History of Kakatiya Dynasty in telugu || Tspsc Telangana History in telugu || కాకతీయుల సామ్రాజ్యం || Gk in Telugu

History of Kakatiya Dynasty in telugu || Telangana History in telugu ||

Tspsc Telangana History in Telugu

Kakatiya Dynasty in Telugu- Its Administration, Economy And Culture

Gk in Telugu || General Knowledge in Telugu


కాకతీయుల సామ్రాజ్యం 

Tspsc Telangana History : శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాలన్నింటిని ఏకం చేసి పరిపాలించిన సామ్రాజ్యం కాకతీయ రాజవంశం. కాకతీయులు అంటే గుమ్మడి పండు, కుష్మాండం అనే అర్థాలు ఉన్నాయి. వీరు కాకతీ అనే జైన దేవతను ఆరాధించేవారు. తర్వాతి కాలంలో ఈ దేవతను దుర్గాదేవిగా కొలిచేవారు. అందుకే వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని బయ్యారం శాసనం ద్వారా తెలుస్తుంది. బయ్యారం చెరువు శాసనం గణపతిదేవుణి చెల్లెలు మైలాంబ వేయించింది. ఈ శాసనం కాకతీయుల మూల పురుషుడు వెన్నభూపతి అని చెబుతుంది. అంతేకాకుండా కాకతీయులు దుర్జయులని, వెన్నభూపతి కాకతీపురం నుండి రాజ్యం చేయడం వల్ల కాకతీయులయ్యారని చెబుతుంది. కాకతీయ సామ్రాజ్యానికి మూలపురుషుడు వెన్నభూపతి రాజు. ఈ విషయం ‘‘బయ్యారం’’ శాసనం ద్వారా తెలుస్తుంది. కాకతీయ వంశస్థాపకుడు కాకర్త్య గుండెన రాజు అని ధానర్ణవుడు వేయించిన ‘‘మగల్లు’’ (కృష్ణజిల్లా) శాసనం ద్వారా తెలుస్తుంది. కాకతీయ సామ్రాజ్య రాజ్య స్థాపకుడు మొదటి బేతరాజు పేరుగాంచాడు.  కాకతీయ సామ్రాజ్యానికి స్వతంత్య్ర రాజ్య స్థాపకుడు మొదటి రుద్రదేవుడు పేరుగాంచారు. కాకతీయులలో గొప్ప రాజు గణపతిదేవుడు. గణపతిదేవుడు యొక్క తండ్రి మహదేవుడు. మహదేవుడు సోదరుడు రుద్రదేవుడు. కాకతీయుల రాజ్యంలో గణపతిదేవుడు ఎక్కువ కాలం (63 సంవత్సరాలు) పరిపాలించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో మొదటి మహిళా పాలకురాలు రాణి రుద్రమదేవి. కాకతీయుల రాజ్యంలో చివరి రాజు రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు, రాష్ట్రకుటుల యొక్క సామంతులుగా పనిచేసినారు. తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేయడం జరిగింది. తొలి కాకతీయు పుట్టుపూర్వోత్తరాల గురించి మాంగల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. వీరి కాలం చెరువుల కాలంగా పేరుగాంచింది. కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తానులు 5 సార్లు దండేత్తి నేలమట్టం చేయడం జరిగింది. రాజు అంగరక్షక దళాన్ని ‘‘లెంకలు’’ అని పిలిచేవారు. 

➠ కాకతీయుల రాజధానులు :-

వీరు హన్మకొండ, ఓరుగల్లు / ఆంధ్రనగరి / సుల్తాన్‌పూర్‌ (తమిళ భాషలోని ఓరుకల్‌ పదం నుండి వచ్చింది. ఓరుకల్‌ అంటే ఏకశిల అంటారు.) ను రాజధానులుగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. 

మూడు వందల సంవత్సరాలకు పైగా తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన వారు కాకతీయులు, వీరిది సాంప్రదాయ వంశపారంపర్య రాజరీక వంశం. కాకతీయుల పరిపాలన వ్యవస్థ గురించి రుద్రదేవుడు రాసిన నీతిసారం, బద్దెన వ్రాసిన నీతిసారముక్తావళి, శివదేవయ్య వ్రాసిన పురుషార్థసారం అనే గ్రంథాల ద్వారా తెలుస్తుంది. 


Kakatiya Dynasty|List of Kakatiya Rulers and their contributions

➠ మొదటి బేతరాజు :-

కాకతీయ రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు. ఇతను కాకర్త్యగుండ్యన యొక్క కుమారుడు. కాకర్తగుండ్యన యొక్క సోదరి వెరియాల కామసాని సహకారంతో మొదటి  బేతరాజుల రాజ్యాన్ని ఏర్పాటు చేశారని గూడురు శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. ఇతని రాజ్యాన్ని కొరవిసీమ నుండి శనిగరం వరకు విస్తరించింది. 

