదేవ్‌పాడులో నిర్మిస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. 

➫ ప్రియదర్శిని / జురాల ప్రాజేక్టు :

కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారిగి నిర్మించిన ప్రాజేక్టు  ప్రియదర్శిని ప్రాజేక్టు. ఈ ప్రాజేక్టు కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజేక్టు. ఇది జోగులాంబ గద్వాల్‌ జిల్లా, థరూర్‌ మండలం, రేవులపల్లి గ్రామంలో ఈ ప్రాజేక్టు నిర్మించారు. ఇది కూడా నాగార్జున సాగర్‌ తరహాలో రాతితో నిర్మించారు. ఈ ప్రాజేక్టుకు 86 బ్లాకులు కల్గి ఉండి దేశంలో అత్యధిక బ్లాకులు కల్గిన ప్రాజేక్టుగా పేరుగాంచింది. ఈ ప్రాజేక్టు నిల్వ సామర్థ్యం 17.84 టిఎంసిలు మాత్రమే ఉంటుంది. దీనికి ఎన్‌టిఆర్‌ కాలువ, నల్ల సోమనాద్రి కాలువలు ఉన్నాయి. ఇది దాదాపు 1 లక్షల 2200 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజేక్టు ద్వారా 234 మెగావాట్ల విద్యుత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ జురాల ప్రాజేక్టుపై ఆధారపడి భీమా, నెట్టెపాడు, కోయిల్‌సాగర్‌ అనే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి.
 

➫ డిరడి / విద్యాసాగర్‌ ఎత్తిపోతల ప్రాజేక్టు :

దీనిని నల్గోండ జిల్లాలో 30 టిఎంసినీ ఎత్తిపోయడం ద్వారా 3 లక్షల 41 వేల 500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దీనిని నిర్మిస్తున్నారు. 

➫ ఉస్మాన్‌సాగర్‌ ప్రాజేక్టు / గండిపేట ప్రాజేక్టు :

దీనిని 1908 సంవత్సరంలో మూసినది ద్వారా అపారవరదలు రావడం వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని అప్పటి నిజాం రాజు 1920 లో మూసి నదిపై రంగారెడ్డి జిల్లాలో ఉస్మాన్‌సాగర్‌ ప్రాజేక్టును నిర్మించారు. ఈ ప్రాజేక్టును వరదల నివారణకు, త్రాగునీటి అవసరాల కొరకు నిర్మించారు. దీని ఉపనది అయిన ఈసా నదిపై 1927 లో రంగారెడ్డి జిల్లాలో హిమయత్‌ సాగర్‌ జలాశయం నిర్మించారు. వీటిని మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవార్‌ ఆలీ నవాజ్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో  నిర్మించారు. మూసినది మరో ఉపనది అయిన కల్వలేరు నదిపై 1563 సంవత్సరంలో కులీకుతుబాషాహి ల కాలంలో హుస్సెన్‌సాగర్‌ అనే ప్రాజేక్టు నిర్మించారు. దీనిని ట్యాంక్‌బండ్‌, గణేష్‌సాగర్‌ అని కూడా పిలుస్తారు. దక్షిణభారతదేశంలో మొట్టమొదటి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌గా పేరుగాంచింది. మూసినదిపై నిర్మించిన మరో ప్రాజేక్టు ఆసిఫ్‌నహర్‌ ప్రాజేక్టు. 

➫ భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజేక్టు :

దీనిని ఖమ్మం జిల్లా తిరుమలరాయ పల్లెలో పల్లేరు నదిపై దీనిని నిర్మిస్తున్నారు. దీని ద్వారా దాదాపు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని 50 ఎకరాలకు సాగునీరు అందించడం దీని లక్ష్యం. 

➫ వైరా ప్రాజేక్టు :

దీనిని ఖమ్మం జిల్లాలోని వైరా ప్రాంతంలో నిర్మించారు. ఇది ఖమ్మం జిల్లాలోని 17385 ఎకరాలకు సాగు నీరు అందించడం లక్ష్యం పెట్టుకుంది. 

➫ రాజోలిబండ మళ్లింపు పథకం :

దీనిని కర్ణాటక రాష్ట్రం రాయ్‌చూర్‌ జిల్లాలో నిర్మించారు. ఇది తుంగభద్ర నది యొక్క నీటిని మళ్లించి కాలువ ద్వారా జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోకి నీటిని తీసుకువస్తుంది. ఇది తెలంగాణలోని జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని 75 గ్రామాలకు సాగు, త్రాగు నీరు అందిస్తుంది. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి ప్రాజేక్టు. 15.9 టిఎంసిల నీటిని వాడుకునే అవకాశం తెలంగాణకు ఉంది. 
కృష్ణానది పరివాహక ప్రాంతమైన నాగర్‌కర్నూల్‌ మరియు నల్గొండ జిల్లాలలో అమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రం కలదు. 

Post a Comment

0 Comments