KVS PGT, TGT Recruitment
కేంద్ర పాఠశాలల్లో టీచింగ్ ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సీబీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం అన్ని విభాగాల్లో 14967 పోస్టులను భర్తీ చేయనుంది.
కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో ఖాళీలను ఉమ్మడి పరీక్షతో సీబీఎస్‌ఈ భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుండి అయిన విధులు నిర్వహించాలి.
పోస్టులు :
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
ఖాళీలు - 2996
విద్యార్హత - సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ, బీఎడ్ ఉత్తీర్ణత
వయస్సు - 40 సంవత్సరాలకు మించరాదు
ప్రైమరీ టీచర్
ఖాళీలు- 2684
విద్యార్హత - ఇంటర్మిడియట్‌తో పాటూ 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు పూర్తి చేయాలి.
లేదా 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటేడ్ డిగ్రీబీఎడ్.
వీటితో పాటు సీటెట్ పేపర్-1 లో అర్హత సాధించాలి
వయస్సు - 30 సంవత్సరాలకు మించరాదు
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
ఖాళీలు - 6215
విద్యార్హత - సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, బీడెన పూర్తి చేసి, సీటెట్‌లో అర్హత సాధించాలి
వయస్సు - 35 సంవత్సరాలకు మించరాదు.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
ఖాళీలు - 1312
విద్యార్హత - ఇంటర్మిడియట్ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తి చేయాలి. ఇంగ్లీష్‌లో నిమిషానికి 35, హిందీ అయితే 30 పదాలు కంప్యూటర్‌పై టైప్ చేయాలి
వయస్సు - 27 సంవత్సరాలు మించరాదు
వీటితో పాటు అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, లైబ్రేరియన్, ప్రైమరీ టీచర్ మ్యూజిక్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్‌లు ఉన్నాయి. గరిష్ట వయస్సులో ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
పరీక్షా విధానం :
- టైర్-1
- టైర్-2
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ధరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులందరు రూ॥500/- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి
- ఫరీక్ష ఫీజు పోస్టు ప్రకారం రూ॥1200 నుండి 2300 వరకు ఉంటుంది
- ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు లేదు.
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 04 డిసెంబర్ 2025
For Online Apply

0 Comments