డిఎక్స్‌సి ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్‌షిప్ (DXC Progressing Minds Scholarship 2020-21)
గ్లోబల్ ఫార్చున్ 500 సంస్థ అయిన డిఎక్స్‌సి టెక్నాలజి అర్హులైన బిఈ/బిటెక్ విద్యార్థుల నుండి స్కాలర్‌షిప్ సహాయం అందించడం కోసం ధరఖాస్తును ఆహ్వనిస్తుంది.
ఈ జాతీయ స్థాయి డిఎక్స్‌సి ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద కంప్యూటర్ సైన్స్, ఇన్మర్మేషన్ టెక్నాలజి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ స్ట్రీమ్స్‌లో కోర్సును అభ్యసిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బిఈ) మరియు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజి (బి.టెక్) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆర్థిక సహాయం పొందవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి వారి మొత్తం కోర్సు ఫీజులో 50 శాతం వరకు లేదా 40,000(నలబై వేలు) రూపాయల వరకు అందిస్తుంది. అన్నివర్గాల విద్యార్థులకు వారి మత, సమాజిక అంశాలతో సంబందం లేకుండా ఈ స్కాలర్‌షిప్ ప్రోత్సాహం అందించడం జరుగుతుంది.
డిఎక్స్‌సి ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు కింద తెలియజేయడం జరిగింది.
డిఎక్స్సి ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్‌షిప్ రివ్యూ |
|
చివరితేది |
15 జూన్ 2021 |
తరగతి/కోర్సు |
బిఈ/బిటెక్ మొదటి సంవత్సరం |
స్కాలర్‌షిప్ రకం |
ప్రతిభ ఆధారంగా |
అవార్డు మొత్తం |
40,000 |
జెండర్ |
అందరూ |
రిలిజియన్ |
అందరూ |
దేశం |
భారతదేశం |
ఆన్‌లైన్ ధరఖాస్తు |
|
1) బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బిఈ)/బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజి (బి.టెక్) (సిఎస్/ఐటి/ఈఈ/ఈసి) లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
2) ఖచ్చితంగా భారత విద్యార్థులు అయి ఉండాలి
3) గత కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
4) కుటుంబ సంవత్సర ఆదాయం 4 లక్షలకు మించరాదు.
5) అభ్యర్థులు ఇతర ఏ రకమైన స్కాలర్‌షిప్ లబ్ది పొందరాదు.
6) డిఎక్స్‌సి మరియు బడ్డి4స్డడీ ఉద్యోగుల పిల్లలు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
ఎంపిక ప్రక్రియ :
డిఎక్స్‌సి ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వారి ఆర్థిక నేపథ్యం, ప్రతిభ, ఇంటర్యూ ఆధారంగా ఎంపిక చేసి స్కాలర్‌షిప్ రూపాయలు అందించడం జరుగుతుంది.
1) ఆర్థిక అవసరం మరియు విద్యా నేపథ్యం ఆధారంగా స్కాలర్‌షిప్ ధరఖాస్తు పరిశీలన జరుగుతుంది.
2) అభ్యర్థులను ఆర్థిక అవసరం, తమ అకడమిక్ కోర్సులో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
3) షార్ట్‌లిస్టు అయిన విద్యార్థులను టెలిఫోనిక్ ఇంటర్యూ ద్వారా తుది ఎంపిక చేయడం జరుగుతుంది.
స్కాలర్‌షిప్ మొత్తం :
1) 50 శాతం వరకు లేదా 40,000(నలబై వేలు) రూపాయల వరకు (ఏది తక్కువ ఐతే అది అందిస్తుంది)
కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
1) పాస్‌పోర్టు సైజు ఫోటో
2) మార్కుల మెమో
3) గుర్తింపు ధృవపత్రం
4) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్ గుర్తింపు కార్డు ( అడ్మిషన్ లెటర్/ ఐడి కార్డు/ బోనఫైడ్ సర్టిఫికేట్)
5) అభ్యర్థి బ్యాంక్ ఖాతా బుక్ / క్యాన్సల్ చెక్
6) ఆదాయం సర్టిఫికేట్ / అఫిడవిట్
ఎలా ధరఖాస్తు చేసుకోవాలి :
1) తమ రిజిస్ట్రేషన్ ఐడితో బడ్డీ4స్టడీ లోకి లాగిన్ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి ఈమేయిల్/మోబైల్/ఫేస్‌బుక్/జిమేయిట్ అకౌంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.)
2) లాగిన్ అయిన తర్వాత మీరు డిఎక్స్‌సి ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్‌షిప్ అప్టికేషన్‌కు రిడైరెక్ట్ అవుతారు.
3) తర్వాత స్టార్ట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. (స్టార్ట్ అప్లికేషన్ నొక్కే ముందు స్కాలర్‌షిక్‌కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి)
4) ఆన్‌లైన్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి
5) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్‌లోడ్ చేయాలి
6) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి
7) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్‌మిట్ బటన్ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు :
- చివరితేది. 15-06-2021
పూర్తి సమాచారం కోరకు :
ఈ స్కాలర్‌షిప్ పథకానికి అర్హత ఉన్న విద్యార్థులు తమ ధరఖాస్తును చివరితేదికి ముందే సమర్పించాలి.
0 Comments