(కొరవిసీమ - ఖమ్మం, సచ్చినాడు,శనిగరం - కరీంనగర్‌, పొలవాస - జగిత్యాల) బేతరాజు యొక్క మంత్రి నారాయణయ్య శనిగరం శిలాశాసనం వేయించడం జరిగింది. ఈ 'శనిగరం' శిలాశాసనంలో బేతరాజు యొక్క ప్రస్తావన ఉంది. ఇతనికి కాకతీపురాధినాథ, చోడక్ష్మపాల అనే బిరుదులు కలవు. మొదటి బేతరాజు యొక్క కుమారుడు మొదటి ప్రోలరాజు.

➠ మొదటి ప్రోలరాజు :-

కళ్యాణి చాళుక్య రాజు అయిన మొదటి సోమేశ్వరుడికి సామంత పాలకుడిగా పనిచేశాడు. మొదటి సోమేశ్వరుడి విజయాలలో మొదటి ప్రోలరాజు ప్రముఖ పాత్ర పోషించాడు. ఇతని విజయాలను మెచ్చిన సోమేశ్వరుడు హన్మకొండ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ‘‘సమద్విసత పంచమశబ్ద ’’ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇతనికి "అరిగజకేసరి", "కాకతీవల్లభ" అనే బిరుదులున్నాయి. ఇతని కాలంలో కాకతీయుల తొలి రాజధానిగా హన్మకొండ మారింది. ఇతని యొక్క గురువు రామేశ్వరుని సేవలకు మెచ్చి వైజనపల్లి గ్రామాన్ని కానుకగా ఇచ్చాడు.  ఇతని కాలంలో కేసరి సముద్రం నిర్మించాడని ‘‘పిల్లలమరి శాసనం ’’ ద్వారా తెలుస్తుంది. ఇతను మొదటిసారి స్వతంత్రంగా నాణాలను ముద్రించి వాటిపై కళ్యాణి చాళుక్యుల అధికార చిహ్నం అయిన వరాహంను ముద్రించాడు.

Tspsc Telangana History :

➠ రెండో బేతరాజు :-

మొదటి ప్రోలరాజు కుమారుడు రెండో బేతరాజు. ఇతని గురించి "ఖాజీపేట" శిలాశాసనం లిఖించడం జరిగింది. ఇతని గురువు రామేశ్వర పండితునికి శివపురం అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. ఈ శివపురంలో బేతేశ్వరాలయం నిర్మించాడు రెండో బేతరాజు. ఇతని మంత్రి వైజదండనాయుడు. ఇతనికి చలమార్తిగండ, త్రిభువనమల్ల, మహమండలేశ అనే బిరుదులు కలవు. రెండో బేతరాజు యొక్క కుమారుడు దుర్గరాజు. 

➠ దుర్గరాజు :-

రెండో బేతరాజు యొక్క కుమారుడు దుర్గరాజు. తన తండ్రి రెండోబేతరాజు నిర్మించిన బేతేశ్వరాలయాన్ని మెరుగుపరిచి తన గురువు అయిన రామేశ్వర పండితునికి ఇవ్వడం జరిగింది. 

➠ రెండో ప్రోలరాజు ;-

ఇతను తొలికాకతీయులలో గొప్పరాజు. ఇతని రాజ్యం పొలవాస (జగిత్యాల) నుండి శ్రీశైలం వరకు విస్తరించింది. ఇతని విజయాల గురించి ఇతని కుమారుడు మొదటి రుద్రదేవుడు వేసిన "హన్మకొండ" శిలాశాసనంలో లిఖించడం జరిగింది. ఇతని యొక్క మంత్రి బేతనమాత్యుని భార్య మైలమ జైనసన్యాసుల కోసం కొడలాలయ బసిది నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇతని కాలంలో సిద్దేశ్వరాలయం, స్వయంబు ఆలయం,  పద్మాక్షి (దీనిని ఇండో ఇస్లామిక్‌ శైలిలో నిర్మించారు), ఆలయాలు నిర్మించడం జరిగింది. ఇతను వెలనాటి రాజేంద్రుని చేతిలో మరణించడం జరిగింది. ఈ విషయం "ద్రాక్షారామం" శాసనం ద్వారా తెలుస్తుంది. 

➠ రుద్రదేవుడు / మొదటి ప్రతాపరుద్రుడు (1157 - 1195) :

