TELANGANA DISTRICTS IN TELUGU
Gk in Telugu || General Knowledge in Telugu
తెలంగాణ జిల్లాలు

1969 లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఎంతోమంది మేదావులు, విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు మరియు ప్రజల భాగస్వామ్యంతో 2014 లో ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. భారతదేశం దక్షిణ ప్రాంతంలో 29వ రాష్ట్రంగా జూన్ 02, 2014 రోజున అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి 10 జిల్లాల కలయికతో హైద్రాబాద్ శాశ్వత రాజధానిగా స్వతంత్య్ర తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది.
1948లో భారతదేశంలోని డొమినియన్‌లో చేరినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం 8 జిల్లాలుగా ఉండేది. అవి హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలు. 1 అక్టోబర్ 1953న వరంగల్ జిల్లా విభజన ద్వారా ఖమ్మం జిల్లా ఏర్పడినది. 1 నవంబర్ 1956న హైదరాబాద్ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినది. మెరుగైన పరిపాలన కోసం భద్రాచలం డివిజన్ మరియు అశ్వారావుపేట తాలూకా భాగాలు గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లాలో విలీనం చేయబడ్డాయి. హైదరాబాద్ జిల్లా 15 ఆగస్ట్ 1978న హైదరాబాద్ అర్బన్ జిల్లా మరియు హైదరాబాద్ రూరల్ జిల్లాగా విభజించబడిరది. హైదరాబాద్ అర్బన్ జిల్లాను చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్ మరియు సికింద్రాబాద్ తాలూకాలు అనే 4 తాలూకాలు, వీటిలో ఎంసిహెచ్ ఏరియా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ రూరల్ జిల్లా తరువాత రంగారెడ్డి జిల్లాగా పేరు మార్చబడినది.
తెలంగాణ ప్రాంతం 02 జూన్ 2014 రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి 10 జిల్లాలతో కలిపి నూతన రాష్ట్రంగా ఏర్పాటు అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచడం జరిగింది. తర్వాత 17 ఫిబ్రవరి 2019 రోజున ములుగు, నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ప్రకటించి 33 జిల్లాలకు పెంచారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో విస్తీర్ణం పరంగా భద్రాద్రి కొత్తగూడెం అతిపెద్ద జిల్లా అతిచిన్న జిల్లాగా హైద్రాబాద్‌లు ఉన్నాయి. హైద్రాబాద్ జిల్లా అత్యధిక జనాభా కల్గిన జిల్లా. ములుగు అత్యల్ప జనాభా కల్గిన జిల్లా గా ఉంది. తెలంగాణ రాష్ట్రం 1,22,077 చ.కి.మీ విస్తీర్ణం కల్గి ఉండి 74 డివిజనల్‌లు, 141 పట్టణాలు, 13 కార్పోరేషన్లు, 129 మున్సిపాలిటీలు, 32 జిల్లా ప్రజాపరిషత్‌లు, 540 ప్రజాపరిషత్‌లు, 12769 గ్రామపంచాయితీలు, 594 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రం, పడమర కర్ణాటక రాష్ట్రం, దక్షిణం, తూర్పు దిక్కులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలు |
---|
1. రాజన్నసిరిసిల్ల |
2. అదిలాబాద్ |
3. భద్రాద్రి కొత్తగూడెం |
4. హైద్రాబాద్ |
5. జగిత్యాల |
6. జనగాం |
7. జయశంకర్ భూపాలపల్లి |
8. జోగులాంబ గద్వాల్ |
9.కామారెడ్డి |
10. కరీంనగర్ |
11. ఖమ్మం |
12. కొమురం భీమ్ |
13. మహబూబాబాద్ |
14. మహబూబ్నగర్ |
15. మంచిర్యాల |
16. మెదక్ |
17. మేడ్చల్ |
18. ములుగు |
19. నాగర్కర్నూల్ |
20. నిర్మల్ |
21. నిజామాబాద్ |
22. పెద్దపల్లి |
23. రంగారెడ్డి |
24. సంగారెడ్డి |
25. సిద్దిపేట |
26. సూర్యాపేట |
27. వికారాబాద్ |
28. వనపర్తి |
29. వరంగల్ (రూరల్) |
30. వరంగల్ అర్భన్ |
31. యాదాద్రి భువనగిరి |
32. నారాయణపేట |
33.నల్గోండ |
0 Comments