ఎం.ఐ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ (MI Scholarship Programme)

 



ఎం.ఐ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ (MI Scholarship Programme)

‘‘షియోమి ఇండియా’’ మోబైల్‌ ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌, గృహోపకరణాలు మరియు ఇతర వస్తువుల ఉత్పత్తిలో పేరేన్నికగన్న మల్టినేషనల్‌ కంపనీ. తన సి.ఎస్‌.ఆర్‌ (కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి) లో భాగంగా విద్యార్థినివిద్యార్థుకు ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. 

‘‘ఎం.ఐ’’ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ షియోమి ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. చదువులో ఉత్తమ ఫలితాలు సాధించి పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ పై చదువులు చదవడానికి ఇబ్బందు పడుతున్న నిరుపేద విద్యార్థినివిద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ అందించడం జరుగుతుంది. ఈ స్కాలర్‌షిప్‌ కింద 70 శాతం మార్కులు సాధించి 11వ, 12వ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ పై చదువులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి ఇట్టి ఉపకార వేతనం అందించడం జరుగుతుంది. 

ఉపకార వేతనం మొత్తం :

  • 3,800 రూపాయల వరకు (11 మరియు 12వ తరగతి)
  • 5,800 రూపాయల వరకు (డిగ్రీ)

అర్హతలు :

1) భారతదేశ విద్యార్థినివిద్యార్థులు అయి ఉండాలి 

2) 11వ, 12వ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అయి ఉండాలి.

3) 70 శాతం మార్కుతో ఉత్తీర్ణత సాధించాలి 

కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

1) పాస్‌పోర్టు సైజు ఫోటో 

2) మార్కుల మెమో 

3) గుర్తింపు ధృవపత్రం ( ఆధార్‌ కార్డు)

4) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్‌ గుర్తింపు కార్డు ( అడ్మిషన్‌ లెటర్‌/ ఐడి కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికేట్‌) 

5) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న ఫీజు రశీదు

6) అభ్యర్థి బ్యాంక్‌ ఖాతా బుక్‌ / క్యాన్సల్‌ చెక్‌ 

7) ఆదాయం సర్టిఫికేట్‌ / అఫిడవిట్‌ 

చివరి తేది.30-04-2021

For Online Apply visit Rajanna Xerox & D.T.P Centre


Post a Comment

0 Comments