ఇతనిని కాకతిరుద్రుడు అని కూడా అంటారు. క్రీ.శ 1162 లో రుద్రదేవుడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నట్లు "హన్మకొండ" శాసనం ద్వారా తెలుస్తుంది. ఇతను హన్మకొండ(అచితేంద్రుడు లిఖించాడు), గణపవరం అనే శాసనాలు వేయించాడు. ఇతని ప్రతిభాపాటవాల గురించి అనుమకొండ శాసనంలో చర్చించడం జరిగింది. ఇతను రుద్రసముద్రతటాకం అనే చెరువుతో పాటు రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడి నిర్మించడం జరిగింది. అన్నలదేవి చెక్కించిన ద్రాక్షరామ శిలాశాసనంలో రుద్రదేవుడు "వినయభూషుణుడు," 'విద్యాభూషణుడు' అని పేర్కొనడం జరిగింది. హేమాద్రి అనే కవి వ్రాసిన వ్రతఖండం గ్రంథంలో యాదవ రాజు జైతూగి చేతిలో ఇతను మరణించినట్లు తెలపడం జరిగింది. ఇతను కాకతీయుల రాజధానిని పాక్షికంగా హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చి పరిపాలన కొనసాగించాడు.  ఇతను సంస్కృత భాషలో ‘‘ నీతిసారం ’’ అనే రచన రచించడం జరిగింది. ఇతని మంత్రిగా పనిచేసిన గంగాధరడు ప్రసన్నకేశవ ఆలయాన్ని నిర్మించాడు. ఇతని మరణం తర్వాత ఇతని సోదరుడు అయిన మహాదేవుడు రాజ్యపరిపాలన చేసినాడు. ఇతను యాదవరాజు జైతూగి చేతిలో మరణించడం జరిగింది. 

➙ విజయాలు 

వర్దమానపురం యుద్దంలో నగునూరు రాజు దొమ్మరాజు, పొలూస రాజు దేవరాజును ఓడించడం జరిగింది. కందూరు చోళులు రాజు చోడుదయుడుని ఓడించి ఆయన కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్నాడు. పానగల్లులో ఉదయసముద్రం తటాకం నిర్మించడం జరిగింది. ఇతను త్రిపురాంతకం, శ్రీశైలం, ధరణికోట వరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని కాలంలో పలనాటి యుద్దం జరిగింది. ఈ యుద్దానికి మొదటి రుద్రదేవుడు మద్దతు తెలపడం జరిగింది. 

➙ వేయిస్తాంబాల గుడి 

ఇది త్రికూట ఆలయం. ఇందులో సూర్యుడు, విష్ణువు, మహేశ్వరుడు అనే దేవుళ్లుంటారు. ఇందులో ప్రధాన దేవుడు మహేశ్వరుడు. 

➠ మహదేవుడు :-

మహదేవునికి మైలాంబ, కందమాంబ, గణపతిదేవుడు అనే ముగ్గురు పిల్లలున్నారు. "మైలాంబ" బయ్యారం శిలా శాసనం వేయించడం జరిగింది. బయ్యారం శిలాశాసనంలో కాకతీయుల వంశవృక్షం గురించి తెలియజేస్తుంది. 

➠ గణపతి దేవుడు (1199 - 1262) :-

గణపతిదేవుడు తన తండ్రి మహదేవుడు తర్వాత సింహాసనాన్ని అధిష్టించి రాజ్యపరిపాలన చేసినాడు. ఇతను కాకతీయ రాజ్యాన్ని దాదాపు 60 సంవత్సరాల పాటు పరిపాలించి కాకతీయ సామ్రాజ్య రాజులందరిలో గణపతిదేవుడు గొప్ప రాజుగా  కీర్తి ప్రతిష్టలు సాధించాడు.  ఇతను కాకతీయ రాజ్యాన్ని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చి పరిపాలన కొనసాగించాడు. ఇతను తన తండ్రి అయిన మహదేవుడు దేవగిరి యాదవ రాజైన జైతుగిగి మీదికి దండేత్తి వెళ్లి ఆ యుద్దంలో వీర మరణం పొందడం జరిగింది. ఆ సమయంలో గణపతిదేవుడిని జైతుగి బంధీగా చేసుకున్నాడు. గణపతిదేవుడు బంధీగా ఉన్న సమయంలో అతని సేనాని అయిన రాచర్లరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని సామాంతులు చేజిక్కించుకోకుండా కాపాడాడు. అందువల్ల రాచర్లరుద్రునికి  ‘‘కాకతీయ భారదౌరేయుడు’’ అనే బిరుదు వచ్చింది. గణపతిదేవుడు బంధీగా ఉండడంతో కాకతీయ రాజ్యాన్ని ఓయసాల రాజులు దండేత్తడానికి సిద్దంగా ఉన్నారు. ఓయసాలులు కాకతీయ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని యాదవులపై దాడి చేస్తారని భావించిన జైతుగి కుమారుడైన ‘‘ సింఘన ’’  గణపతిదేవుడిని విడుదల చేయడం జరిగింది. అందువల్ల సింఘనకు ‘‘ తెలుగు రాయ స్థాపనచార్య ’’ అనే బిరుదు వచ్చింది.

Tspsc Telangana History :

➙ విజయాలు 

గణపతిదేవుడు దివిసిమపై దాడి చేసి దానిని పరిపాలిస్తున్న పినచోడుడు ఓడించి దివిసిమను జయించాడు. ఈ యుద్దానికి మల్యాల చాముండరాయుడు తన ప్రతిభాపాటవాలతో యుద్దంలో గెలిచేలా చేశాడు. అందువల్ల మల్యాల చాముండరాయుడుని ‘‘ద్విపలుంటాక, దివిచూరకార’’ అనే బిరుదులు వచ్చాయి.  

