
కాకతీయుల సామ్రాజ్యం - శాసనాలు
Telangana History in Telugu | History in Telugu | Gk in Telugu | General Knowledge in Telugu
➺ మాగల్లు శాసనం :
మాగల్లు శాసనాన్ని తూర్పు చాళుక్య రాజు క్రీ.శ 956 సంవత్సరంలో లిఖించాడు. ఈ శాసనంలో కాకత్యగుండ్యన యజమాని అయినటువంటి దానార్జవుడు అయిన ఒక బ్రాహ్మణునికి మాగల్లు గ్రామాన్ని దానం చేసిన విషయంను ప్రస్తావించడం జరిగింది.
➺ హనుమకొండ శాసనం :
హనుమకొండ శాసనాన్ని క్రీ.శ.1063 సంవత్సరంలో రుద్రదేవుని మంత్రి అయినటువంటి అచితేంద్రుడు చెక్కించాడు. ఈ హనుమకొండ శాసనంలో 1063 సంవత్సరంలో రుద్రదేవుడు సొంతంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న విషయాన్ని తెలియజేస్తుంది.
➺ ద్రాక్షారామం శాసనం :
ఈ శాసనాన్ని రెండవ ప్రోలరాజు మంత్రి క్రీ.శే.1158లో లిఖించాడు. ఈ శాసనంలో రెండో ప్రోలరాజు తర్వాత అతని కుమారుడు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.
➺ బయ్యారం శాసనం :
బయ్యారం శాసనాన్ని గణపతిదేవుని సోదరి అయిన కాకతి మైలాంబ క్రీ.శ.1219లో చెక్కించింది. ఈ శాసనంలో రాష్ట్రకుటులకు సామంతులని, కాకతీపురంను పరిపాలించడం వల్ల కాకతీయులు అని పేరు వచ్చిందని తెలిపింది.
➺ మోటుపల్లి అభయ శాసనం :
ఈ శాసనాన్ని గణపతి దేవుడు క్రీ.శ.1244 సంవత్సరంలో లిఖించాడు. ఈ మోటుపల్లి శాసనంలో విదేశీ వర్తకులకు విధించే సుంకాల వివరాలు, వ్యాపారులకు కల్పించే రక్షణ గురించి వివరించారు.
Also Read :
➺ చందుపట్ల శాసనం :
చందుపట్ల శాసనాన్ని రుద్రమదేవి బంటుగా పనిచేసిన పువ్వుల ముమ్మడి క్రీ.శ. 1289 సంవత్సరంలో లిఖించింది. ఈ చందుపట్ల శాసనంలో రాణి రుద్రమదేవి అంబదేవుని తిరుగుబాటును అణచివేసే ప్రయత్నంలో వీరమరణం పొందిందని తెలియజేస్తుంది.
➺ త్రిపురాంతక శాసనం :
ఈ శాసనాన్నిఇ క్రీ.శ.1291 సంవత్సరంలో అంబదేవుడు వేయించాడు. ఈ త్రిపురాంతక శాసనంలో అంబదేవుని రాజు యొక్క విజయాలను పొందుపరచడం జరిగింది.
➺ సలకవీడు శాసనం :
దీనిని రెండో ప్రతాపరుద్రుడు క్రీ.శే.1317లో లిఖించారు. ఈ సలకవీడు శాసనంలో పాండ్యుల మీద విజయానికి సూచికగా రాజుగారి ఆదేశం ప్రకారం దేవేరి నాయకుడు ఏరువ భూమిలోని సలకవీడు గ్రామాన్ని కావేరి శ్రీ రంగనాథ స్వామికి దానం చేసిన విషయాలు తెలియజేస్తుంది.
➺ మల్కాపురం శాసనం :
ఈ శాసనం విశ్వేశ్వర శివచార్యుని పుణ్యకార్యాల గురించి మరియు కాకతీయుల కాలంనాటి నాట్య రీతుల గురించి తెలియజేస్తుంది. దీనిని క్రీ.శ.1261లో రుద్రమదేవి వేయించింది.
➺ కొలనుపల్లి శాసనం :
ఈ శాసనంలో చెన్నకేశవస్వామికి, నరసింహస్వామి ఆలయానికి దానాలు చేసినట్లు తెలియజేస్తుంది.
Related Posts :
0 Comments