తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ - హైదరాబాద్) ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు ఉద్దేశించిన ‘కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్‌డబ్ల్యూఆర్ సీఓఈ సెట్) 2024 నోటిఫికేషన్ వెలువడినది. తెలుగుమీడియంలలో చదువుకున్నవారు కూడా ఈ టెస్టు రాయవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో అడ్మిషన్ పొందిన వారికి అకడమిక్ బోధనతో పాటు ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది. బాలురకు, బాలికలకు విడివిడిగా కళాశాలలు ఉన్నాయి. బోధన, భోజనం, వసతి ఉచితం. సెకండన లాంగ్వేజ్ తెలుగు మాత్రమే ఉంటుంది.
➺ సీట్ల వివరాలు :
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలల్లో మొత్తం 3680 సీట్లు ఉన్నాయి. బాలుర కళాశాలల్లో 1680 సీట్లు, బాలికల కళాశాలల్లో 2000 సీట్లు ఉన్నాయి.
➛ బాలుర కళాశాలలు - సీట్లు :
రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి కళాశాల
- ఎంపీసీ (120)
- బైపీసీ (120)
ఇబ్రహీంపట్నం కళాశాలలో
- ఎంఈసీ (40)
- సీఈసీ (40)
సంగారెడ్డి హత్నూర జేసీ కళాశాల
- ఎంపీసీ (80)
- బైపీసీ (80)
మిగిలిన కళాశాలలు
- ఎంపీసీ (40)
- బైపీసీ (40)
➛ బాలికల కళాశాలలు - సీట్లు :
రంగారెడ్డి, గౌలిదొడ్డి కళాశాల
- ఎంపీసీ (120)
- బైపీసీ (120)
- ఎంఈసీ (80)
ఖమ్మం,జేసీ కళాశాల
- ఎంపీసీ (80)
- బైపీసీ (80)
మేడ్చల్, కిస్టాపూర్ కళాశాల
- ఎంఈసీ (40)
- సీఈసీ (40)
➛ప్రీమియర్ కళాశాలలు :
- రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి, నార్సింగి (బాలికలు), చిల్కూరు (బాలురు)
- కరీంనగర్ జిల్లాలోని అలుగునూర్
- హైదరబాద్‌లోని మహేంద్ర హిల్స్ (బాలికలు), షేక్‌పేట్(బాలురు)
Also Read :
➺ పరీక్షా పద్దతి :
ఇందులో ఫస్ట్‌లెవెల్, సెకండ్ లెవెల్ టెస్ట్‌లు ఉంటాయి. ప్రశ్నపత్రాలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. ఒక్కో టెస్ట్ సమయం 3 గంటలు ఉంటుంది. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు నిర్ధేశించిన సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.
➺ అర్హత :
- ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు
- మొదటి అటెంప్ట్‌లోనే పదోతరగతి పాసవ్వాలి
- 31 అగస్టు 2024 17 ఏళ్ల లోపు ఉండాలి.
- రిజిర్వేషన్‌లను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
- వార్షికాదాయం 1 లక్ష 50 వేలు గ్రామీణ ప్రాంతాల్లో, 2 లక్షలు పట్టణాలు ఉండాలి
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥200/-
➺ ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తులకు చివరి తేది: 15 జనవరి 2024
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ : 25 జనవరి నుండి 03 ఫిబ్రవరి 2024 వరకు
- పరీక్ష తేది : 04 ఫిబ్రవరి 2024
- ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులకు సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ తేది : 25 ఫిబ్రవరి 2024
0 Comments