యుద్దంలో ఓడిపోయిన పినచోడుడు తన ఇద్దరు కుమార్తెలు అయిన నారంబ, పేరాంబలను గణపతిదేవునికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. నారంబకు కూతురు గుణపాంబ, పేరాంబకు కూతురు రుద్రాంబ(రుద్రమదేవి)లు ఉన్నారు. పినచోడుడు కుమారుడు జేయపసేనాని గణపతిదేవుని ఆస్థానంలో గజసాహినిగా నియమించాడు.

తర్వాత వెలనాడు పరిపాలిస్తున్న పెద్విశ్వరుడిని ఓడించి వెలనాడును జయించాడు. తదుపరి కోటరాజ్యం(రాజధాని ధరణికోట)ను పరిపాలిస్తున్న కోట రుద్రుడిపై దాడి చేసి అతని కుమారుడు అయిన బేతరాజుకు గణపతిదేవుడు పెద్దకుమార్తె అయిన గుణపాంబను ఇచ్చి పెళ్లి చేశాడు. 

నిడదవోలును పరిపాలిస్తున్న చాళుక్యవీరభద్రునికి తన కూతురు రుద్రాంబ(రుద్రమదేవి)ను ఇచ్చి వివాహం జరిపించాడు. 

కాకతీయుల పాలనలలో నాడులను రాష్ట్రలుగా భావించేవారు. చోడ తిక్కన (తెలుగు చోళులు - నెల్లూరు ప్రాంతం) మరియు సేవణల మద్య జరిగిన కరువులూరు యుద్దానికి గణపతిదేవులు సహకారం అందించాడు. ఇట్టి కరువులూరు యుద్దంలో చోడ తిక్కన విజయం సాధించడానికి గణపతిదేవుడు ముఖ్యపాత్ర వహించాడు. చోడ తిక్కన మరణాంతరం రెండోమనమసిద్ది రాజ్యధికారం చేపట్టడం జరిగింది. ఇది ఇష్టంలేని రెండోమనమసిద్ది పాలివారు అయిన తిక్కన మరియు బయ్యాన రెండోమనమసిద్దిని సింహాసనం నుండి దించివేస్తారు. రెండోమనుమసిద్దికి మద్యవర్తిగా తిక్కసోమయాజి గణపతిదేవుని వద్దకు రావడంతో గణపతిదేవుడు తన ఆస్థానంలోని సామంతభోజుడుని రెండోమనుమసిద్దిని పంపి పలయ్యారు యుద్దంలో తిక్కన, బయ్యనలను ఓడించి తిరిగి రెండోమనమసిద్దిని సింహాసనం అధిష్టించేలా చేయడం జరిగింది. యుద్దం గెలిచేలా సహకారం అందించిన గణపతిదేవునికి కానుకగా ‘‘మోటుపల్లి’’ ఓడరేవుని కానుకగా ఇచ్చాడు రెండోమనమసిద్ది. 

కాకతీయుల ప్రముఖమైన ఓడరేవు, మరియు స్థానిక, విదేశీ వ్యాపారాలు మోటుపల్లి ఓడరేవు కేంద్రంగానే జరిగాయి. మోటుపల్లి ఎలాంటి అవంతరాలు, దొంగల భయం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించడానికి ‘‘మోటుపల్లి వర్తక అభయ’’ శాసనం వేయించాడు. దీనికి సిద్దయ్యదేవుడు అనే అధికారిని నియమించాడు. 

మళ్లీ 2వమనమసిద్దిపైన పాండ్యులు రాజు జటావర్మసుందరపాండ్యుడు దాడి చేయడం జరిగింది. జటావర్మసుందరపాండ్యుడు మరియు రెండోమనమసిద్ది మద్యన జరిగిన ఈ ముత్తుకూరు యుద్దానికి మళ్లీ గణపతిదేవుడు సహకారం అందించాడు. కానీ ఈ యుద్దంలో 2వ మనమసిద్ది మరణించడం జరిగింది.  గణపతిదేవుడు పరిపాలనలో ఓడిపోయిన ఒకేఒక యుద్దం ‘‘ముత్తుకూరు’’ యుద్దం పేరుగాంచింది. 

ఇతనికి ప్రధాన సేనాధిపతి - రేచర్ల రుద్రుడు, గజసేనాధిపతి - జయపసేనాని, అశ్వదళాధిపతి - గంగయసేనాని ఉండేవారు. ప్రధాన సేనాధిపతి అయిన రేచర్లరుద్రుడు రామప్ప చెరువును నిర్మించాడు. కాకతీయుల కాలంలో పాకాల చెరువును జగదల ముమ్మడి నిర్మించాడు. లక్కవరం చెరువును గణపతిదేవుడు, చౌడ సముద్రంను మల్యాల చౌడప్ప, బయ్యారం చెరువును మైలాంబ నిర్మించడం జరిగింది. గణపతిదేవుడు యొక్క గురువు విశ్వేశ్వర శంబువు పేరుగాంచాడు. కాకతీయుల కాలంలో దాదాపు 12000 శైవ ఆలయాలు నిర్మించడం జరిగింది. ఇతని కాలంలో శాంతిభద్రతలు పరిరక్షించడానికి వీరభద్రుల దళం ఏర్పాటు చేసారు. 

