
కరెన్సీ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు !
భారతదేశంలో మొట్టమొదటి సారిగా షేర్షా అనే రాజు 1542 సంవత్సరంలో రూపియా అనే పేరుతో వెండి నాణాన్ని రూపొందించాడు. 1834 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం రూపీ అనే పేరుతో కరెన్సీని అమలులోకి తీసుకొని వచ్చింది. 1861 నుండి ఈ రూపీ కరెన్సీ ప్రామాణిక కరెన్సీగా అమలులోకి వచ్చింది. 1953 వరకు బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ రాణి ముద్రణ గల కాగితపు నోట్లు చలామణిలో ఉండేవి. 1953 నుండి ఇండియా పార్లమెంట్, అశోకచక్రం ముద్రణ గల కాగిత నోట్లు చలామణిలోకి వచ్చాయి. 1996 నుండి మహాత్మాగాంధీ సిరిస్ పేరుతో గాంధీ ముద్రణ గల నోట్లను ప్రవేశపెట్టారు. తమిళనాడుకు చెందిన డి.ఉదయ్‌కుమార్ అనే వ్యక్తి 2010 సంవత్సరంలో భారత కరెన్సీ రూపాయిని ప్రతిబింబించే గుర్తును రూపొందించాడు. భారత కరెన్సీ ప్రతి నోటుపై ఆ నోటు ఎంత విలువైందో 15 భారతీయ భాషల్లో ముద్రితమై ఉంటుంది. 08 నవంబర్ 2016 రోజున భారత ప్రభుత్వం 500 మరియు 1000 నోట్లను రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన నోట్లకు బదులుగా రూ॥500 మరియు రూ॥2000 నోట్లను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇతర దేశాల కరెన్సీలతో రూపాయి విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించడాన్ని డీ-వాల్యూవేషన్ అంటారు. భారత స్వాతంత్రనంతరం భారత ప్రభుత్వం 1949, 1966, 1991, 1991 నాలుగు సార్లు తగ్గించింది.
కరెన్సీ, నాణేలు ముద్రణా కేంద్రాలు
➠ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్ (మహారాష్ట్ర)
ఇక్కడ తపాలాశాఖ సామాగ్రి, రెవెన్యూ స్టాంపులు, చెక్కులు, ఇందిరా వికాస పత్రాలు మొదలైనవి ముద్రిస్తారు.
Also Read :
➠ కరెన్సీ నోట్స్ ప్రెస్ - నాసిక్ (మహారాష్ట్ర)
ఇక్కడ రూ।1, రూ॥2, రూ॥5, రూ॥50, రూ॥100 రూపాయల నోట్లను ముద్రిస్తారు.
➠ బ్యాంక్ నోట్స్ ప్రెస్ (దివాస్ - మధ్యప్రదేశ్)
ఇక్కడ రూ॥20, రూ॥50, రూ॥100, రూ॥500, రూ॥100 రూపాయల నోట్లను ముద్రిస్తారు.
➠ ఆర్‌బిఐ నోట్ ముద్రణాలయ లిమిటెడ్
2 అధునాతన కరెన్సీ నోట్ల ప్రెస్‌లను మైసూర్ (కర్ణాటక), సాల్బాని (ప॥బెంగాల్) లో ఏర్పాటు చేశారు.
➠ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (హైదరాబాద్)
దక్షిణ రాష్ట్రాలకు అవసరమయ్యే పోస్టల్ స్టాంపులు, రెవెన్యూ స్టాంపులు మొదలగు సామాగ్రిని ఇక్కడ ముద్రిస్తారు.
➠ సెక్యూరిటీ పేపర్ మిల్స్ - హోషంగాబాద్ (మధ్యప్రదేశ్)
మధ్యప్రదేశ్‌లో ఈ ప్రెస్ 1967`68 లో ఏర్పాటు చేశారు. ఇది కరెన్సీ నోట్లకు వాడే కాగితాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం నోట్ల ముద్రణకు అవసరమయ్యే కాగితం జర్మనీ నుండి దిగుమతి అవుతుంది.
➠ దివాస్ ఇంక్ ఫ్యాక్టరీ - దివాస్ (మధ్యప్రదేశ్)
కరెన్సీ నోట్లకు అవసరమైన ఇంకున్న ఇక్కడ ఉత్పిత్తి చేస్తారు.
➠ టంకశాలలు (మింట్స్)
కేంద్ర ఆర్థిక శాఖ ఆదీనంలో నాణాలు ముంద్రించే టంకశాలలు ముంబాయి, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలలో కలవు.
0 Comments