తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్టు | TS Model School Admission Test in Telugu

తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్టు

తెలంగాణ మోడల్‌ స్కూల్‌ నోటిఫికేషన్‌ 

ఆంగ్లమాద్యమంలో విద్యను భోదించే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌స్కూల్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024-2025 సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్‌ను మోడల్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6వ తరగతితో పాటు 7 నుండి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 200/- (జనరల్‌), 125/- (బిసి/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)  ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించి ధరఖాస్తులు చేసుకోవచ్చు.

మోడల్‌ స్కూళ్లలో 6 నుండి 10వ తరగతి వరకు ఆన్‌లైన్‌ ధరఖాస్తులను 12 జనవరి 2024 నుండి 22 ఫిబ్రవరి 2024 వరకు స్వీకరించనున్నారు. హాల్‌టికెట్లను 01 ఏప్రిల్‌ 2024 నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మోడల్‌స్కూల్‌ పరీక్షను 07 ఏప్రిల్‌ 2024 రోజున నిర్వహించనున్నారు. 

➺ ప్రవేశ పరీక్ష పేరు :

  • తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ 

➺ ఏయే తరగతులు

  • 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 

➺ అర్హత :

సంబందిత తరగతిలో ప్రవేశానికి కిందిస్థాయి తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

➺ పరీక్షా ఫీజు :

  • రూ॥200/- (జనరల్‌)
  • రూ॥125/- (బిసి/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ఈడబ్ల్యూఎస్‌)

Also Read :


➺ వయస్సు :

  • 6వ తరగతికి 10 సంవత్సరాలు 
  • 7వ తరగతికి 11 సంవత్సరాలు 
  • 8వ తరగతికి 12 సంవత్సరాలు 
  • 9వ తరగతికి 13 సంవత్సరాలు 
  • 10వ తరగతికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. 

➺ ఎంపిక విధానం :

  • మెరిట్‌ 
  • రిజర్వేషన్‌ 

➺ విద్యాబోధన :

  • ఇంగ్లీష్‌ మీడియంలో ఉచితంగా బోధిస్తారు. 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ధరఖాస్తులు ప్రారంభం - 12 జనవరి 2024
  • ధరఖాస్తులు ముగింపు - 22 ఫిబ్రవరి 2024
  • హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ - 01 ఏప్రిల్‌ 2024 వరకు 
  • పరీక్ష తేది - 07 ఏప్రిల్‌ 2024


Post a Comment

0 Comments