➙ బిరుదులు 

గణపతిదేవునికి ‘‘ఆంధ్రాదిశుడు, పృద్విశ్వర, క్రీడావినోద, సకలదేశ ప్రతిష్టాపనచార్య, చోడకటకచూరకార , మహమండలేశ్వర, సమద్వి‘గత పంచమశబ్ద, రాయగజకేసరి అనే బిరుదులు కలవు. 

➙ గ్రంథాలు 

జయపసేనాని నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి అనే రచనలు చేసాడు. 

➠ రాణిరుద్రమదేవి (1262 - 1289) :-

రాణిరుద్రమ దేవి తండ్రి గణపతిదేవునికి ముగ్గురు భార్యలు సోమలదేవి, నారంబ, పేరాంబ లు ఉన్నారు. పేరాంబ యొక్క కుమార్తెనే రుద్రాంబ (రాణిరుద్రమదేవి). గణపతిదేవుని తర్వాత కాకతీయ సామ్రాజ్య సింహసనాన్ని అధిష్టించి దక్షిణ భారతదేశంలో సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళా పాలకురాలిగా కీర్తి సాధించింది.(భారతదేశంలో సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళ రజియా సుల్తానా)  రాణిరుద్రమదేవి ప్రవేశపెట్టిన ప్రసూతి సౌకర్యాల కల్పన గురించి "మల్కాపురం" (ప్రకాశం) శిలాశాసనంలో చర్చించడం జరిగింది. రాణిరుద్రమదేవి అధికారంకు సంబందించిన విషయాలు "మోటుపల్లి" శిలాశాసనంలో ఉన్నాయి. కాయస్థ జన్నిగదేవుడు వేసిన "దుర్గి" శిలాశాసనంలో పటోదృతి (ఎన్నిక ద్వారా పరిపాలనలోకి రావడం) ద్వారా రుద్రమదేవి అధికారంలో వచ్చిన విషయాన్ని తెలియజేస్తుంది. బీదర్‌కోట శిలాశాసనంలో ఈమెకు ‘‘రాయగజకేసరి’’ అనే బిరుదు ఉన్నదని తెలుస్తుంది. పువ్వుల గుమ్మడి వేసిన చందుపట్ల (నల్గొండ) శిలాశాసనం రాణిరుద్రమదేవి మరణం గురించి తెలియజేస్తుంది. ఈ శాసనం ద్వారా ఈమె 1289 సంవత్సరంలో అంబదేవుడితో జరిగిన ‘‘త్రిపురాంతక’’ యుద్దంలో మరణించినట్లు తెలుస్తుంది. 

➙ వ్యక్తిగత సమాచారం 

రాణిరుద్రమదేవి యుద్దవిద్యలు, రాజనీతి, గుర్రపు స్వారీ శివదేవయ్య వద్ద, నృత్యరీతులు జయపసేనాని (మేనమామ) వద్ద, సంగీతంను కొంకనభట్టు వద్ద నేర్చుకోవడం జరిగింది. ఈమె శైవమతగురువు విశ్వేశ్వర శంభువుకు మందడం అనే గ్రామాన్ని ఇచ్చింది. రుద్రమదేవి నిడదవోలు రాజు అయిన చాళుక్య వీరభద్రుడిని వివాహం చేసుకోవడం జరిగింది. 

రాణిరుద్రమదేవి సంతానంలో భిన్నాభిప్రాయాలున్నాయి. చారిత్రక సమాచారం ప్రకారం రుద్రమదేవికి రుయ్యమ్మ, రుద్రమ్మ, మమ్ముడమ్మలు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈమె మరణాంతరం మమ్ముడమ్మ - మహదేవుడు కుమారుడైన రెండో ప్రతాపరుద్రుడు (మనుమడు) సింహసనాన్ని అధిష్టించాడు. 

ఈమె రాజ్యానికి సైనిక నాయకులు రాచర్ల ప్రసాదిత్యుడు, కాయస్త జన్నిగదేవుడు, గోనాగన్నారెడ్డిలు ఉన్నారు. ఇందులో రేచర్ల ప్రసాదిత్యుడికి ‘‘కాకతీయ రాజ్య స్థాపనాచార్య’’ ‘‘రాయపితామహంత’’ అనే బిరుదులు కలవు. గోనగన్నారెడ్డి కుమారుడు గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణం తెలుగులో రచించాడు. గోనగన్నారెడ్డి అనే నవలను అడవిబాపిరాజు రచించడం జరిగింది. ఈమె కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన విదేశీయాత్రికుడు మార్కోపోలో. ఈమె నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేసింది. తదనంతర కాలంలో ఈ నాయంకర వ్యవస్థ వల్లే కాకతీయ సామ్రాజ్యం అంతమైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ఈమెకు రుద్రదేవ మహరాజు, రాయగజకేసరి, పటోదృత్తి అనే బిరుదులున్నాయి.  

