
మహత్మా జ్యోతిబాపూలే గురుకుల బ్యాక్‌లాగ్ ఎంట్రన్స్ టెస్టు
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల్లాలో మిగిలిన సీట్ల భర్తీ కోసం బ్యాక్‌లాగ్ ఎంట్రెన్స్ టెస్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎంట్రన్స్ టెస్టు ద్వారా బాలబాలికల పాఠశాలలో 6వ, 7వ, 8వ తరగతుల్లో ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్స్ పొందవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. యోగా, వ్యాయామం, క్రీడలు, ఆటపాటలకు ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు అందుబాటులో ఉంటాయి. విద్య, భోజనం, వసతి ఉచితంగా కల్పించడంతో పాటు కంప్యూటర్ విద్యను అందిస్తారు.
6వ తరగతిలో మొత్తం 2152 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
- మహబూబ్‌నగర్ - 100
- రంగారెడ్డి - 170
- హైదరాబాద్ - 225
- మెదక్ - 311
- నిజామాబాద్ - 356
- ఆదిలాబాద్ - 55
- కరీంనగర్ - 317
- వరంగల్ - 96
- ఖమ్మం - 390
- నల్లగొండ - 132
7వ తరగతిలో మొత్తం సీట్లు 976 ఖాళీగా ఉన్నాయి.
- మహబూబ్ నగర్ - 49
- రంగారెడ్డి - 97
- హైదరాబాద్ - 24
- మెదక్ - 167
- నిజామాబాద్ - 176
- ఆదిలాబాద్ - 28
- కరీంనగర్ - 120
- వరంగల్ - 46
- ఖమ్మం - 234
- నల్లగొండ - 35
Also Read :
8వ తరగతిలో మొత్తం 1095 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
- మహబూబ్‌నగర్ - 47
- రంగారెడ్డి - 104
- హైదరాబాద్ - 59
- మెదక్ - 154
- నిజామాబాద్ - 175
- ఆదిలాబాద్ - 73
- కరీంనగర్ - 138
- వరంగల్ - 47
- ఖమ్మం - 255
- నల్లగొండ - 43
➺ అర్హత
- 6వ తరగతిలో ప్రవేశానికి 5వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
- 7వ తరగతిలో ప్రవేశానికి 6వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
- 8వ తరగతిలో ప్రవేశానికి 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
- కుటుంబ వార్షికాదాయం 1 లక్ష 50 వేలు (గ్రామీణం) 2 లక్షలు (పట్టణాలు) ఉండాలి.
➺ వయస్సు
31 అగస్టు 2024 నాటికి
- 6వ తరగతి - 12 సంవత్సరాలు
- 7వ తరగతి - 13 సంవత్సరాలు
- 8వ తరగతి - 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
➺ ధరఖాస్తు రుసుము
- రూ॥100/-
➺ ప్రవేశ పరీక్ష విధానం
ఈ పరీక్షను అబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 2 గంటల్లో నిర్వహించే ఈ పరీక్ష 100 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఓఎంఆర్ షీట్ మీద సమాధానాలు గుర్తించాలి.
➺ ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది - 15 ఫిబ్రవరి 2024
- హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ - 26 ఫిబ్రవరి నుండి
- బ్యాక్‌లాగ్ ఎంట్రెన్స్ టెస్టు తేది - 03 మార్చి 2024
0 Comments