Income Tax Department Sports Quota Income Tax | Latest Jobs in Telugu | Latest Notifications
ఆదాయపు పన్ను శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు శుభవార్త. ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయం, ఢిల్లీ రీజియన్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన క్రీడాకారులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Income Tax Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | ఆదాయపు పన్ను శాఖ, ఢిల్లీ రీజియన్ |
| నియామక విధానం | స్పోర్ట్స్ కోటా |
| మొత్తం ఖాళీలు | 119 |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| వయోపరిమితి | 18 నుంచి 27 సంవత్సరాలు |
| ఉద్యోగ ప్రాంతం | ఢిల్లీ రీజియన్ |
పోస్టుల వివరాలు
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| టాక్స్ అసిస్టెంట్ (Tax Assistant) | 44 |
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (Stenographer Grade-II) | 9 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 66 |
| మొత్తం | 119 |
విద్యార్హతలు
పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి.
క్రీడా అర్హతలు
- అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు.
- ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో పాల్గొని గుర్తింపు పొందిన క్రీడాకారులు.
- నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు.

Social Plugin