➠2వ ప్రతాపరుద్రుడు (1989 - 1323) :-

ఇతను  హదేవుడు - మమ్ముడమ్మల కుమారుడు. ఇతని ఆస్థాన కవి విద్యానాథుడు / ఆగస్తుడు. విద్యానాథుడు ప్రతాపరుద్రయశోభూషణం అనే పుస్తకాన్ని రచించాడు. 1291 లో సేనాపతి ఇందులూరి ఇన్నయ / అన్నయ నాయకత్వంలో అంబదేవుడిపై యుద్దం చేసి అతన్ని ఓడించాడు. ఈ విషయం త్రిపురాంతక శాసనం ద్వారా తెలుస్తుంది. 

➙ ముస్లీం దండయాత్ర 

ఇతని కాలంలో కాకతీయ రాజ్యంపై ముస్లీం సుల్తానులు ఎన్నిసార్లు దండయాత్ర చేశారనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

కాసే సర్వప్ప ప్రతాప చరిత్ర, ప్రోలయనాయకుడి యొక్క విలాసతాంబ్ర శాసనం, రెడ్డిరాణి అనితల్లి యొక్క కల్వలచెరువు శిలాశాసనాల ప్రకారం ముస్లీం సుల్తానులు కాకతీయ సామ్రాజ్యంపై 8 సార్లు దండయాత్ర చేశారని తెలపడం జరిగింది. 

అమీర్‌కుస్రు, ఫెరిస్టో, అబ్దుల్‌ వాసిఫ్‌ రచనల ప్రకారం ముస్లీం సుల్తానులు కాకతీయ సామ్రాజ్యంపై 5 సార్లు దాడి చేశారని చెబుతున్నాయి. కానీ చరిత్ర ప్రకారం 5 సార్లు జరిగిన దండయాత్ర వివరాలు మాత్రమే దొరికాయి. 

  • 1వ, 2వ దండయాత్ర   - అల్లావుద్దిన్‌ ఖిల్జి
  • 3వ దండయాత్ర - ముబారక్‌ ఖిల్జి 
  • 4వ, 5వ దండయాత్ర - షియాజోద్దిన్‌ తుగ్లక్‌ 

➙ 1వ దండయాత్ర (1303) 

1వ దండయాత్ర అల్లావుద్దిన్‌ ఖిల్జి కాలంలో జరిగింది. ఈ దండయాత్రకు మాలిక్‌ ప్రకృద్దిన్‌ జునా నాయకత్వం వహించాడు. ఉప్పరపల్లి వద్ద జరిగిన ఈ యుద్దంలో 2వ ప్రతాప రుద్రుడు విజయం సాధించాడు. కరీంనగర్‌ జిల్లా ఉప్పరవల్లి వద్ద కాకతీయ సైన్యాలు ముస్లీం సేనలను ఓడించి తరిమివేశాయి. 

➙ 2వ దండయాత్ర (1309)

2వ దండయాత్ర మళ్లీ అల్లావుద్దిన్‌ ఖిల్జి కాలంలో జరిగింది. ఈ దండయాత్రకు మాలిక్‌ ఖపూర్‌ జునా నాయకత్వం వహించాడు. ఈ యుద్దంలో 2వ ప్రతాప రుద్రుడు పరాజయం సాధించాడు. కప్పం చెల్లించి సామంత రాజుగా ఉండేందుకు ఒప్పుకోవడం జరిగింది. 

 ➙ 3వ దండయాత్ర (1316)

2వ ప్రతాపరుద్రుడు ఒప్పంద ప్రకారం కప్పం చెల్లించకపోవడంతో ఈ 3వ దండయాత్ర జరిగింది. ఈ 3వ దండయాత్ర ముబారక్‌ ఖిల్జితో జరిగిన యుద్దంలో రెండో ప్రతాపరుద్రుడు ఓడిపోవడం జరిగింది. దీంతో మళ్లీ కప్పం చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. 

➙ 4వ దండయాత్ర (1321) 

ఘియాజోద్దిన్‌ తుగ్లక్‌ కాలంలో జునాఖాన్‌ తన సైన్యంతో కాకతీయ సామ్రాజ్యంపై దండేత్తడానికి వచ్చిన సమయంలో ఘియాజోద్దిన్‌ తుగ్లక్‌ మరణించాడని జ్యోతిష్కుడు ఉభయ్యద్‌ ఇచ్చిన సమాచారంతో ఘియాజోద్దిన్‌ కొరకు జునాఖాన్‌ యుద్దాన్ని మద్యలో నిలిపివేసి తిరిగి ఢిల్లీ వెళుతున్న సమయంలో 2వ ప్రతాప రుద్రుడు జునాఖాన్‌ సైన్యంపై దాడి చేసి తీవ్ర నష్టం చేయడం జరిగింది. 

➙ 5వ దండయాత్ర (1321)

ఘియాజోద్దిన్‌ తుగ్లక్‌ కాలంలో జునాఖాన్‌ తన సైన్యంతో కాకతీయ సామ్రాజ్యంపై మళ్లీ దండేత్తి కాకతీయ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడం జరిగింది. 

ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత కాకతీయ రాజ్యానికి సంబందించిన వ్యక్తులను బంధీలుగా చేసుకున్నారు. ఇందులో రెండో ప్రతాపరుద్రుడు - మచాలదేవిలను బంధీలుగా చేసుకొని ఢిల్లీ వెళుతుండగా వీరు నర్మదా / సమోద్బావ నదిలో దూకి మరణించడం జరిగింది. ఈ విషయం "విలాస" శాసనం ద్వారా తెలుస్తుంది. హరిహర, బుక్కరాయలు కూడా నర్మదా నదిలో దూకి తప్పించుకోవడం జరిగింది. జగన్నాథపండితుడిని బుర్వానుద్దిన్‌గా పేరు మార్చి ఢిల్లీ సుల్తానుల తరపున సుల్తాన్‌పూర్‌ (ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుకు పెట్టిన పేరు) ను పరిపాలకుడిగా నియమించారు. గన్నమనాయుడిని మాలిక్‌ మగ్భుల్‌గా పేరుమార్చి ప్రధానమంత్రిగా నియమించారు. 

Tspsc Telangana History :

➠ కాకతీయుల ఆర్థిక వ్యవస్థ :-

కాకతీయుల కాలంలో 1/6 వంతు భూమి శిస్తు వసూలు చేశారు. వీరికాలంలో భూమిశిస్తును ‘అరి’ అని భూమి శిస్తు చెల్లించే రైతులను ‘అరిగాపులు’ అని పిలిచేవారు. ఈ భూమి శిస్తును ధన రూపంలో ధాన్య రూపంలో వసూలు చేసేవారు. ధన రూపంలో వసూలు చేసేదానిని ‘పుట్టి హుండి ’ అని, ధాన్యరూపంలో వసూలు చేసే దానిని ‘పుట్టికొలుపులు’ అని పిలిచేవారు.  వ్యవసాయభివృద్ది కొరకు చెరువు నిర్మాణాలు చేపట్టి చెరువుల పరివాహక ప్రాంతాలలో ‘‘దశబంధమాన్యం’’ పద్దతిలో భూమిపై 10% శిస్తు వసూలు చేసేవారు. ఇలా వసూలు చేసిన శిస్తును చెరువుల అభివృద్దికి ఉపయోగించేవారు. 

➠ కాకతీయులు షార్ట్‌ బిట్స్‌ :-

  • తొలికాకతీయులు జైన మంతం అనుసరించినారు. మలి కాకతీయులు హైందవ / శైవ మతం అనుసరించినారు.
  • కాకతీయుల కాలంలో సంస్కృతం అధికార మరియు శాసన భాషగా ఉండేది. వీరి యొక్క మాతృభాష తెలుగు భాష ప్రసిద్ది చెందింది. 
  • కాకతీయుల కాలంలో వరాహం రాచలాంచనంగా ఉండేది. 
  • కాకతీయుల కాలంలో పేరిణి శివతాండవం ప్రసిద్ది చెందింది. 
  • కాకతీయుల అంగరక్షుల దళాన్ని లెంకలు అని పిలిచేవారు. 
  • వీరికాలంలో కాకతీయ సామాజ్య్రాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో యాత్రికుడు. 
  • మొదటి ప్రోలరాజుకు ‘‘సమద్విసత పంచమశబ్ద ’’ ‘‘అరిగజకేసరి’’ , ‘‘కాకతీవల్లభ’’ అనే బిరుదులున్నాయి. 
  • మొదటి పోలరాజు, రెండవబేతరాజు, దుర్గరాజుల యొక్క గురువుగా రామేశ్వర పండితుడు ఉన్నాడు.
  • రెండో బేతరాజుకు చలమార్తిగండ, త్రిభువనమల్ల, మహమండలేశ అనే బిరుదులు కలవు. 
  • రెండో ప్రోలరాజు కాలంలో సిద్దేశ్వరాలయం, స్వయంబు ఆలయం, పద్మాక్షి ఆలయం (దీనిని ఇండో ఇస్లామిక్‌ శైలిలో నిర్మించారు) నిర్మించారు. 
  • రెండో ప్రోలరాజు యొక్క మంత్రి బేతనమాత్యుని భార్య మైలమ జైనసన్యాసుల కోసం కొడలాలయ బసిది నిర్మించి ఇవ్వడం జరిగింది.
  • పువ్వుల గుమ్మడి వేసిన చందుపట్ల (నల్గొండ) శిలాశాసనం రాణిరుద్రమదేవి మరణం గురించి తెలియజేస్తుంది. ఈ శాసనం ద్వారా రాణిరుద్రమదేవి 1289 సంవత్సరంలో ‘‘త్రిపురాంతక’’  యుద్దంలో మరణించినట్లు తెలుస్తుంది. 
  • రాణిరుద్రమదేవికి రుద్రదేవ మహరాజు, రాయగజకేసరి, పటోదృత్తి అనే బిరుదులున్నాయి.  
  • రాణిరుద్రమదేవి నాయంకర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. 
  • రాణిరుద్రమదేవి మట్టికోటగా ఉన్న ఓరుగల్లు కోటను రాతి కట్టడంగా మార్చింది. కోట ఎక్కడానికి మెట్లు కట్టించింది.
  • కాకతీయుల కాలంలో ఆగస్త్యుడు బాలభారతం, కృష్ణచరితం అనే గ్రంథాలు రచించాడు. 
  • కాకతీయు కాలంలో పాల్కురికి సోమనాథుడు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిపశతకం అనే గ్రంథాలు రచించాడు. 
  • తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణంను వ్రాసి మనుమసిద్దికి అంకితమిచ్చాడు. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. ఇతని శిష్యులు మారన మార్కండేయ పురాణం, బద్దెన నీతిశాస్త్రముక్తవళి, సుమతిశతకము అనే గ్రంథాలు రచించారు. 
  • ప్రతాపరుద్రుని ఆస్థానంలో జీవించిన అప్పయాచార్యులు అనే జైనకవి జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథం రచించాడు. 
  • అన్నలదేవి చెక్కించిన ద్రాక్షరామ శిలాశాసనంలో రుద్రదేవుడు వినయభూషుణుడు, విద్యాభూషణుడు అని పేర్కొనడం జరిగింది. 
  • హేమాద్రి అనే కవి వ్రాసిన వ్రతఖండం గ్రంథంలో యాదవ రాజు జైతూగి చేతిలో రుద్రదేవుడు/మొదటి ప్రతాపరుద్రుడు మరణించినట్లు తెలపడం జరిగింది. 


మూలపురుషుడు వెన్నమాత్యుడు
వంశస్థాపకుడు కాకర్త్య గుండన
రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు
స్వతంత్ర రాజ్యం మొదటి ప్రతాపరుద్రుడు / రుద్రదేవుడు
గొప్పరాజు గణపతిదేవుడు
చివరిరాజు రెండో ప్రతాపరుద్రుడు
మహిళ పాలకురాలు రాణి రుద్రమదేవి


తొలి కాకతీయులు
మొదటి బేతరాజు
మొదటి ప్రోలరాజు
రెండవ బేతరాజు
దుర్గరాజు
రెండవ ప్రోలరాజు
మలి కాకతీయులు
మొదటి రుద్రదేవుడు
మహాదేవుడు
గణపతిదేవుడు
రాణి రుద్రమదేవి
రెండవ ప్రతాపరుద్రుడు


సప్త సంతానం
1) అగ్రహార (గ్రామం) ప్రతిష్ఠ
2) ఆలయ ప్రతిష్ఠ
3) తటాక నిర్మాణం
4) వన ప్రతిష్ఠ
5) ధన నిక్షేపం
6) ప్రబంధ రచన
7) స్వసంతానం (పుత్రికలు)
కౌటిల్యుడి ప్రకారం సప్తంగాలు
1) రాజ్యం
2) రాజు
3) మంత్రి
4) సైనికుడు
5) కోట
6) ఖజానా
7) మిత్రుడు


కాకతీయుల కాలంలో విధించిన వివిధ పన్నులు
పెమసుంకం పట్టణాలలో సంతలు
అమ్మబడి వస్తుసామాగ్రి
పెరికెడ్ల ఎడ్లబండ్లపై
మడిగ దుకాణాలు
కిలరం గొర్రెల మీద
దొగంచి యువరాజు ఖర్చులకు
పడేగల సైకన ఖర్చుల కోసం
అలం కాయగూరలపై
అప్పనం / ఉపకృతి ప్రభుత్వ అధికారులను కలుసుకోవడానికి
పుల్లరీ పశుగ్రాసం, వంటచెరుకు
గణచారి వేశ్యలు, బిచ్చగాళ్లపై


కాకతీయులు సాహిత్యం
రచించినవారు గ్రంథాలు
మొదటి రుద్రదేవుడు నీతిసారం
బద్దెన నీతిసార ముక్తావళి
శివదేవయ్య పురుషార్థసారం
మడిక సింఘన సకలనీతి సమ్మతం
రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామం
వినుకొండ వల్లభాచార్యుడు క్రీడాభిరామం
విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం(మొట్టమొదటి అలంకార గ్రంథం),బాలభారతం, నలకీర్తికౌముది, కృష్ణచరితం
జయపసేనాని నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాద్యరత్నావళి,
గోనబుద్దారెడ్డి రంగనాథరామాయణం

Also Read :

Telangana History : Satavahana Dynasty in telugu

Telangana History : Qutub Shahi Dynasty in telugu

Telangana History : Ikshavku Dynasty in telugu

Post a Comment

0 Comments